రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్‌తో సల్మాన్‌ ఖాన్‌, పుకార్లకి బలం.. ఆ డైరెక్టర్‌ ఆఫీస్‌లో ఏం పని?

Published : Feb 23, 2025, 11:49 AM IST

సల్మాన్ ఖాన్, ఆయన నాన్న సలీమ్ ఖాన్, యూలియా వంతూర్ సాజిద్ నాడియాడ్వాలా ఆఫీసులో కనిపించారు. ఏమైనా కొత్త సినిమా వస్తుందా?

PREV
15
రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్‌తో సల్మాన్‌ ఖాన్‌, పుకార్లకి బలం.. ఆ డైరెక్టర్‌ ఆఫీస్‌లో ఏం పని?

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబైలో కనిపించారు. ఈ సమయంలో అతను చాలా సాధారణంగా కనిపించాడు. కాజ్వల్‌ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఆయన డ్రెస్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 

25

అదే సమయంలో సల్మాన్‌తో పాటు ఆయన తండ్రి సలీం ఖాన్ కూడా కనిపించారు. ఇద్దరూ సాజిద్ నాడియాడ్వాలా ఆఫీసుకి వెళ్లారు. వీరిద్దరు కలిసి వెళ్లడంతో అంతా చర్చనీయాంశం అవుతుంది. దీనికితోడు ఇందులో మరో ట్విస్ట్ ఉంది. 

35

ముఖ్యంగా సల్మాన్ ఖాన్‌తో పాటు అతని రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్ యూలియా వంతూర్ కూడా ఉంది. తండ్రితోపాటు ప్రియురాలు కూడా సాజిద్‌ ఆఫీస్‌కి రావడం, వీరంతా ఒకరి తర్వాత ఒకరు వెళ్లడంతో రూమర్లు మరింత ఊపందుకున్నాయి. కొత్త అనుమానాలకు తావిస్తుంది. వీరంతా కలిసి సాజిద్‌ నడియడ్‌ వాలా ఆఫీస్‌కి ఎందుకు వెళ్లారనేది ఆసక్తికరంగా మారింది. 

45

సల్మాన్‌ను ఇలా చూడటంతో ఆయన సాజిద్ నాడియాడ్వాలాతో కలిసి ఏదైనా సినిమాలో కనిపిస్తారా? సినిమా కోసమే చర్చలు జరిగాయా? సల్మాన్‌ సరసన ప్రియురాలు కనిపించబోతుందా అనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఇదే ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశం అవుతుంది. మరి దీని వెనుక కథేంటో తెలియాల్సి ఉంది. 
న్నారు.

55

సల్మాన్ ఖాన్ ప్రస్తుతం 'సికిందర్' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వరుస ఫ్లాప్‌లున్న నేపథ్యంలో `సికిందర్‌` సినిమాని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సల్మాన్‌. ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తున్నారు. ఈ ఈడ్‌కి ఈ మూవీ రాబోతుంది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తుండటం విశేషం. చూడబోతుంటే ఈ మూవీ హిట్టే అని తెలుస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories