ప్రభాస్ టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా రాణిస్తున్నారు. ఆస్తుల పరంగా పెద్దగా వార్తల్లో లేని డార్లింగ్ ఫ్యామిలీకి వేల కోట్ల ఆస్తులున్నాయట. ముఖేష్ అంబానీని మించిన ఆస్తులు వారి సొంతమనే నిజం బయటకు వచ్చింది.
ప్రభాస్.. కృష్ణంరాజు నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇండియాలోనే అతిపెద్ద హీరో. ప్రపంచ సినిమాకి ఫేసాఫ్‌గా ప్రభాస్ నిలిచారు. ఇండియన్ సినిమాకి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ప్రపంచం మన వైపు తిరిగి చూసేలా చేశారు. ఇప్పుడు భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. `ఫౌజీ`, `స్పిరిట్` చిత్రీకరణ దశలో ఉన్నాయి. `కల్కి 2`, `సలార్ 2` చిత్రాలు ప్రారంభం కావాల్సి ఉంది. అలాగే ప్రశాంత్ వర్మతో ఓ కమిట్‌మెంట్ ఉంది. హోంబలేలో మరో రెండు కమిట్‌మెంట్స్ ఉన్నాయి. ఇలా మరో ఐదారేళ్ల వరకు ప్రభాస్ బిజీగా ఉన్నారు.
25
వేల కోట్ల ఆస్తులకు అధిపతి ప్రభాస్ ఫ్యామిలీ
ప్రభాస్‌ది రాజుల ఫ్యామిలీ అనే విషయం తెలిసిందే. భీమవరం రాజుల కుటుంబానికి చెందిన వారు. ప్రభాస్ ఫ్యామిలీ రాజుల కుటుంబం అయినా, ఆయన ఆస్తులకు సంబంధించిన సమాచారం పెద్దగా లేదు. ఆయన టాలీవుడ్‌లో ఓ సాధారణ హీరోగానే ఉన్నారు. నాగార్జున, చిరంజీవి వంటి వారితో పోల్చితే ప్రభాస్ కి ఉన్న ఆస్తులు తక్కువే అంటుంటారు. కానీ వారికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయట. ఆ రహస్యాలను బయటపెట్టారు ప్రముఖ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి. ఆయన కూడా రాజుల ఫ్యామిలీకి చెందినవారే. తాజాగా ప్రభాస్ ఫ్యామిలీకి సంబంధించిన సంచలన నిజాలను వెల్లడించారు.
35
9 సంస్థానాలను పాలించిన ప్రభాస్ ముత్తాతలు
ప్రభాస్ ముత్తాతలు రాజులు. భీమవరం నుంచి సమీపంలోని దాదాపు 9 సంస్థానాలు తమ పరిధిలో ఉండేవట. వాటిని వారే పాలించేవారు. వేల ఎకరాలు కాదు, లక్షల ఎకరాలు వారి ఆధీనంలో ఉండేవట. వాటిలో పంటలు పండించేవారు. తమకు కావాల్సినది ఉంచుకొని మిగిలినవి వీరందరికి రాజు అయిన ముస్లీం రాజుకి పంపించేవారట. కానీ ప్రభాస్ ముత్తాతల ఆధీనంలోనే ఈ తొమ్మిది సంస్థానాలు ఉండేవని, వాటికి వారే రాజులు అని. లక్షల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు(ఇప్పటి లెక్కల ప్రకారం) ఉండేవని రాజా వన్నెంరెడ్డి తెలిపారు.
అయితే ఇప్పుడు అన్నీ లేవని, వాటిని దానధర్మాలు చేశారని తెలిపారు. రాజులది చాలా పెద్ద చేయి అని, ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేవారట. ఓ సారి కొందరు మంజిక కాచి ఇచ్చారు. ఆ టేస్ట్ చూసిన ప్రభాస్ ముత్తాత(రాజు) వారిని తన రాజ్యంలోనే ఉంచుకున్నారు. వారి కోసం ఏకంగా మూడు వేల ఎకరాలు రాసిచ్చారట. ఇలా ఎన్నో దానాలు చేశారు, వాటికి లెక్కేలేదని తెలిపారు. ఇలా అన్ని ఆస్తులు కోల్పోయారని తెలిపారు. డబ్బులు కూడా దానం చేశారని వెల్లడించారు. ఇప్పుడు వంద ఎకరాల లోపే వారికి ల్యాండ్ ఉందని చెప్పారు. ఇప్పుడు హీరోలు అయ్యాక సంపాదించుకున్నవే గానీ, అప్పటి ఆస్తులన్నీ పోగొట్టుకున్నట్టు తెలిపారు.
55
ముఖేష్ అంబానీని మించిన ఆస్తులు
రాజావెన్నెంరెడ్డి చెప్పిన దాని ప్రకారం లక్ష ఎకరాలు ల్యాండ్, వేల కోట్లు ఉన్నాయంటే, వాటిని డెవలప్ చేసి, ఇప్పటికీ ఈ ల్యాండ్ వీరి వద్దే ఉంటే, భారతీయ కుబేరుడు ముఖేష్ అంబానీని మించిన ఆస్తులు ప్రభాస్ ఫ్యామిలీ సొంతమయ్యేవని చెప్పొచ్చు. అప్పటికీ, ఇప్పటికీ వారు గొప్ప మనుషులు అని, దానం చేయడం, సాయం చేయడంలో వాళ్ల తర్వాతే ఎవరైనా అని తెలిపారు. ప్రభాస్ కూడా ఏది అడిగితే అది ఇచ్చేస్తారని, భోజనం పెట్టడంలో వాళ్ల తర్వాతే ఎవరైనా అని తెలిపారు. ఇండియాలోనే కుభేరులు కావాల్సిన ప్రభాస్ ఫ్యామిలీ ఇప్పుడు మామూలు హీరోగానే ఉండిపోయారని చెప్పొచ్చు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా వన్నెంరెడ్డి ఈ విషయాలను పంచుకున్నారు.