తన తండ్రి విషయంలో ప్రభాస్ కి మిగిలిన సంతృప్తి అదొక్కటే, అదే రోజు అక్క కోసం..కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం

First Published | Oct 30, 2024, 12:13 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎంతో బాధ్యతగా ఉంటారు. ప్రభాస్ ఫ్యామిలీ అంటే చాలా మంది కృష్ణంరాజు ఫ్యామిలీ మాత్రమే గుర్తుకు వస్తుంది. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఎంత పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఫ్యామిలీ విషయంలో మాత్రం ఎంతో బాధ్యతగా ఉంటారు. ప్రభాస్ ఫ్యామిలీ అంటే చాలా మంది కృష్ణంరాజు ఫ్యామిలీ మాత్రమే గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ కి చెల్లెల్లు అంటే కృష్ణంరాజు కుమార్తెలే అని అనుకుంటుంటారు. ప్రభాస్ కి సొంత సోదరి, అన్నయ్య కూడా ఉన్నారు. 

Prabhas

వీలైనంత వరకు ప్రభాస్ తన ఫ్యామిలీని చాలా లోప్రోఫైల్ లో మైంటైన్ చేస్తుంటాడు ప్రభాస్. ప్రభాస్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే తన తండ్రిని కోల్పోయారు. 2010లో ప్రభాస్ తండ్రి మరణించారు. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రిని చూసి ప్రభాస్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఒకటుందట. 


Also Read: భార్యగా నటిస్తూ బాలయ్యకి రాఖీ కట్టిన స్టార్ హీరోయిన్..17 సినిమాల్లో రొమాన్స్ చేసి చివరికి అన్నా అనేసింది


తన తొలి చిత్రం ఈశ్వర్ లాంచ్ ఈవెంట్ కి నాన్న హాజరయ్యారు. ముహూర్తం రోజే ఒక డైలాగ్ చెప్పాను. నేను చెప్పిన ఫస్ట్ డైలాగ్ అదే. ఆ ఈశ్వరుడికి మూడు కళ్ళు అయితే ఈ ఈశ్వరుడికి మూడు గుండెలు అంటూ డైలాగ్ చెప్పేశా. డైలాగ్ విన్న తర్వాత నాన్న గారు ఏమి మాట్లాడలేదు. నా చేయి పట్టుకుని యస్ అంటూ ఎమోషనల్ అయ్యారు. అది చూసి నాకు కన్నీళ్లు వచ్చేశాయి అని ప్రభాస్ తెలిపారు. 

ప్రభాస్ కి సొంత బ్రదర్, అక్క ఉన్నారు. ప్రభాస్ సోదరుడు ప్రభోథ్ ఉప్పలపాటి, సోదరి ప్రగతి ఉప్పలపాటి. నాన్న పుట్టినరోజు, అక్క పుట్టిన రోజు ఒక్కటే. నేను సినిమాల్లోకి వచ్చాక వాళ్ళిద్దరి పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేద్దాం అనుకున్నా. నాన్న చనిపోకముందు జరిగిన బర్త్ డే అది. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు. ఎందుకో ఆ బర్త్ డే స్పెషల్ గా ఉండాలని అనుకున్నా. నాన్నకి, అక్కకి ఒకేసారి కార్లు గిఫ్ట్ గా ఇచ్చా అని ప్రభాస్ తెలిపారు. 

అప్పుడు నాన్నకి గిఫ్ట్ ఇవ్వకుండా ఉండి ఉంటే ఇంకెప్పుడూ ఇవ్వడానికి వెళ్ళేయ్యేది కాదు. నాన్న విషయంలో నాకున్న సంతృప్తి అదే అని ప్రభాస్ తెలిపారు. ప్రభాస్ తన ఫ్యామిలీతో పాటు కృష్ణంరాజు పిల్లల బాధ్యత కూడా చూసుకుంటున్నారు. ప్రభాస్ కి తన తండ్రి తో పాటు పెదనాన్న కృష్ణంరాజు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

Latest Videos

click me!