Illu Illalu Pillalu Today Episode Dec 31: నర్మదకు అసలు విషయం చెప్పేసిన అమూల్య, ఇక రప్పా రప్పే

Published : Dec 31, 2025, 10:02 AM IST

Illu Illalu Pillalu Today Episode Dec 31: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో నర్మద, వేదవతితో పాటు ప్రేమకు కూడా నచ్చజెబుతుంది. ఇక అమూల్యతో ప్రేమ విషయం మాట్లాడుతుంది నర్మద. ఇక ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

PREV
14
ప్రేమను ఒప్పించిన నర్మద

ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో నర్మద తన అత్త వేదవతికి ప్రేమ విషయంలో అలా మాట్లాడడం తప్పని వివరిస్తుంది. వేదవతి కూడా రియలైజ్ అయినట్టే కనిపిస్తుంది. ఇక వంటగది నుంచి బయటికి వచ్చిన నర్మద.. ప్రేమకు కూడా అదే విషయాన్ని చెబుతుంది. ‘ప్రతిసారీ మనం నమ్మింది నిజమవ్వదు. దాని వెనుక కనిపించిన నిజాలు చాలా ఉంటాయి. అంతేకానీ మొండిగా నువ్వు వాదిస్తే గొడవలే పెరుగుతాయి. ఎదుటి వాళ్ళ మాట వింటే పరిష్కారం దొరుకుతుంది. మీ అన్నయ్య అమూల్యను ప్రేమించాడా? లేదా అమూల్య మీ అన్నయ్యను ముందుగా ప్రేమించిందా? అనేది నేను నిరూపిస్తాను. ఒక్కసారి నా మాట వింటావా’ అని అడుగుతుంది ప్రేమని. దానికి ప్రేమ ఓకే చెబుతుంది. 

ఇక్కడ నుంచి సీన్ వల్లి దగ్గరికి మారుతుంది. విశ్వ బెదిరించిన విషయం గుర్తొస్తుంది. చాలా భయపడుతూ ఉంటుంది. మరోపక్క నర్మద, అమూల్యను విశ్వక్ ట్రాప్ చేశాడన్న విషయం ఎలా బయటపెట్టాలా? అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపు అక్కడ నర్మదకు వల్లి కనిపిస్తుంది. అప్పుడు నర్మదకు ఒకసారి వల్లి, విశ్వక్ తో మాట్లాడిన విషయం గుర్తొస్తుంది.

24
వల్లి ఇచ్చిన సలహా

నర్మద.. వల్లి దగ్గరికి వెళ్లి అక్కా అంటూ ప్రేమగా పిలుస్తుంది. ఆ పిలుపు నమ్మలేక వల్లి చాలా జోకులు వేస్తుంది. తర్వాత నర్మద ‘నాకు నీ హెల్ప్ కావాలి అక్క ఒక పెద్ద విషయం గురించి ఎంత ఆలోచించినా నా బుర్రకు తట్టడం లేదు. నువ్వైతే ఈ విషయంలో కరెక్ట్ గా ఆలోచించగలరని నిన్ను అడుగుతున్నాను’ అని అంటుంది నర్మద. దీంతో వల్లి సలహా చెప్పేందుకు సిద్ధమైపోతుంది. 

నర్మద మాట్లాడుతూ ‘నాకు తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీలో ఒక సమస్య వచ్చింది. నా ఫ్రెండ్ చెల్లెలు ఒకరిని ప్రేమించింది. కానీ ఆ అబ్బాయి మాత్రం ఆ అమ్మాయే నన్ను ప్రేమించిందని, నేను మాత్రం అమ్మాయిని ప్రేమించలేదని, నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అంటుందని చెబుతున్నాడు. ఆస్తులు ఎక్కువగా కావాలని డిమాండ్ చేస్తున్నాడట. అసలు ఆ అమ్మాయే వాడిని ప్రేమించిందో లేక ఆ అమ్మాయిని వాడు ట్రాప్ చేశాడో ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు’ అని నర్మద వల్లిని అడుగుతుంది. 

అప్పుడు వల్లి ఆ అమ్మాయిని అడిగితే తెలిసిపోతుంది కదా అంటుంది. ‘దానివల్ల ఆ అమ్మాయి తనే ముందు ప్రేమించానని చెబుతోంది, ఇలాంటి విషయంలో నువ్వు ఆలోచించి చెప్పగలవని నిన్ను అడిగాను’ అని అంటుంది నర్మద.

34
విశ్వక్ గురించి చెప్పేసిన అమూల్య

దానికి వల్లి మాట్లాడుతూ ‘ప్రేమలో మునిగిపోయిన అమ్మాయి నుంచి నిజం రాబట్టాలంటే ప్రేమగా మాట్లాడి తెలుసుకోవాలి. భయపెడితే ఎదురు తిరుగుతారు తప్ప అసలు విషయం చెప్పరు.. అలా ప్రేమకి, పెళ్లికి సాయం చేస్తామని సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే మొత్తం విషయాన్ని బయట పెట్టేస్తారు’ అని సలహా ఇస్తుంది వల్లి. ఇక నర్మద అమూల్యను వెతుక్కుంటూ వెళ్తుంది. అమూల్య ఒకచోట ఒంటరిగా కూర్చుని ఉంటుంది. ఆమెతో ప్రేమగా మాట్లాడటం మొదలు పెడుతుంది.

అమూల్య బాధపడుతుంటే నర్మద ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. దానికి అమూల్య ‘నావల్ల నాన్నతో పాటు అందరూ బాధపడుతున్నారు. నాకు నా మీదే కోపంగా ఉంది’ అని ఏడుస్తుంది. నర్మద ప్రేమగా మాట్లాడి అమూల్యను కూల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ‘నువ్వేమీ బాధపడకు వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు, నీ ప్రేమను అర్థం చేసుకుంటారు’ అనగానే అమూల్య ఆనందపడుతుంది. మా ప్రేమను కూడా నాన్న అర్థం చేసుకుంటారా అని అడుగుతుంది. దానికి నర్మద ‘ఎందుకు అర్థం చేసుకోరు. మేము ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఎంత గొడవ చేశారు. తర్వాత అర్థం చేసుకున్నారు కదా నీ విషయంలో కూడా అంతే. కాకపోతే మావయ్య అత్తయ్య బాధపడుతున్నది అందుకు కాదు.. మేము మా అమ్మాయిని సరిగ్గా పెంచలేదు. అందుకే ఇలా జరిగింది. మా అమ్మాయి వెళ్లి శత్రువుల ఇంటి అబ్బాయిని ప్రేమించింది అని బాధపడుతున్నారు’ అని అంటుంది నర్మద.

‘ నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అమూల్య నీ అంతట నువ్వు వెళ్లి విశ్వక్ ను ప్రేమించావంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మావయ్య, అత్తయ్య పెంపకం గురించి మాకు తెలుసు కదా’ అని అంటుంది నర్మద. వెంటనే అమూల్య అసలు విషయం చెప్పేస్తుంది. ‘విశ్వక్ వెంట నేను పడలేదు. కానీ రోజు నా వెంట పడేవాడు. వద్దన్నా గిఫ్ట్స్ ఇచ్చేవాడు. ముఖం కూడా చూసేదాన్ని కాదు. నాతో మాట్లాడవద్దని కూడా చెప్పాను. నాన్నని బాధ పెట్టే పని నేను ఎప్పుడూ చేయను. అసలు ఏం జరిగిందంటే అంటూ’ మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. అది వెనక నుండి ప్రేమ కూడా వినేస్తుంది.

44
బాధలో ప్రేమ

అమూల్య చెప్పినదంతా విన్న ప్రేమ చాలా బాధపడుతుంది. అమూల్య మాట్లాడుతూ ‘నాతో అమ్మానాన్న మళ్ళీ ప్రేమగా మాట్లాడుతారా? నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటారా?’ అని అంటుంది. నర్మద మాట్లాడుతూ మరి విశ్వక్ ను నువ్వే ప్రేమించావని ఎందుకు అబద్ధం చెప్పావని అడుగుతుంది. దానికి అమూల్య మాట్లాడుతూ విశ్వక్ అలా చెప్పమన్నాడు, నేను ప్రేమించానని చెబితే గొడవలు రావు అని అన్నాడు, నిజం చెప్తే పెద్ద గొడవలు అవుతాయని అన్నాడు.. కానీ ఇప్పుడు ఇంకా పెద్ద గొడవలు జరిగాయి అని అమూల్య బాధపడుతూ ఉంటుంది. ఇదంతా ప్రేమ వినేస్తుంది. 

నర్మద అమూల్యతో ధైర్యంగా ఉండు అని చెప్పి ప్రేమ వెనకే వెళుతుంది. ప్రేమ తన అన్నయ్య గురించి ధీరజ్ ను కొట్టిన సంగతి గుర్తుతెచ్చుకొని చాలా బాధపడుతుంది. అలాగే అత్తయ్య మావయ్యకు ఎదురు తిరిగిన విషయం కూడా ఆమెకు గుర్తొస్తుంది. అలాగే నర్మదనతో గొడవ పడింది కూడా గుర్తొచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది.

ఇక ఇక్కడి నుంచి సీన్ భాగ్యం దగ్గరికి మారుతుంది. వల్లి తన తల్లికి ఫోన్ చేసి నర్మద తన దగ్గరకు వచ్చి మాట్లాడిన మాటలన్నీ చెబుతుంది. నర్మద సలహా అడిగితే ఇచ్చానని చెబుతుంది. నర్మద చెప్పిన సమస్య గురించి, తాను ఇచ్చిన సలహా గురించి కూడా భాగ్యానికి చెబుతుంది వల్లి. భాగ్యం ఆలోచించి అమూల్య ప్రేమ విషయం తెలుసుకోవడం కోసమే నర్మదా ఇలా నిన్ను బోల్తా కొట్టించింది అని చెబుతుంది. దీంతో వల్లి షాక్ అవుతుంది. ఇప్పుడు అమూల్య.. విశ్వక్ ముందు ప్రేమించాడని చెబితే కొంపలు అంటుకుపోతాయి అని అంటుంది. దీంతో వల్లి భయంతో వణికిపోతూ ఉంటుంది. నేటితో ఇక్కడ ఎపిసోడ్ ముగిసపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories