'బాహుబలి' సెంటిమెంట్ ని 'కల్కి2898ఏడీ' కి అప్లై చేస్తున్న ప్రభాస్.. వర్కౌట్‌ అవుతుందా?

First Published May 22, 2024, 12:53 PM IST

సైన్స్, యాక్షన్ సీన్లతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది… ప్రభాస్ లుక్ కూడా సినిమాలో చాలా బాగుంది.. రీసెంట్ గా  బుజ్జి అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.


సినిమావాళ్లకు కాస్తంత సెంటిమెంట్స్ ఎక్కువే. ఓ సారి ఓ హిట్ సినిమాకు వర్కవుట్ అయిన ఫార్ములానే తమ తదుపరి చిత్రానికి వర్కవుట్ చేస్తూంటారు. సినిమా అనేది కోట్లతో ముడిపడిన వ్యాపారం కాబట్టి పెద్దగా తప్పు పట్టేది కూడా ఏముండదు. అలా ప్రభాస్ కూడా తన సెంటిమెంట్ ని తన తాజా చిత్రం కల్కికు అప్లే చేస్తున్నారు. నమ్మకమే జీవితం కాబట్టి ఈ సెంటిమెంట్ కూడా వర్కవుట్ అయ్యి సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇంతకీ ఏమిటా సెంటిమెంట్ అంటారా..
 


ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా  సినీ ప్రియులు ఎదురుచూస్తున్న సినిమా  కల్కి.. రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమా తెరకేక్కుతుంది.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.. తాజాగా కల్కి టీమ్ ప్రమోషన్స్ ను మొదలెట్టేందుకు  ప్లాన్ చేసారు. 
 


 వైజయంతి మూవీస్‌ బ్యానర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో గ్లోబల్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు ప్రభాస్‌. మైథాలజీకి సైన్స్‌ను లింక్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కల్కి 2898 ఏడీ కథను రూపొందించారు నాగీ. శ్రీ కృష్ణుడు మరణించిన ఐదు వేల ఏళ్ల తరువాత జరిగే కథ కాబట్టే టైటిల్‌లో 2898 ఏడీ అనే నెంబర్‌ను చేర్చారు. కేవలం టైటిల్‌ విషయంలోనే కాదు క్యారెక్టర్స్ విషయంలో మైథలాజికల్ రిఫరెన్స్‌లు ఉండేలా చూసుకుంటున్నారు.


గత ఏడాది వచ్చిన ప్రభాస్ సలార్ భారీ విషయాన్ని అందుకుంది. ఇప్పుడు అంతకు మించి కల్కి సినిమా రాబోతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు, సినీ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.. కమలహాసన్, అమితాబచ్చన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు సినిమాలు నటించనున్నారు.  సైన్స్, యాక్షన్ సీన్లతో సినిమా ఉండబోతుందని తెలుస్తుంది… ప్రభాస్ లుక్ కూడా సినిమాలో చాలా బాగుంది.. రీసెంట్ గా  బుజ్జి అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు.
 

Kalki 2898


రీసెంట్ గా కూడా బుజ్జిని పరిచయం చేస్తున్నామంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో కి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ను వాడారు. ఇకపోతే బుజ్జిని రేపు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రామోజీ ఫిలిం సిటీ లో రేపు సాయంత్రం ఐదు గంటలకు ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ ను నిర్వహించనున్నారు.. ఈ సినిమాకు సంబందించి మొదటిసారి ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు..దేశంలో ఉన్న మొత్తం మీడియా సంస్దలను ఈ ఈవెంట్ కు ఆహ్వానిస్తున్నారు.

 ప్రభాస్ సెంటిమెంట్ విషయానికి వస్తే...బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రామోజీ ఫిల్మ్ సిటీలోనే చేసారు. అదే మొదటి సారి ప్రభాస్ సినిమాలకు ఈవెంట్ ని ఆర్.ఎఫ్ సి లో చేయటం. అప్పటి నుంచి రామోజీ ఫిల్మ్ సిటిలో తమ సినిమాలకు సంభందించి ఈవెంట్స్ ఒకటి  ప్లాన్ చేస్తున్నారు. అలా సెంటిమెంట్ ని కొనసాగిస్తున్నారు. అదే విధంగా Kalki 2898 AD కూడా చేస్తున్నారు.   ప్రభాస్ ను చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు..  

యూనివర్సల్ స్టార్ కమల్‌ హాసన్‌ నెగెటివ్ రోల్‌లో నటించటం, తొలిసారిగా దీపిక పదుకోన్‌ సౌత్‌ టీమ్‌తో కలిసి వర్క్ చేయటం ఈ సినిమా మీద అంచనాలను పెంచేస్తున్నాయి.
ఇక ఈవెంట్‌ విషయానికి వస్తే ఈ రోజు సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో చిత్రయూనిట్ అంతా పాల్గొనబోతున్నారు. భారీ సంఖ్యలో ప్రభాస్ అభిమానులు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.


దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో వైజయంతి మూవీస్‌ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగుతో పాటు దేశ విదేశీ భాషల్లో మూవీ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ను రూల్‌ చేస్తున్న అవెంజర్స్‌ తరహాలో కల్కి కూడా ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్రయూనిట్‌.
ఈ చిత్రం ఓటిటి రైట్స్ కోసం ఓ రేంజిలో డిమాండ్ క్రియేట్ అయ్యింది.  Netflix, Prime Video వారు ఈ రైట్స్ కోసం పోటీ పడ్డారు.  

Kalki 2898 AD


నాగ్ అశ్విన్ రీసెంట్ ఓ మీడియా ఇంటరాక్షన్ చెప్పినదాని ప్రకారం ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898 లో ముగుస్తుంది. అందుకే ఈ చిత్రానికి ‘Kalki 2898 AD’అని పెట్టామని చెప్పారు.  అలాగే  మేము ఇక్కడ  మన వరల్డ్ ని క్రియేట్ చేయటానికి  ప్రయత్నిస్తున్నాము. పూర్తి భారతీయతను ఈ సినిమాలో అందిస్తాము. ముఖ్యంగా  ఈ సినిమాని బ్లేడ్ రన్నర్ (హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం) లాగా చేయకూడదనేది మా ముందు ఉన్న ఛాలెంజ్. క్రీ.శ. 2898 నుండి మనం 6000 సంవత్సరాల వెనక్కి వెళితే, మనం క్రీ.పూ. 3102కి చేరుకుంటాం, అంటే కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయినట్లే అని క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. 

Kalki

ఈ సినిమాలో కమలహాసన్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పాత్రను నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన తీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని అంటున్నారు.  కొన్ని రోజులుగా కమల్ - ప్రభాస్ కాంబినేషన్లోని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రభాస్ - కమల్ కాంబినేషన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. సాంకేతిక పరంగా ఈ సినిమా హాలీవుడ్ సినిమాలను తలపిస్తుందని అంటున్నారు. మరో ప్రక్క ప్రభాస్ విష్ణుమూర్తి పాత్రలో కనిపిస్తారనే (Prabhas Plays Lord Vishnu)వార్త ఇండస్ట్రీ వర్గాల్లో తెగ సర్క్యులేట్ అవుతోంది.

click me!