Latest Videos

వెంకటేష్‌కి జోడీగా మహేష్‌ బాబు మరదలు.. యంగ్‌ హీరోల నుంచి సీనియర్ల వరకు అందరికి సై?

First Published May 22, 2024, 12:45 PM IST

మహేష్‌ బాబు మరదలు పిల్ల స్పీడ్‌ పెంచుతుంది. ఒక్కోటి భారీ ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ల వరకు ఎవ్వరికైనా ఓకే చెబుతుంది. 
 

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు మరదలు హీరోయిన్‌గా స్పీడ్‌ పెంచుతుంది. భారీ ఆఫర్లని సొంతం చేసుకుంటుంది. సీనియర్లతోనూ జోడీ కడుతుంది. మరి ఇంతకి మహేష్‌ బాబు మరదలు ఎవరు? ఆమె ఎవరితో సినిమాలు చేస్తుందనేది చూస్తే.. ఆమె ఎవరో కాదు మీనాక్షి చౌదరి. `ఇచట వాహనములు నిలుపరాదు` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. రవితేజ ఖిలాడీ మూవీతో అందరి దృష్టిన ఆకర్షించింది. `హిట్‌` చిత్రంతో హిట్‌ అందుకుంది. 
 

ఈ సంక్రాంతితో `గుంటూరు కారం`లో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది మీనాక్షి. ఇందులో మహేష్‌ బాబుకి మరదలు పాత్రలో మెరవడం విశేషం. అయితే ఇప్పటికే ఈ మ్యూటీకి మంచి ఆఫర్లు ప్రారంభమయ్యాయి. భారీ సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తుంది. స్టార్‌ హీరోలకు జోడీగా తీసుకుంటున్నారు. తెలుగులో వరుణ్‌ తేజ్‌తో `మట్కా` చిత్రంలో హీరోయిన్‌గా చేస్తుంది. అలాగే విశ్వక్‌ సేన్‌తో ఓ మూవీ చేస్తుంది. మరోవైపు దుల్కర్‌ సల్మాన్‌ తో `లక్కీ భాస్కర్‌` మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. 
 

దీంతోపాటు తమిళంలో విజయ్‌తో `ది గోట్‌`(ది గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌) మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది మీనాక్షి చౌదరి. చిరంజీవితో `విశ్వంభర`లోనూ ఆయనకు చెల్లిగా కనిపించబోతుందట. ఇప్పుడు మరో తెలుగు సినిమాకి ఈ అమ్మడు సైన్‌ చేసిందట. సీనియర్‌ హీరోకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌ ఓ మూవీ చేస్తున్నారు. ఆ మధ్యనే దీన్ని ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యూలర్‌ షూటింగ్‌ జరుగనుంది. ఇందులో హీరోయిన్‌గా వెంకీకి జోడీగా ఎంపిక చేసినట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 
 

ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ పొడుగుకాళ్ల సుందరి మీనాక్షి ఇలా ఒక్కో భారీ సినిమాని తన ఖాతాలో వేసుకుంటూ తన రేంజ్‌ని పెంచుకుంటుంది. స్టార్‌ హీరోయిన్ల జాబితాలో పడేందుకు తపిస్తుంది. ఒకటి రెండు హిట్లు పడితే ఈ బ్యూటీ రేంజ్‌ మరింత  పెరిగిపోతుందని చెప్పొచ్చు. అయితే సినిమాల ఎంపికలో మాత్రం ఈ బ్యూటీ ఆచితూచి వ్యవహరిస్తుందని టాక్‌. 
 

మరోవైపు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది మీనాక్షి చౌదరీ. ఆమె గ్లామర్‌ షోతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ఇలా అందాల విందుతో మేకర్స్ కి ఎరవేస్తూ భారీ ఆఫర్లని కొల్లగొట్టడం విశేషం. 
 

click me!