ప్రస్తుతం చేయబోతున్న `సలార్ 2` ఒకటి. రెండోది లోకేష్ కనగరాజ్‌తో, మూడోది ప్రశాంత్ వర్మతోగానీ, ఓం రౌత్‌తోగానీ అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అందులో భాగంగానే లోకేష్, హోంబలే ఫిల్మ్ కాంబోలో ప్రభాస్ మూవీని ఈ సంక్రాంతికి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
కానీ ఈ వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి హైప్ ఇస్తుంది. పూనకాలు తెప్పిస్తుందని చెప్పొచ్చు. లోకేష్ సినిమాలు ఏ రేంజ్‌లో బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తున్నాయో తెలిసిందే. ఎలివేషన్లు, యాక్షన్ సీన్లు ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది ప్రభాస్‌తో సినిమా ఉంటే దానికి ఆకాశమే హద్దుగా చెప్పొచ్చు.
ఈ కాంబో సెట్ అయితే నిజంగానూ పూనకాలు తెప్పించే మూవీ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం లోకేష్.. రజనీకాంత్‌తో `కూలీ` సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున, అమీర్ ఖాన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
read more: ఎన్టీఆర్ - బాలకృష్ణ గొడవపై డైరెక్టర్ బాబి క్లారిటీ, బాలయ్య తారక్ గురించి బాబీ దగ్గర ఏం చెప్పాడంటే..?