Prabhas : ప్రభాస్ తిరిగొచ్చారు.. డార్లింగ్ బిజీ షెడ్యూల్ ఇదే.!

First Published | Nov 9, 2023, 11:03 AM IST

డార్లింగ్ హైదరబాద్ చేరుకున్నారు. దీంతో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వబోతున్నారని అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డార్లింగ్ షెడ్యూల్ ను ఇలా ప్లాన్ చేసుకున్నట్టు  తెలుస్తోంది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) దాదాపు యాబై రోజుల పాటు ఫారేన్ లోనే ఉన్నారు. తన మోకాళి సర్జరీ చేయాల్సి రావడంతో యూరప్ కు వెళ్లిన విషయం తెలిసిందే. డార్లింగ్ కు సర్జరీ సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం కాలు నొప్పి నుంచి విముక్తి పొందారు. దీంతో  ఇండియాకు తిరిగి వచ్చారు. నిన్న హైదరాబాద్ లో అడుగుపెట్టారు.

ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న చిత్రం Salaar Cease Fire. ఈ చిత్రాన్ని మేకర్స్ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ కు ఇంకా నలభై రెండ్రోజుల సమయమే ఉంది. కానీ యూనిట్ పెద్దగా అదిరిపోయే అప్డేట్స్ ను ఇవ్వడం లేదు. ప్రభాస్ వచ్చాకే అని అన్నట్టుగా ఉన్నారు. 
 


డార్లింగ్ బర్త్ డే, దసరా ఫెస్టివల్ కూ సలార్ నుంచి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మొత్తానికి ఇండియాకు తిరిగి రావడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ బిజీ షెడ్యూల్ ను ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా ‘సలార్’ ప్రమోషన్స్ పై మేకర్స్ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. 
 

నవంబర్ చివరి వారం లేదంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి Salaar ప్రమోషన్స్ కు టైమ్ కేటాయించినట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు, బాలీవుడ్ లో బాగా ప్రచారం చేయనున్నాను. అలాంటే ఓవర్సీస్ లోనూ ప్రమోట్ చేసే అవకాశం ఉన్నందున ప్రచారానికి ఎక్కువ టైమ్ తీసుకుంటున్నారం. ఇప్పటికే ప్యాచ్ వర్క్ లను యూనిట్ పూర్తి చేస్తోంది.  
 

ఇక ఈలోగా డార్లింగ్ ‘ప్రాజెక్ట్ కే’, ‘రాజా డిలక్స్’ చిత్ర షూటింగ్ లో పాల్గొనాలని చూస్తున్నారంట. సినిమాలు ఆలస్యం కాకుండా సెట్స్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. కల్కి నెక్ట్స్ షెడ్యూల్ లో పాల్గొనడంతో పాటు.. సలార్ ప్రమోషన్స్ కు పార్లల్ గా మారుతీ సినిమా షూటింగ్ కు వెళ్లలనున్నారని టాక్ వినిపిస్తోంది. 
 

ఏదేమైనా డార్లింగ్ యాబై రోజుల బ్రేక్ తర్వాత మళ్లీ ఫుల్ బిజీ కాబోతున్నారు. ఈ క్రమంలో ఎప్పుడు ఎలాంటి అప్డేట్  వస్తుందోనని అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తున్నారు. మరోవైపు మారుతీ ‘రాజా డిలక్స్’, సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ చిత్రాలను ఇంకా అనౌన్స్ చేయాల్సి ఉంది. వీటిపైనా డార్లింగ్ ప్రస్తుతం ఫోకస్ చేసే అవకాశం లేకపోలేదు.
 

Latest Videos

click me!