ప్రభాస్ తన కెరీర్ లో చేయకుండా ఉండాల్సిన 6 చెత్త సినిమాలు.. అసలు ఎందుకు ఒప్పుకున్నాడో అర్థం కాదు

Published : Mar 01, 2026, 04:08 PM IST

Prabhas Movies: ప్రభాస్ తన కెరీర్ లో చేయకుండా ఉండాల్సిన 6 చెత్త సినిమాల లిస్ట్ ఈ కథనంలో ఉంది. ఆ సినిమాలు ఏంటి ? ఎందుకు అవి చెత్త సినిమాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
17
Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరో ప్రభాస్ అనే చెప్పాలి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 లాంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ప్రభాస్ తన కెరీర్ లో చేసిన కొన్ని చెత్త సినిమాలు ఉన్నాయి. అసలు ఆ సినిమాలని ప్రభాస్ ఎందుకు ఒప్పుకున్నాడో కూడా అభిమానులకు అర్థం కావడం లేదు. ఆ సినిమాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

27
చక్రం

కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఎమోషనల్ అండ్ ట్రాజడీ ఎండింగ్ తో ఈ సినిమా ఉంటుంది. ఓవర్ డోస్ సెంటిమెంట్ తో ఈ మూవీ బోరింగ్ గా అనిపిస్తుంది. ఈ చిత్రంలో ఛార్మి, ఆసిన్ హీరోయిన్లుగా నటించారు.

37
పౌర్ణమి

ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన పౌర్ణమి చిత్రాన్ని ఎమ్మెస్ రాజు నిర్మించారు. ఈ మూవీలో త్రిష, ఛార్మి హీరోయిన్లు. ఈ చిత్రం కూడా ఏమాత్రం వర్కౌట్ కాలేదు.

47
యోగి

వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రభాస్ అభిమానులని తీవ్రంగా నిరాశపరిచింది. మదర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ప్రభాస్ మూవీస్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీలో నయనతార హీరోయిన్.

57
ఏక్ నిరంజన్

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ నిరంజన్ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రభాస్ క్యారెక్టరైజేషన్ తప్ప ఈ సినిమాలో పాజిటివ్ అంశాలు ఏమీ లేవు.

67
అది పురుష్

ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాక తీవ్ర విమర్శలకు కారణమైన చిత్రం ఆది పురుష్. రామాయణాన్ని ఏదో చేయబోయి ఇంకేదో చేశాడు డైరెక్టర్ ఓ రౌత్. వరస్ట్ గ్రాఫిక్స్, పాత్రల కాస్ట్యూమ్స్ అన్నీ అభిమానులకు చిరాకు పుట్టించాయి.

77
ది రాజాసాబ్

రీసెంట్ గా ప్రభాస్ నుంచి వచ్చిన ది రాజా సాబ్ మూవీ హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కింది. డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై డిజాస్టర్ అయింది.

Read more Photos on
click me!

Recommended Stories