సినిమాల్లో పారితోషికాలు ఇప్పుడు అమాంతం పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు, వరుస విజయాలతో స్టార్స్ ఒకేసారి కోట్లకు కోట్లు పెంచుతున్నారు. హీరోల్లో వంద కోట్లు దాటి, రెండు వందల కోట్లకు వెళ్లింది. హీరోయిన్లలో సింగిల్ డిజిట్స్ నుంచి డబుల్ డిజిట్స్ పారితోషికం తీసుకుంటున్నారు. ఒక కోటి లోపు పారితోషికం తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు అమాంతం పెంచేశారు. వాళ్ల రెమ్యూనరేషన్ కూడా హీరోల స్థాయిలో ఉండటం విశేషం.
ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో అనిరుథ్ ముందు వరుసలో ఉన్నారు. వీరితోపాటు తమన్ వరుస హిట్లతో దుమ్ములేపుతున్నాడు. `పుష్ప 2`తో రచ్చచేస్తున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అలాగే `ఛావా` మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు ఆస్కార్ విన్నర్ రెహ్మాన్. మరి వీరి పారితోషికాలు ఎలా ఉన్నాయి, ఎంత తీసుకుంటున్నారనేది చూస్తే.