ఈశ్వర్‌ నుంచి సాహో దాకా.. అందనంత ఎత్తులో ప్రభాస్‌

Published : Oct 23, 2020, 09:59 AM IST

ప్రభాస్‌.. భారతీయ సినిమాకి పరిచయం అక్కర్లేని పేరు. `బాహుబలి`తో తెలుగు సినిమా పవర్‌ ఏంటో ప్రపంచానికి చాటిన పేరు. ఇండియాలోనే ప్రభాస్‌ని మించిన స్టార్‌ ప్రస్తుతం లేరని చెబితే అది అతిశయోక్తి కాదు. నేడు(శుక్రవారం) ప్రభాస్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన గురించి ఓ లుక్కేద్దాం.   

PREV
112
ఈశ్వర్‌ నుంచి సాహో దాకా.. అందనంత ఎత్తులో ప్రభాస్‌

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుగా వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రభాస్‌.. అనతి కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ని, గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం కృష్ణంరాజుని మించిన ఇమేజ్‌ ఆయన సొంతం కావడం విశేషం. 

212

కెరీర్‌ ప్రారంభించినప్పుడు తనకి కూడా తెలియదు.. తాను ఇంతటి స్టార్‌ని అవుతానని. అందరు హీరోల్లాగానే తానూ ఓ నటుడిగా రాణిస్తానేమో అనుకున్నాడు. అంతేకాదు తనని ఎవరూ చూస్తారని అనుకున్నాడట. కానీ తనని చూసేందుకు ఇప్పుడు ఇండియన్‌ ఆడియెన్సే కాదు.. విదేశీ ఆడియెన్స్ కూడా ఎగబడుతున్నారు. 

312

ప్రభాస్‌ ఏ సినిమా చేసినా.. ఆ సినిమా పేరు ఆయనకు ఆపాదించడం కామన్‌ అయిపోయింది. ఆయన నటించిన ప్రతి సినిమాలోని పాత్రలో అంతగా ఇన్‌వాల్వ్ అయి ఆడియెన్స్ చేత జేజేలు కొట్టించుకుంటున్నారు. తొలి సినిమాతోనే ఇలాంటి ట్రెండ్‌ స్టార్ట్ అయ్యింది.
 
412

హీరోగా ఎంట్రీ ఇచ్చిన `ఈశ్వర్‌` సినిమాలో తనదైన స్టయిల్‌లో ఈశ్వర్‌ అంటూ మేనరిజం పలికించి అందరిచేత కొన్నాళ్ళు ఈశ్వర్‌ అనిపించుకున్నారు. ఆయన స్టయిల్‌నే ఫాలో అయ్యేలా చేశారు. ఆ రత్వాత `వర్షం`తో భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న ప్రభాస్‌ `అడవిరాముడు`తో తనని అడవి రాముడిగా పిలుపించుకున్నారు.

512

ప్రభాస్‌ తెలుగు చిత్ర పరిశ్రమకి `చక్రం` అయ్యాడు.. ఆ తర్వాత అన్యాయాన్ని, బానిసత్వాన్ని ఎదురించే `చత్రపతి` అయ్యాడు. `యోగి`లా, `మున్నా`గా తనలోని పోరాటపటిమని చాటుకున్నారు. యాక్షన్‌తో ఆడియెన్స్ కనువిందు చేశారు. కొన్నాళ్ళు చిలిపి చేష్టలతో `బుజ్జిగాడు`గా పిలిపించుకున్నాడు. ఆ తర్వాత `బిల్లా` అవతారం ఎత్తి దుమ్ములేపాడు. 

612

తానే `ఏక్‌ నిరంజన్‌` అయ్యాడు.. ఆయనే తెలుగు ప్రేక్షకులకు `డార్లింగ్‌` అయ్యాడు. ఇలా తాను అన్నింటిలోనూ `మిస్టర్‌ పర్‌ఫెక్ట్` అనిపించుకున్నాడు. అంతటితో ఆగలేదు తనలోని `రెబల్‌` యాంగిల్‌ని బయటపెట్టాడు. `మిర్చి`తో తనలోని ఘాటెంతో ఇండస్ట్రీకి, అభిమానులకు చూపించాడు. 

712

ఇంత చేసినా ప్రభాస్‌కి సంతృప్తి కలగలేదు. తనలోని నటుడు సంతృప్తి పడలేదు. ఇంకా ఏదో కావాలి. ఇంకా ఏదో చేయాలని తపించాడు. అందుకు సమాధానం దర్శకధీరుడు రాజమౌళి రూపంలో వచ్చాడు. `బాహుబలి` వంటి భారీ చిత్రంతో తన ఇమేజ్‌ని అంతర్జాతీయ స్థాయికి చేర్చాడు. తన నటనలోని మరో యాంగిల్‌ని బయటకు తీశాడు. టాలీవుడ్‌ ఇండస్ట్రీ రికార్డులనే కాదు ఇండియన్‌ సినిమా రికార్డు లను తిరగరాశాడు. ఇప్పట్లో ఎవరూ దాన్ని టచ్‌ చేయలేరనేలా కొత్త రికార్డులను సృష్టించాడు. 

812

పాన్‌ ఇండియా అనే మాటని పరిచయం చేశాడు. దానికి కొత్త అర్థాన్ని తీసుకొచ్చాడు. కలెక్షన్ల సునామిని సృష్టించాడు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇమేజ్‌ దశ దిశలా వ్యాపింపచేశాడు. ప్రముఖ మ్యూజియం మేడమ్‌ టుసాడ్స్ లో మైనపు విగ్రహంలా నిలిచాడు. 

912

`సాహో`తో అందరిచేత సాహో అనిపించిన ప్రభాస్‌ ప్రస్తుతం మరిన్ని రికార్డులు, సంచలనాలు క్రియేట్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌`తోపాటు నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూడు వేటికవే భిన్నమైనవి. విభిన్న కథా నేపథ్యాలతో పాన్‌ ఇండియా సినిమాలుగా రూపొందుతున్న ఈ చిత్రాలతో మరోసారి తన ప్రభని చాటబోతున్నారు. 

1012

`ఆదిపురుష్‌`లో ఆయన రాముడిగా కనిపించబోతుండటం ఓ విశేషమైతే, ఇది డైరెక్ట్ బాలీవుడ్‌ సినిమా కావడం మరో విశేషం. ఇంతగా రాణిస్తున్న ప్రభాస్‌ నటుడు కావాలని ఏనాడు అనుకోలేదట. హోటల్‌ నడిపించాలని అనుకున్నాడట.  జీవితంలో ఏదీ మనం అనుకున్నట్టు జరగదు.. అలాగే చరిత్రని ఎవరూ కావాలని పనిగట్టుకుని సృష్టించలేరు. అవి ఊహించిన విధంగా, చిన్న ఘర్షణతో, చిన్న సంఘటనతోనే స్టార్ట్ అవుతాయన్నట్టు.. ప్రభాస్‌ విషయంలోనూ జరిగింది. 

1112

టాలీవుడ్‌ డార్లింగ్‌గా, బాహుబలిగా, సాహో స్టార్‌గా పిలిపించుకుంటున్న ప్రభాస్‌ 1979 అక్టోబర్‌ 23న జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ ప్రభాస్‌ రాజు. రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ఆయనకు పెదనాన్న. 
 
1212

ప్రభాస్‌కి సిగ్గు ఎక్కువ. ఎవరితోనైనా మాట్లాడాలంటే కాస్త ఇబ్బందిపడతారు. మీడియా ఇంటర్వ్యూల్లో కూడా ఆయన ఇలాంటి ఇబ్బందిని ఫేస్‌ చేస్తుంటాడు. అయినా సేవలో మాత్రం తన గొప్ప మనసుని చాటుకుంటారు. ఏ ఆపద వచ్చిన కోట్లల్లో విరాళం ప్రకటిస్తూ నిజంగానే `బాహుబలి` అనిపించుకుంటున్నాడు. ఓ వైపు నటుడిగా, మరోవైపు సేవకుడిగా అందనంత ఎత్తుకు ఎదిగిన ప్రభాస్‌కి మనమూ బర్త్ డే విశెష్‌ చెబుదాం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories