జనవరి 2021లో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల లిస్ట్

First Published Oct 23, 2020, 7:05 AM IST


సాధారణంగా జనవరి వస్తోందంటే మిగతా విషయాల సంగతి ఏమో కానీ సినిమా వాళ్లకు మాత్రం అసలు ఫెస్టివల్ మొదలవుతుంది. సంక్రాంతికి వరస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతాయి. స్టార్స్ పందెం కోళ్లలా భాక్సాఫీస్ వద్ద పోటీ పడతారు. ఇది ఓ ఆచారంలా మారిపోయింది. అయితే గత కొంతకాలంగా కరోనా దెబ్బతో అంతా తలక్రిందులైపోయింది. థియోటర్స్ లో సినిమా రిలీజే లేవు. ఓటీటిలలో సినిమాలు చూస్తున్నాము. ఎప్పుడు థియోటర్స్ ఓపెన్ చేస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కరోనా ప్రభావంకు సినిమా పరిశ్రమ బాగా ఇంపాక్ట్ అయ్యింది. షూటింగ్ లు లేవు..రిలీజ్ లు లేవు. అయితే సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. జన జీవనం తిరిగి సాధారణం స్దితికి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం థియోటర్స్ కు ఫర్మిషన్ ఇచ్చినప్పటికీ..మాగ్జిమం థియోటర్స్ ఓపెన్ కాలేదు. అందుతున్న సమాచారం మేరకు డిసెంబర్ 4 నుంచి రీఓపెన్ అయ్యే అవకాసం ఉంది. అయితే జనవరి నుంచి మాత్రం వరస పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. 2021 జనవరి నాటికల్లా కరోనావైరస్ సంక్షోభం తగ్గుముఖం పట్టి థియేటర్లు తెరుచుకుంటాయని సినీ ప్రముఖులు ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలో జనవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు ఏమిటో చూద్దాం.

పవన్ కల్యాణ్ తాజా చిత్రం సంక్రాంతి రేసులో మొదట ఉంటుంది. జనవరి 14న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాసం ఉంది. వకీల్ సాబ్ ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందనే సంగతి తెలిసిందే. త్వరలోనే ఆ మిగతా భాగాన్ని కూడా షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానుల దృష్టి అంతా కేంద్రీకృతమై ఉంది. మరోవైపు మూవీ యూనిట్ సైతం దీనిపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలోనే ప్రారంభించనున్న లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో శృతి హాసన్ సైతం జాయిన్ కానుంది.
undefined
దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రాల్లో ‘కేజీఎఫ్‌ 2’ ఒకటి. యశ్‌ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సీక్వెల్‌ షూటింగ్‌ క్లైమాక్స్‌లో ఉంది. మొదట ఈ చిత్రాన్ని ఈ నెలలో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు అనుకున్నారు. అయితే అనుకోకుండా కరోనా మహమ్మారి రావడంతో.. షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో కేజీఎఫ్ చిత్రీకరణ కూడా ఆగిపోయింది. ఇక గత నెల ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ క్రేజీ సీక్వెల్‌కి కొత్త రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ నెల 15 నుంచి థియేటర్లు తెరుస్తుండగా.. అన్ని పరిస్థితులు సర్దుకునేసరికి మరో రెండు నెలలు పట్టనుంది. ఈ క్రమంలో సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 14న కేజీఎఫ్‌ 2కు విడుదల తేది ఫిక్స్ చేసినట్లు సమాచారం.
undefined
పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షులను ఆకట్టుకున్నాడు హీరో రామ్.. ఈ సినిమా తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు. నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తుంది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తుండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం కరోనా ప్రభావంతో సినిమా వాయిదా పడింది. ఈ సినిమాని జనవరి 15న రిలీజ్ ప్లాన్ చేసారు.
undefined
మాస్‌ హీరో రవితేజ రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘క్రాక్‌’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రుతిహాసన్‌ నటిస్తోంది. సరస్వతి ఫిల్మ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో వరలక్ష్మి కీలక పాత్రలో నటిస్తోంది. తమన్‌ సంగీత స్వరాలు సమకూర్చిన చిత్రం అన్నీ కుదిరితే మే 8న థియేటర్లలో ఈ పాటికే ప్రేక్షకులను అలరించేది. కానీ కరోనా వైరస్‌ కారణంగా చిత్రం విడుదల వాయిదా పడింది. అయితే ప్రస్తుతం సంక్రాంతికి రిలీజ్ ప్లానింగ్ లో ఉన్నారు. అయితే పోటీ దృష్ట్యా రిలీజ్ మారచ్చు.
undefined
సంక్రాంతికి థియేటర్లలో ‘అరణ్య’ చిత్రంతో రానా దగ్గుబాటి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళంలో ‘కాండన్‌’గా రూపొందిన బహుభాషా చిత్రమిది. వాస్తవానికి, ఈ ఏడాది ఏప్రిల్‌ 2న చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా వల్ల కుదరలేదు. ఇప్పుడు మూడు భాషల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్టు ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ప్రకటించింది. జనవరి 15, 2021న సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
undefined
యువ హీరో అఖిల్ అక్కినేని నుంచి వస్తోన్నలేటెస్ట్ మూవీ ”మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్2 బ్యానర్ ద్వారా బన్నీ వాస్ – వాసు వర్మ కలయికలో నిర్మాణం జరుగుతుంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా, గోపీ సుందర్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా విరామం తీసుకున్న ఈ చిత్ర షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమైంది. ఆ సినిమా కూడా రిపబ్లిక్ డే వీకెండ్ కు రానుంది.
undefined
కొన్ని ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫాంలు ఆఫర్ ఇస్తున్నప్పటికీ, ఉప్పెన మేకర్లు మాత్రం నో అని చెప్పేస్తున్నారట. ఈ సినిమా ద్వారా ముగ్గురు టాలీవుడ్‌కి పరిచయం అవుతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సన, హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతిశెట్టి ముగ్గురికి ఇది మొదటి చిత్రమే. అయినప్పటికీ స్టోరీ మీద ఉన్న నమ్మకంతో దాదాపు 20కోట్లతో సినిమాను నిర్మించారు నిర్మాతలు. ఇక ఈ సినిమాకు ఇటీవల ఎడిటింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయట. ఆ ఔట్‌పుట్‌ని చూసిన టీమ్‌కి సినిమాపై నమ్మకం మరింత పెరిగిందట. దాంతో ఈ సినిమాని రిపబ్లిక్ డే వీకెండ్ కు వచ్చేలా చూస్తున్నారు.
undefined
నాగచైత‌న్య‌,సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం ల‌వ్ స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్ లో వ‌స్తోన్న ఈ మూవీ షూటింగ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. షూటింగ్ రీస్టార్ట్ ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న సినీ ల‌వ‌ర్స్ ఈ మధ్యనే మళ్లీ మొదలై ఆనందాన్ని కలగ చేసింది. ఈ చిత్రం వాలంటైన్స్ డే రోజున అంటే పబ్రవరి 14న రిలీజ్ ప్లాన్ చేసారు.
undefined
click me!