సినీ సాయంపై పవన్ దిమ్మ‌తిరిగే కౌంట‌ర్‌! ‘అత్తారింటికి దారేది’ టైమ్ లోనూ... |

First Published Oct 23, 2020, 7:08 AM IST

 ‘అత్తారింటికి దారేది’ సినిమా థియేటర్‌లో విడుదల కాక ముందే లీకైంది. ఆ సినిమాను కొనడానికి ఎవరూ రాలేదు. నేను సంతకాలు పెట్టి ఆ సినిమాను రిలీజ్‌ చేయాల్సి వచ్చింది. పేరేమో ఆకాశమంత ఉంటుంది.. డబ్బు మాత్రం ఆ స్థాయిలో ఉండదు అన్నారు పవన్ కళ్యాణ్. హైద‌రాబాద్‌కి వ‌ర‌ద‌ల స‌మ‌యంలోనూ స్టార్లు ముందుకొచ్చారు. కోట్ల‌కు కోట్లు విరాళాలు ప్ర‌క‌టించారు. అయినా స‌రే.. ఓ వ‌ర్గంలో కాస్త అంతృప్తి ఉండ‌నే ఉంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ తన గత చిత్రం విషయం గుర్తు చేసుకున్నారు. ప్ర‌కృతి విప‌త్తులు జ‌రిగిన‌ప్పుడు, ఆప‌ద స‌మ‌యంలో, ప్ర‌జ‌ల్ని ఆదుకోవాల్సిన ప‌రిస్థితులో.. అంద‌రికంటే ముందే స్పందిస్తుంటూరు సినిమా వాళ్లు ‌. ముఖ్యంగా స్టార్లు ధారాళంగా విరాళాలు అందిస్తుంటారు. అయినా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  ఈ నేపధ్యంలో  జనసేన సోషల్‌ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూను ఆ పార్టీ విడుదల చేసింది.  వివిధ అంశాలపై పవన్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు. అవేంటో చూద్దాం.`
 

“సినిమా అనేది స‌మ‌ష్టి కృషి. బ‌య‌టి నుంచి చూసేవాళ్ల‌కు కోట్ల‌కు కోట్లు క‌నిపిస్తాయి. కానీ ఓ సినిమా పోతే నిర్మాత ఆస్తుల్ని అమ్ముకోవాల్సివ‌స్తుంది. `ఆరెంజ్‌` సినిమా పోతే.. అన్న‌య్య నాగ‌బాబు ఆస్తుల్ని అమ్ముకున్నాడు. మేం త‌లో చేయి వేసి బ‌య‌ట ప‌డేశాం అన్నారు పవన్.
undefined
ప‌ది కోట్లు పెట్టి సినిమా తీస్తే.. వంద కోట్ల‌లా అనిపిస్తుంది. చివ‌రికి కోటి మిగ‌లొచ్చు. అవి కూడా రాక‌పోవొచ్చు. క‌రోనా స‌మ‌యంలో.. ప‌నుల‌న్నీ ఆగిపోయాయి. ఆర్థిక వ్య‌వ‌స్థ స్థంభించిపోయింది. ఆ స‌మ‌యంలో సినిమా వాళ్లు విరాళాలు అందించాల్సివ‌చ్చింది. నిజానికి అప్పుడు మాక్కూడా ప‌ని లేదు క‌దా అని చెప్పుకొచ్చారు.
undefined
అక్ష‌య్ కుమార్ లాంటి వాళ్లు పాతిక కోట్లు సాయం అందించారు. నేను కోటి ఇచ్చాను. అది ఆయ‌న స్థాయి, ఇది నా స్థాయి. ఎవ‌రి ప‌రిధిలో వాళ్లు సాయం చేసుకుంటూ వెళ్లారు. `మీరెందుకు సాయం చేయ‌లేదు` అని ఎవ‌రికీ అడిగే హ‌క్కు లేదు. ఇది బాధ్య‌త‌గా భావించి చేయాలంతే. ఇప్పుడు నేనెందుకు అడుగుతున్నానంటే.. నేను సాయం చేశా కాబ‌ట్టే“ అని చెప్పుకొచ్చాడు ప‌వ‌న్‌.
undefined
అలాగే విరాళాలు సరిపోవట్లేదు అని చెప్పేవారు తమ జేబులోంచి కనీసం రూ.10 అయినా ఇచ్చారా? కష్టపడి పనిచేసేవారికి జేబులోంచి రూ.10లక్షలు ఇవ్వాలంటే మనసు అంగీకరిస్తుందా. చిత్ర పరిశ్రమకు ప్రాచుర్యం ఎక్కువగా ఉంటుంది. రూ.కోటితో సినిమా తీస్తే రూ.10కోట్ల ప్రాచుర్యం వస్తుంది. ఇక్కడ పేరున్నంతగా డబ్బు ఉండదు.నిజమైన సంపద రియల్‌ ఎస్టేట్‌, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల దగ్గర ఉంది.
undefined
ఒక సంవత్సరంలో రూపొందిన అన్ని సినిమాల బడ్జెట్ కలిపితే రూ.వేయి కోట్లు కూడా ఉండదు. ఒక వ్యక్తి సినీ పరిశ్రమలో రూ.కోటి సంపాదిస్తే పన్నులు, ఇతర ఖర్చులన్నీ తీసేస్తే చేతికి రూ.55లక్షల నుంచి రూ.60లక్షల వరకు మాత్రమే అందుతుంది. నష్టం వస్తే ఆ డబ్బు కూడా రాదు. ఎంతో మంది సినీ పరిశ్రమలో సర్వం కోల్పోయారు. చిత్ర పరిశ్రమ చాలా సున్నితమైంది. అందరూ దీన్ని సులువుగా లక్ష్యంగా చేసుకుంటారు.
undefined
తెలంగాణ ప్ర‌భుత్వానికి సాయం చేసిన హీరోలు, ఆంధ్ర ప్ర‌భుత్వానికి ఎందుకు విరాళాలు ప్ర‌క‌టించ‌లేదు? అనే మ‌రో ప్ర‌శ్న కూడా ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. దీనిపై కూడా ప‌వ‌న్ వివ‌రంగానే స‌మాధానం చెప్పారు.
undefined
“తెలంగాణలో యాక్టీవ్ సీఎం ఉన్నారు. ఆయ‌న విరాళాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞ‌ప్తి చేశారు. దాంతో.. మేమంతా స్పందించాం. ఏపీలో కూడా సీఎం యాక్టీవ్ అయి, అక్క‌డి ప్ర‌భుత్వం.. అడిగితే ఇచ్చేవాళ్లం” అంటూ వివ‌ర‌ణ ఇచ్చాడు.
undefined
ఒక్కో ఎమ్మెల్యే ఎన్నికల కోసం రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఖర్చు పెడతారు. ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులు ఎలాగూ రూ.వందల కోట్లు ఖర్చు పెడతారు.. ఇలాంటి ఈ విపత్తు సమయంలో అదే డబ్బును పెట్టుబడి అనుకొని.. అందులో కనీసం రూ.50కోట్లయినా ఖర్చు పెడితే బాగుంటుందనేది నా ఉద్దేశం.
undefined
అలాంటి వారితో పోల్చుకుంటే చిత్ర పరిశ్రమ చాలా చిన్నది. నేను ముందుగా సహాయం చేసి ఇతరులను అడుగుతాను. విరాళం అనేది స్పందించి ఇవ్వాలి తప్ప.. మీరెందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నలు అడగకూడదు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థే ఆగిపోయింది.. బయట డబ్బే పుట్టట్లేదు. ఒకవేళ పని చేసి సంపాదిద్దామన్నా ఆ అవకాశం కూడా లేదు.
undefined
ఇటువంటి సమయంలో విరాళాలు ఇవ్వాలంటే అందరికీ ఇబ్బందికరమైన పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వానికి అందరూ ఇచ్చారంటే ముఖ్యమంత్రి ముందుగా కోరారు. అందువల్ల ఇబ్బందైనా అందరూ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి కూడా అందర్నీ సంప్రదిస్తే బాగుంటుంది.
undefined
రూ.వేల కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన, ఓడిపోయిన ప్రతి పార్టీ అభ్యర్థులు ఈ విపత్తు సమయంలో ఇదే తమ పెట్టుబడి అనుకొని వరద బాధితులకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా’’ అని పవన్‌ కోరారు.
undefined
ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత సంపన్నులు, ప్రజలది కాదు.. ప్రభుత్వానిదే. ప్రజలు ఒక వ్యవస్థను ఎన్నుకున్నారు. మనం అనేక పన్నులు కట్టి ఒక వ్యవస్థ చేతిలో డబ్బు పెడుతున్నాం. అందువల్ల ప్రభుత్వం తప్పకుండా ఆదుకోవాలి.
undefined
అధికారం ఎవరి చేతిలో ఉంటే వారే విపత్తు సహాయ చర్యలను ముందుకు తీసుకెళ్లాలి. కానీ, కొన్ని సార్లు అధికారంలో ఉన్న వారికి కూడా చేయూత అందించాలి. పేరున్న వారు, ప్రముఖులు, సంపన్నులు ఇలాంటి విపత్తు సమయంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలి.
undefined
మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు అందరూ తప్పకుండా ముందుకు వస్తారు. ఈ విషయాన్ని నేను నమ్ముతాను. మనందరం కట్టిన పన్నులు ప్రభుత్వ ఖజానాకి చేరుతాయి. ఇలాంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం ఇష్టానుసారం కాకుండా చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెడితే బాగుంటుంది. ప్రభుత్వం సమర్థంగా పనిచేయాలి.
undefined
గత ఐదారు దశాబ్దాలుగా ఇంత వర్షపాతం ఎన్నడూ నమోదవ్వలేదు. గతంలోనూ వరద నీరొచ్చి ప్రాణ నష్టం సంభవించింది.. కానీ, ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. పట్టణ ప్రణాళిక సరిగా లేకపోవడమే దీనికి ముఖ్య కారణం. గత నాలుగు, ఐదు దశాబ్దాలుగా ప్రతి రాజకీయ పార్టీ అంచెలంచెలుగా చట్టాలకు తూట్లు పొడిచి నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టింది. ఎఫ్‌టీఎల్‌ (పుల్‌ ట్యాంక్‌ లోడ్‌) పరిధిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ.. ఓటు బ్యాంకు రాజకీయాలతో అందరూ వాటిని అతిక్రమించారు. అందుకే ఈ నష్టం సంభవించింది.
undefined
ప్రస్తుత తెరాస ప్రభుత్వం నాలాలపై అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని చెప్పింది. కానీ, వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పటికైనా నాలాల మీద అక్రమ నిర్మాణాలను తొలగించాలి. అలా చేస్తే భవిష్యత్తులోనైనా ప్రాణనష్టం సంభవించకుండా ఉంటుంది. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
undefined
ఇక వరదలతో హైదరాబాద్ అల్లాడిపోతుంటే ఇండస్ట్రీ ముందుకొచ్చి సహాయం ప్రకటించింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు తన శక్తి కొలది ముఖ్యమంత్రి సహాయ నిధికి సహాయం ప్రకటించారు.
undefined
సినీ కెరీర్ విషయానికి వస్తే.. పవన్‌కల్యాణ్‌ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. ‘వకీల్‌ సాబ్‌’ చిత్రీకరణ దాదాపు పూర్తి కాగా, క్రిష్‌, హరీశ్‌ శంకర్‌, సురేందర్‌రెడ్డిల దర్శకత్వంలో సినిమాలు షూటింగ్‌కు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ నిర్మాణంలో మరో సినిమాకు ఓకే చెప్పారు పవన్‌ పచ్చ జెండా ఊపారు.
undefined
లాక్ డౌన్ కారణంగా 7 నెలలకు పైగా విరామం తీసుకున్న తరువాత, పవన్ కళ్యాణ్ త్వరలో వకీల్ సాబ్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
undefined
లాక్‌డౌన్‌కి ముందే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. కొన్ని కోర్టు సీన్స్ అలాగే క్లైమాక్స్ ఫైటింగ్ సీన్స్ పవన్ కల్యాణ్‌పై చిత్రీకరించనున్నారు. వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ మరో మూడు సినిమాలకు సైన్ చేశారు. ఈ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌లు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.
undefined
click me!