ఇటలీలో ప్రభాస్‌ బర్త్ డే సెలబ్రేషన్‌.. ఎలా జరిగిందో చూడండి!

First Published | Oct 24, 2020, 8:00 AM IST

ప్రభాస్‌ తన 41వ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. ఆయన బర్త్ డే వేడుకలు ఇటలీలో జరగడం విశేషం.  సెట్‌లోనే సింపుల్‌గా కేక్‌ కట్‌ చేశారు డార్లింగ్‌.

`బాహుబలి` స్టార్‌ ప్రభాస్‌ తన బర్త్ డే తన 41వ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం సోషల్‌ మీడియా షేక్‌ అయ్యింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, అభిమానులవిశెష్‌తో `హ్యాపీబర్త్ డే ప్రభాస్‌` హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయ్యింది.
మరోవైపు పుట్టిన రోజుని పురస్కరించుకుని వరుసగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ అభిమానులను ఖుషీ చేశారుప్రభాస్‌. వీటికి విశేష స్పందన లభించింది. `బీట్స్ ఆఫ్‌ రాధేశ్యామ్‌` పేరుతో విడుదల చేసిన మోషన్‌ పోస్టర్‌ విశేషంగా ఆకట్టుకుంది.

ప్రభాస్‌ తన బర్త్ డే వేడుకలను ఇటలీలో జరుపుకున్నారు. ప్రస్తుతం ఆయన `రాధేశ్యామ్‌` చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతుంది. దీంతో అక్కడే సెట్‌లో సెలబ్రేట్‌ చేసుకున్నారు ప్రభాస్‌. కూల్‌ ప్లేస్‌ని చూసుకుని చిత్ర యూనిట్‌ మధ్య కేక్‌ కట్‌ చేసి తనఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఇందులో ప్రభాస్‌ సరసన పూజా హెగ్దే కథానాయికగా నటిస్తుంది. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్యగా, పూజా ప్రేరణగా నటిస్తున్నారు. పీరియాడికల్‌ నేపథ్యంలో వింటేజ్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా రూపొందుతుంది.
యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలనాటి నటి భాగ్యశ్రీ, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జస్టిన్‌ప్రభాకరన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.
భారీ తారాగణం, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

Latest Videos

click me!