బిగ్‌బాస్‌ బ్లాక్‌ బస్టర్‌.. అసంపూర్తి కథతో సినిమా పరమ బోరింగ్గా?

First Published Oct 23, 2020, 10:31 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 47వ రోజు హౌజ్‌ సినిమా సందడి నెలకొంది.  స్క్రిప్ట్, కెమెరా, యాక్షన్‌, కట్‌, డైరెక్టర్‌, డాన్సులతో ఆద్యంతం రసవత్తరంగా సాగింది. 

47వ రోజు మొదట ఇంటిసభ్యులకు సెంచురీ మ్యాట్ కి చెందిన బెడ్‌ పై అలారం మొగేంత వరకు ఉన్నవాళ్ళు విన్నర్‌ అని చెప్పగా, అందరు బెడ్‌పై పడ్డారు. సోహైల్‌ ఇది తనకేఇవ్వాలన్నారు. తనే మొదట పడి చివరి వరకు ఉన్నాడు. ఈ బెడ్‌ ప్రమోషన్‌లో భాగంగా పెట్టిన ఈ టాస్క్ చిరాకు పెట్టించింది.
undefined
ఆ తర్వాత ఇంటిసభ్యులకు సినిమా తీసే టాస్క్ పెట్టాడు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో `బిగ్‌బాస్‌ బ్లాక్‌బస్టర్‌` సినిమా తీయాలని చెప్పాడు బాస్‌. ఇందులో దర్శకుడిగా అభిజిత్‌, అసిస్టెంట్‌డైరెక్టర్‌గా దివి, స్క్రిప్ట్ రైటర్‌, నటుడుగా అవినాష్‌, డీఓపీగా నోయల్‌, కొరియోగ్రాఫర్‌గా అమ్మా రాజశేఖర్‌, మేకప్‌, స్టయిలీష్‌గా లాస్య, ఐటెమ్‌ సాంగ్‌ డాన్సర్లుగా సోహైల్‌, హారికచేయాలని చెప్పారు. ఇక హీరోగా అఖిల్‌, హీరోయిన్‌గా మోనాల్‌, అరియానా, విలన్‌గా మెహబూబ్‌ చేయాలని అభిజిత్‌ చెప్పారు.
undefined
మరోవైపు మోనాల్‌కి సోహైల్‌ని పరిచయం చేస్తూ `ఈయన ఐటెమ్‌ రాజా` అని చెప్పడం నవ్వులు పూయించింది. మరోవైపు టైటిల్‌ ఏంటన్నప్పుడు లాస్య.. `బిగ్‌బాస్‌ 3కంటెస్టెంట్స్ తోపు.. దమ్ముంటే ఆపు` అనే టైటిల్‌ పెడదామనడం మరింతగా కామెడీ పండింది.
undefined
లవ్‌ సీన్‌ విషయంలో అఖిల్‌కి కెమెరామెన్‌ నోయల్‌ ఎక్స్ ప్లయిన్‌ చేశారు.
undefined
స్టోరీ డిస్కషన్‌లో అభిజిత్‌ ఫైర్ అయ్యాడు. తనకు అడ్డు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కథ పూర్తిగా లేకుండా, డైలాగ్‌లు పూర్తి కాకుండా సినిమాలు ఎలా తీస్తారో, అప్పటికప్పుడు డైలాగులు ఎలా రాసుకుంటారనేది ఇందులో బాగా చూపించారు.
undefined
షూటింగ్‌ ప్రారంభించారు. ప్రారంభంలోనే కొరియోగ్రాఫర్‌ అమ్మా రాజశేఖర్‌కి, దర్శకుడికి మధ్య స్క్రిప్ట్ విషయంలో వివాదం చెలరేగింది. మరోవైపు డైలాగ్‌ల విషయంలో అవినాష్‌,అభిజిత్‌ మధ్య డీప్‌ డిస్కషన్‌ జరిగింది.
undefined
సీన్‌ ఎక్స్ ప్లెయిన్‌ చేస్తూ అరియానాని ఓ ఆట ఆడుకున్నాడు అవినాష్‌. డైలాగ్స్ సరిగ్గా చెప్పడం లేదని ఆమెని వెళ్ళిపోమ్మని బెదిరింపులకు దిగాడు.
undefined
ముందుగా హారిక, సోహైల్‌కు డాన్స్ స్టెప్పులు నేర్పించాడు అమ్మా రాజశేఖర్‌. మోనాల్‌ వద్దకు సోహైల్‌ వెళ్ళినప్పుడు ఈయన ఎవరని మోనల్‌ అడగ్గా.. ఐటెమ్‌ రాజా అని లాస్య చెప్పడం నవ్వులు పూయించింది.
undefined
సోహైల్‌, హారికలపై ఐటెమ్‌ సాంగ్‌ రిహార్సల్‌ చేయించారు. ఇందులో హారిక ఐటెమ్‌ గర్ల్ గా తనదైన స్టెప్పులేసి ఆకట్టుకుంది.
undefined
హీరోహీరోయిన్లు అఖిల్‌, మోనాల్‌ లవ్‌ సీన్‌ని ఇరగదీశారు. నిజమైన లవర్స్ గా ఇన్‌వాల్వ్ అయి చేశారు. దీనికి అందరు క్లాప్స్ కొట్టారు.
undefined
click me!