Salaar Twitter Review: సలార్ మూవీ ట్విట్టర్ రివ్యూ, ప్రభాస్ సాలిడ్ కమ్ బ్యాక్.. ఇక రచ్చ రచ్చే...

First Published | Dec 22, 2023, 3:54 AM IST

బాహుబలి తరువాత చాలా పాన్ ఇండియా సినిమాలు చేశాడు ప్రభాస్. కాని ఏ సినిమా తనకు సాలీడ్ గా వర్కౌట్ అవ్వలేదు. దాంతో ఈసారి పక్కాగా హిట్టు కొట్టాల్సిందే అన్నపట్టుదలతో ప్రశాంత్ నీల్ తో జతకట్టాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సలార్ సినిమా ఈరోజు( 22 డిసెంబర్ ) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈక్రమంలో ముందు రోజు ప్రీమియర్ షోలు సందడి చేయగా.. సినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రయాన్ని వెల్లడిస్తున్నారు. 
 

ప్రభాస్ కు ఈసినిమా హిట్ ఎంతో ముఖ్యం. ఈమూవీ బ్లాక్ బస్టర్ అయితే.. ప్రభాస్ మరోసారి విజృంబించే అవకాశం ఉంది. బాహుబలి తరువాత  హ్యాట్రిక్ ఫెయిల్యూర్ ను ఫేస్ చేశాడు ప్రభాస్. సలార్ పైనే ఆశలన్నీపెట్టుకున్నాడు. శృతీ హాసన్ హీరోయిన్ గా.. మలయాళ స్టార్ పృద్విరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ రోల్ చేసిన ఈమూవీపై ట్విట్టర్ లో రకరకాల కామెట్లు విపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈసినిమాతో మరో పాన్ ఇండియా హిట్ కొట్టగలిగాడా..? 
 

ప్రస్తుతం పానిండియా అంతట సలార్ మ్యానియా గట్టిగా నడుస్తుంది. సినిమా చూసిన ఆడియన్స్ కూడా పూనకాలతో ఊగిపోతున్నారు.  ప్రభాస్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడంటున్నారు ట్విట్టర్ జనాలు. ఇక అటు కన్నడ ఆడియన్స్ మాత్రం మా ప్రశాంత్ నీల్ గట్టిగాసాధించాడంటూ.. ట్వీట్లు మీద ట్వీట్లు వేస్తున్నారు. 
 


సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ సలార్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు  ఆడియన్స్ లో కలిసిపోయి .. సలార్ ను ఎంజాయ్ చేస్తూ.. విజిల్స్ వేస్తూ..గెంతులు వేస్తున్న వీడియో ఒకటి ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు సలార్ ఆడియన్స్ చేత ఎంతలా పూనకాలు తెప్పించింది అనేది.

ప్రభాస్ మంటలు పుట్టించాడు అంటున్నారు ఫ్యాన్స్. ఈ ఏడాది అయిపోతుంది.. కాని ఏడాది చివర్లో.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నుఅందించాడు.. న్యూ ఇయర్ పార్టీకిరెడీగా ఉంటుందటూ ట్వీట్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం బ్లాక్ బస్టర్ సలార్ లాంటూ..ఎమ్మోజీలు పెట్టి సింపుల్ గా సినిమా గురించి చెప్పేస్తున్నారు. ఇక ప్రభాస్ తో పాటు పృధ్విరాజ్ నటనకు కూడా ఫిదా అవుతున్నారు జనాలు. 

ఇక ప్రభాస్  పెర్ఫామెనస్ గురించి..ప్రశాంత్ నీల్ టేకింగ్  గురించి వరుస ట్వీట్లు దర్శనం ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ సీన్ కట్ ఒకటి వైరల్ అవుతోంది. డీప్ పేయిన్ ను ఇంత కంటే అద్బుతంగా ఎవరు చూపించలేరు.. ప్రభాస్ ఎక్స్ ప్రెషన్స్.. అద్భుతం అంటూ.. ట్వీట్ చేశారు.. ఇక ఇంకో నెటిజన్ టేక్ అబౌవ్.. ప్రభాస్ అంటూ సింపుల్ గా సినిమా గురించి చెప్పేశాడు. 

salaar release trailer

ఆంధ్రా.. తెలంగాణ మాత్రమే కాదు.. బెంగళూర్ లో కూడా బ్లాక్ బస్టర్ సలర్ అంటూ మరో ట్వీట్ హైలెట్ అవుతోంది. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ కు అదరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఫ్యాన్స్. ఇక ఈ మ్యానియాలో డంకీ లాంటిసినిమాలు నిలబడటం కష్టమనే చెప్పాలి. అటు సలార్ ను విమర్షించిన కన్నడ హీరో సినిమా పరిస్థితి కూడా స్పంష్టంగా తెలుస్తోంది. 

1000 కోట్లు లోడింగ్ అంటూ.. ఇప్పటికే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు ప్యాన్స్..బోలెడంత యాక్షన్, బోలెడంత సర్ప్రైజ్ మరియు బోలెడంత ట్విస్ట్ అండ్ టర్న్, ఇదొక మాస్ మూవీ మరియు రెబల్  స్టార్ మ్యానియా.. ఇక  ప్రభాస్ యాక్టింగ్ చాలా చూడముచ్చటగా ఉంది, ఫుల్ ఆన్ పైసా వసూల్ మూవీ అంటూ మరో ట్విట్టర్ రివ్యూ వైరల్ అవుతోంది. 

1000 కోట్లు లోడింగ్ అంటూ.. ఇప్పటికే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు ప్యాన్స్..బోలెడంత యాక్షన్, బోలెడంత సర్ప్రైజ్ మరియు బోలెడంత ట్విస్ట్ అండ్ టర్న్, ఇదొక మాస్ మూవీ మరియు రెబల్  స్టార్ మ్యానియా.. ఇక  ప్రభాస్ యాక్టింగ్ చాలా చూడముచ్చటగా ఉంది, ఫుల్ ఆన్ పైసా వసూల్ మూవీ అంటూ మరో ట్విట్టర్ రివ్యూ వైరల్ అవుతోంది. 

మొత్తానికి ట్విట్టర్ ఆడియన్స్ ను మాత్రం ఒక ఊపు ఊపేస్తోంది సలార్. ఇక ఈరోజు సినిమా రిలీజ్ అయ్యి..కలెక్షన్ల సునామీ  సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉమర్ సంధు లాంటి సంచలనాల క్రిటిక్.. ఈసినిమాపై పాజిటీవ్ రివ్యూ ఇచ్చాడంటే.. ఈమూవీకిఇక తిరుగు లేదు..తెలుగు కన్నడ అభిమానులతో పాటు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ దొరికినట్టే . ఇక సలార్ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. 
 

Latest Videos

click me!