ప్రభాస్‌ రాకతో హోరెత్తిపోయిన మొగల్తూరు.. అభిమానులతో డార్లింగ్‌ ముచ్చట్లు.. భోజనం చేసి వెళ్లండి అంటూ పలకరింపు

First Published Sep 29, 2022, 4:49 PM IST

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సంస్మరణ సందర్భంగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, కృష్ణంరాజు ఫ్యామిలీ మొగల్తూరులో సందడి చేసింది. వారి అభిమానులను కలుసుకుని అభివాదం చేశారు. వారితో ప్రభాస్‌ ముచ్చటించడం విశేషం. ప్రస్తుతం ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

రెబల్‌ స్టార్‌ కృష్ణరాంజు సంస్మరణ సభ సొంతూరు మొగల్తూరు(వెస్ట్ గోదావరి)లో గురువారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల సమక్షంలో భారీ స్థాయిలో ఈ వేడుక నిర్వహిస్తున్నారు. ప్రభాస్‌తోపాటు కృష్ణంరాజు ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు, ప్రభాస్‌ అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమాన హీరోని చూసేందుకు వారంతా భారీ సంఖ్యలో మొగల్తూరులోని కృష్ణంరాజు నివాసానికి చేరుకున్నారు. అభిమానుల కోలాహలంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. అభిమానులను చూసి ఉప్పొంగిపోయారు ప్రభాస్‌. 

అంతేకాదు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు, పిన్ని, చెల్లెల్లను సైతం వారికి చూపిస్తూ ప్రభాస్‌ వారిచేత ప్రభాస్‌ అభివాదం చేయించారు. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి అభిమానులకు నమసారాలు తెలియజేసింది. 

 మరోవైపు ప్రభాస్‌ కాసేపు అభిమానులకు కనిపించి వారిచేత ముచ్చటించారు. ప్రభాస్‌ని చూడటంతో అభిమానులంతా అరుపులతో హోరెత్తించారు. కొన్ని నిమిషాలపాటు ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. వారి అభిమానానికి ముగ్దుడైన ప్రభాస్‌ అభివాదం చేశారు. 

ప్రభాస్‌ కాసేపు అభిమానులకు కనిపించి వారిచేత ముచ్చటించారు. ప్రభాస్‌ని చూడటంతో అభిమానులంతా అరుపులతో హోరెత్తించారు. కొన్ని నిమిషాలపాటు ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది. వారి అభిమానానికి ముగ్దుడైన ప్రభాస్‌ అభివాదం చేశారు. 
 

ఇదిలా ఉంటే అభిమానులు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులు భారీగా తరలి వచ్చిన నేపథ్యంలో సుమారు లక్ష మందికి వంటకాలు చేయించారు. దాదాపు 25 రకాల వంటలు చేయించడం విశేషం. ఆ మెనూ చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే. అంతేకాదు ఆ వంటలు చూస్తే నోరూరాల్సిందే. మటన్‌, చికెన్, ఫిష్‌, ఫ్రాన్స్, పీతలు, వెజ్‌ వంటకాలు చేయించారు. ఫుడ్‌ విషయంలోనూ ప్రభాస్‌ తన ప్రేమని చాటుకోవడం విశేషం. 
 

టాలీవుడ్‌లో రెబల్‌ స్టార్‌గా పేరుతెచ్చుకున్న కృష్ణంరాజు అనారోగ్యంతో సెప్టెంబర్‌ 11న కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్‌ కుటుంబంతోపాటు టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ సైతం షాక్‌కి గురైంది. తాజాగా సొంతూరు మొగల్తూరులో గురువారం కృష్ణంరాజు సంస్మరణ సభని నిర్వహించారు.

click me!