బ్లూ శారీలో రమ్యకృష్ణ మైండ్ బ్లోయింగ్ పోజులు.. చీరకట్టులో శివగామి అందాల మెరుపులు.!

First Published Sep 29, 2022, 4:18 PM IST

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ (Ramya Krishnan) అందాల ఆరబోతలో ఆకట్టుకుంటోంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ మరింతగా గ్లామరస్ గా దర్శనమిస్తూ అభిమానులకు అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా రమ్యకృష్ణ పంచుకున్న పిక్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.
 

తెలుగు, తమిళం, మలయాళంలో వరుసపెట్టి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. మరోవైపు ఇంటర్నెట్ లోనూ అందాల విందు చేస్తూ అభిమానులు, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ మేరకు వరసగా ఫొటోషూట్లు చేస్తోంది.
 

సీనియర్ నటి రమ్యకృష్ణ నెట్టింట అందాల ఆరబోతలో జోరు పెంచుతోంది. ఐదుపదల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లనే మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. చీరకట్టులో గ్లామర్ విందు చేస్తూ కుర్రకారును సైతం ఉడికించేస్తోంది. 
 

ఏమాత్రం తగ్గని అందంతో రమ్యకృష్ణ చేస్తున్న ఫొటోషూట్లు అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా చీరకట్టులో మెరిసిన రమ్యకృష్ణ మతిపోయేలా ఫొటోలకు పోజులిచ్చింది. మత్తు చూపులు, మతిపోయే పోజులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

తాజాగా బ్లూ శారీలో దర్శనమిచ్చిన స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఫొటోషూట్ చేసింది. ఆ ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ ద్వారా పంచుకుంది. బ్లూ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో సీనియర్ హీరోయిన్ హోయలు పోయింది. 
 

అప్పట్లోనే గ్లామర్ షోతో, అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో కుర్రకారును ఉర్రూతలూగించిన రమ్యకృష్ణ.. ఇప్పటికీ అదే పంథాలో పయనిస్తోంది. చీరకట్టులోనే అసలైన అందాలను విందుచేస్తూ యువతను మరో లోకంలోకి తీసుకెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా పంచుకున్న ఫొటోలకు నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు. 
 

కేరీర్ లో ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న రమ్యకృష్ణ ఇటు టీవీ షోలతోనూ ప్రేక్షకులను అలరిస్తోంది. తమిళం, మలయాళం, తెలుగులో ప్రసారం అవుతున్న డాన్స్ షోలకు జడ్జీగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. ఇటీవల ‘ఆహా’లో ప్రసారం అవుతున్న Dance Ikonషోకు జడ్జీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈషోతో తెలుగు ఆడియెన్స్ ను మరింతగా అలరిస్తోంది.
 

click me!