సరిగ్గా 2 గంటల 59 నిమిషాల నిడివితో ఆదిపురుష్ చిత్రం మొదలవుతుంది. ముందుగా చెప్పినట్లుగా దర్శకుడు ఓం రౌత్.. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతా దేవి వనవాసం సన్నివేశంతో కథని ప్రారంభించారు. ఓం రౌత్ ఈ చిత్రాన్ని అరణ్య కాండ, యుద్ధ కాండ ఆధారంగా తెరకెక్కించినట్లు ఆల్రెడీ చెప్పారు. ఓ యాక్షన్ సన్నివేశంతో శ్రీరాముడిగా ప్రభాస్ పరిచయ జరుగుతుంది. అంతకు ముందు రావణుడిగా సైఫ్ అలీఖాన్ భయంకరమైన ఎంట్రీ ఇస్తాడు.