`ఆదిపురుష్‌`ని ఎందుకు చూడాలంటే.. ఐదు కారణాలు.. అవి చాలా స్పెషల్‌..

Published : Jun 15, 2023, 11:36 PM IST

ప్రభాస్‌ నటించిన `ఆదిపురుష్‌` హవా సాగుతుంది. ఈ సినిమా కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది, టీమ్‌ ఊహించని బజ్‌ ఈ సినిమాపై ఉంది. మరి `ఆదిపురుష్‌`ని ఎందుకు చూడాలంటే.. ప్రధానంగా ఐదు మిస్‌ చేసుకోలేని కారణాలున్నాయి. 

PREV
16
`ఆదిపురుష్‌`ని ఎందుకు చూడాలంటే.. ఐదు కారణాలు.. అవి చాలా స్పెషల్‌..

`రామాయణం` ఆధారంగా హిందీ దర్శకుడు ఓం రౌత్‌ `ఆదిపురుష్‌` చిత్రాన్ని రూపొందించారు. ప్రభాస్‌ రాముడిగా నటించారు. కృతి సనన్‌ సీత పాత్రలో నటించింది. సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా నటించారు. చాలా కాలం తర్వాత `రామాయణం` ఆధారంగా తెలుగులో సినిమా రావడం విశేషం. సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందడం విశేషం. 3డీ వెర్షన్‌లోనూ ఈ సినిమా తెరకెక్కడం మరో విశేషం. ఈ సినిమా రిలీజ్‌కి ముందే సంచలనాలు క్రియేట్‌ చేస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు కొల్లగొడుతుంది. ఇప్పటికే వేల షోస్‌ ఫుల్‌ అయిపోయాయి. మూడు రోజుల వరకు టికెట్లు సోల్డ్ అవుట్‌ కావడం విశేషం. దీనికితోడు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనూ సంచలనంగా మారింది. నాలుగు వందల కోట్లు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ద్వారానే రావడం విశేషం. 
 

26

ఈ నేపథ్యంలో `ఆదిపురుష్‌` సినిమాని ఎందుకు చూడాలని అంటే అందుకు ప్రధానంగా ఐదు కారణాలు గమనించవచ్చు. ఈ ఐదు కారణాలతో సినిమా చూడొచ్చు అనే ఒక అవగాహనకు వచ్చేలా ఉంటుంది. మరి అవేంటో చూద్దాం. మొదటగా.. పౌరాణిక నేపథ్యంలో తెలుగులో సినిమాలు చాలా వచ్చాయి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, శోభన్‌బాబు, బాలకృష్ణ వంటి వారు రాముడిగా నటించి మెప్పించారు. అయితే చాలా కాలం తర్వాత రామాయణం ఆధారంగా `ఆదిపురుష్‌` తెరకెక్కడంతో దీనిపై సర్వత్రా అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఇందులో ప్రభాస్‌ రాముడిగా నటిస్తుండటం విశేషం. యాక్షన్‌, కమర్షియల్‌ సినిమాలు, అలాంటి హీరోయిజం ఉన్న పాత్రలతో మెప్పించిన ప్రభాస్‌ మొదటిసారి పౌరాణిక పాత్ర పోషిస్తున్నారు. రాముడిగా మారిపోయాడు. ఆయన రాముడిగా నటించడం అనేది అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రభాస్‌ గ్లోబల్‌ స్టార్‌ కావడంతో రాముడిగా ఎలా మెప్పించబోతున్నాడనేది, గత హీరోలను మించి ఎలా మెస్మరైజ్‌ చేయబోతున్నారనే పాయింట్‌లో ఈ సినిమాని చూడాలి. 

36

అంతే కాదు.. పాత్రలను చూపించిన తీరు విషయంలోనూ ఈ సినిమా చర్చనీయాంశం అయ్యింది. గతంలో వచ్చిన సినిమాల్లో రాముడి పాత్ర ఒకలా ఉంటే, `ఆదిపురుష్‌`లో రాముడి పాత్ర మరోలా ఉంది. గతంలో వచ్చిన సినిమాలు, పుస్తకాల్లో ఉన్నదాని ప్రకారం..రాముడికి మీసాలుండవు, కట్టుబొట్టు, వేషధారణ కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. సాధువులను తలపిస్తుంది. కానీ ఇందులో రాముడు అంటే ఓ యుద్ధ వీరుడిలా చూపించారు. ప్రభాస్‌.. గతంలో `బాహుబలి` సినిమాలు చేయడంతో ఇందులోనూ ఆ తరహా లుక్‌ కనిపిస్తుంది. పైగా ఇందులో ప్రభాస్‌కి మీసాలు పెట్టారు. ఈ విషయంలో అనేక విమర్శలు వచ్చాయి. ఇది చర్చనీయాంశం అయ్యింది. దీంతోపాటు సీత పాత్రలో కృతి సనన్‌ గెటప్‌ కూడా వేరేలా ఉందని, ఓ క్రిస్టియన్‌ అమ్మాయిని తలపిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీతని ఎలా చూపించబోతున్నారనేది, మరోవైపు హనుమంతుడి ముస్లీం సోదరుడిని తలపిస్తున్నాడని, అలాగే రావణాసురుడి పాత్రలో సైఫ్‌ అలీ ఖాన్‌ని కూడా కొత్తగా చూపిస్తున్నారు. ఆయన కళ్లకి కాటుక పెట్టుకొని ఉన్నాడు. దీంతోపాటు ఆయన వేషధారణ సైతం కొత్తగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇందులో ప్రధాన పాత్రలను ఎలా చూపించబోతున్నారు, గతంలో వచ్చిన సినిమాల నేపథ్యంలో ఆడియెన్స్ లో ఒక ఫీలింగ్‌ ఉంది, దాన్ని దాటుకుని ఆడియెన్స్ ని కన్విన్స్ చేసేలా పాత్రలుంటాయా? అనే యాంగిల్‌లో ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇదొక ట్రెండ్‌ సెట్టర్‌ కాబోతుందా? ఆధునిక రాముడిని ఆవిష్కరించబోతుందా అనే కోణంలో ఈ సినిమాని చూడాలి. 
 

46

మూడోవది.. కథ.. `రామాయణం` అంటే అందరికి తెలిసిన కథే. అందులో కొత్తదనం ఏం లేదు. దాన్ని ఎలా చూపించబోతున్నారనేది ఇక్కడ ముఖ్యం. ఎంతో ఎమోషనల్‌గా, డ్రామా ఎంత రక్తికట్టించేలా తెరకెక్కించారనేది ఇక్కడ ఇంపార్టెంట్‌ ఆ విషయంలో ఈ సినిమా ఎలా ఉండబోతుంది. ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ని ఇవ్వబోతుందనేది ముఖ్యం. విజువల్‌గా ఈ సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉండబోతుంది, పౌరాణికం నేపథ్యంలో 3డీలో తెరకెక్కిన సినిమా కావడంతో విజువల్‌ వండర్‌గా ఉండబోతుందనే టాక్‌ ఉంది. ట్రైలర్‌లో ఆ విషయం స్పష్టమవుతుంది. కాబట్టి ఈ యాంగిల్‌లోనూ ఈ సినిమా ఆడియెన్స్ కి ఎంతటి కనువిందు చేయబోతుందనే యాంగిల్‌లో సినిమాని చూడాల్సిన అవసరం ఉంది. కంటెంట్‌తో సంబంధం లేకుండా, విజువల్‌ పరంగానూ యుద్ధ సన్నివేశాల పరంగా ఈ సినిమాని పెద్ద వాళ్ల నుంచి చిన్న పిల్లలు వరకు చూడొచ్చు. 

56

`ఆదిపురుష్‌` సినిమా టీజర్‌ వచ్చినప్పుడు విమర్శల పాలయ్యింది. వీఎఫ్‌ఎక్స్ నాసికరంగా ఉన్నాయని, మోషన్‌ పిక్చర్స్ టెక్నాలజీ సెట్‌ కాలేదని, ప్రభాస్‌ ఒరిజినాలిటీగా కనిపించడం లేదనే విమర్శలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సుమారు వంద కోట్లు ఖర్చుచేసి సినిమా వీఎఫ్‌ఎక్స్ విషయంలో కేర్‌ తీసుకుంది యూనిట్‌. మోషన్‌ పిక్చర్స్ టెక్నాలజీని తీసేసి రియాలిటీగా చూపించారు. ట్రైలర్‌లో అది స్పష్టమైంది. అంతేకాదు ఇందులో ఎమోషన్స్ కి పెద్ద పీటవేశారు. సీత పాత్రలో చాలా డ్రామా ఉందా, చాలా ఎమోషన్ ఉంది, రాముడి, సీతల మధ్య ప్రేమతో కూడిన భావోద్వేగం ఉంది, అదే సమయంలో రాముడు, లక్ష్మణుల మధ్య సోదర బంధం ఉంది, దీనికితోడు రాముడు హనుమంతుడి మధ్య విడదీయలేని బంధం ఉంది. ఇవన్నీటి వెనకాల అంతులేని ఎమోషన్‌ ఉంది. అదే ఈ సినిమాకి పెద్ద బలం. దీనికితోడు ఇది యూనివర్సల్‌ కాన్సెప్ట్, పెద్ద వాళ్ల నుంచి చిన్న పిల్లల వరకు చూడొచ్చు. ఎంజాయ్‌ చేయోచ్చు. ఈ యాంగిల్‌లోనూ ఈ సినిమాని కచ్చితంగా చూడాలి.
 

66

దర్శకుడు ఓం రౌత్‌, టెక్నీకల్‌ టీమ్‌.. దర్శకుడు ఓం రౌత్‌ అంతకు ముందు హిస్టారికల్‌ యాక్షన్‌ మూవీ `తానాజీ` చేశాడు. అజయ్‌ దేవగన్‌, సైఫ్‌, కాజోల్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్‌ కావడంతోపాటు మూడు జాతీయ అవార్డులు అందుకుంది. అత్యధిక ప్రజాదరణపొందిన సినిమాగా జాతీయ అవార్డుని, నటుడిగా అజయ్‌ దేవగన్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా జాతీయ అవార్డులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఓం రౌత్‌ నుంచి వస్తోన్నసినిమా కావడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. ఎలా తెరకెక్కించబోతున్నాడనే కుతుహలం అందరిలోనూ ఉంది. బాగా చేస్తాడనే నమ్మకం ఉంది. ఎట్టిపరిస్థితుల్లోనూ డిజప్పాయింట్‌ చేయదనే నమ్మకంతోనూ ఈ సినిమాని చూడొచ్చు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థలు టీ సిరీస్‌, యువీ క్రియేషన్స్ నిర్మాణంలో వచ్చిన సినిమా కావడంతో క్వాలిటీ పరంగానూ తక్కువగా ఉండదని అర్థమవుతుంది. ఐదు వందల కోట్లతో నిర్మించే సాహసం చేశారంటేనేది ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ యాంగిల్‌లోనూ `ఆదిపురుష్‌`ని చూడొచ్చు. భారీ అంచనాలతో, ఊహించని రేంజ్‌లో సుమారు 9వేల స్క్రీన్లలో `ఆదిపురుష్‌` రిలీజ్‌ కాబోతుండటం విశేషం. దీంతోపాటు ఇప్పటికే వేల స్క్రీన్లు ఫుల్‌ కావడం మరో విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories