విజయ్ దేవ‌ర‌కొండ‌, రాహుల్ చిత్రం టైటిల్ ఇదే ? బ్రిటీష్ కాలంలో కథ.. నెక్ట్స్ లెవల్‌

First Published May 22, 2024, 10:26 AM IST

బ్రిటీష్ వారి కాలంలో ఈ సినిమాలో  కొంత క‌థ న‌డుస్తుంది. ఆ క‌థంతా ఫ్లాష్ బ్యాక్ రూపంలో వ‌స్తుంద‌ని, ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటుందట.

  విజయ్ దేవరకొండ గత కొంతకాలంగా కెరీర్ పరంగా వెనకపడ్డారు.  'నోటా' దగ్గర నుంచి వరసగా సినిమాలు ఫెయిల్ అవుతూ వచ్చాయి. గతేడాది వచ్చిన 'ఖుషి' ఓకే అనిపించింది.. రీసెంట్‌గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' డిజాస్టర్ అయ్యింది. అయినా  విజయ్ చేతిలో ఇప్పుడు మూడు క్రేజీ సినిమాలు ఉన్నాయి. వీటిలో 'శ్యామ్ సింగరాయ్' తీసిన రాహుల్ సంకృత్యాన్ ప్రాజెక్ట్ ఒకటి. 19వ శతాబ్దానికి చెందిన పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తీస్తున్నారు. రీసెంట్ గానే కాన్సెప్ట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.  ఈ పోస్టర్ తో సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఏర్పడ్డాయి. 

మైత్రీ మూవీమేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ట్యాక్సీవాలా, శ్యామ్‌సింగరాయ్‌ సినిమాలతో దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్నారు రాహుల్‌ సంకృత్యాన్‌. విజయ్‌తో చేయనున్న సినిమాకి కూడా వైవిధ్యమైన కథనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.  తాజాగా ఈ సినిమా టైటిల్ ఒకటి అంటూ బయిటకు వచ్చింది.   
 

Vijay Devarakonda

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం కోసం ‘ర‌ణ‌భాలీ’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.  రాహుల్ గత సినిమా మాదిరిగానే ఇందులోనూ హీరో డ్యూయల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ అయితే వినిపిస్తోంది. అది కూడా తండ్రి కొడుకుల పాత్రలని అంటున్నారు. మరి వేర్వేరు టైమ్ జోన్స్‌కి చెందినవా? లేదంటే ఒకసారి తెరపై కనిపిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. 

Vijay Devarakonda

అలాగే బ్రిటీష్ వారి కాలంలో ఈ సినిమాలో  కొంత క‌థ న‌డుస్తుంది. ఆ క‌థంతా ఫ్లాష్ బ్యాక్ రూపంలో వ‌స్తుంద‌ని, ఫ్లాష్ బ్యాక్ లో తండ్రి పాత్ర ప‌వ‌ర్‌ఫుల్ గా తీర్చిదిద్దార‌ని చెప్తున్నారు. సినిమా కథ 1854 - 1878 సంవత్సర కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే స్టోరీ ఎలాంటి స్వాతంత్ర్య సమరయోధుల గురించి కాదని, పూర్తిగా రూరల్ ప్రాంతాల నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పారు. 

Vijay Devarakonda

రాయలసీమ బ్యాక్​డ్రాప్​లో యాక్షన్ సీక్వెన్స్‌లతో సినిమా ఉంటుందని అన్నారు. ఇక ఈ సినిమాలో విజయ్​ డ్యుయల్ రోల్​ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇదివరకు టాక్సీవాలా వచ్చింది. 2018లో రిలీజైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. దీంతో ఈ సినిమాతో రాహుల్, హీరో విజయ్​కు బ్రేక్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల‌తో ఈచిత్రాన్ని మైత్రీ మూవీస్ అత్యంత భారీగా రూపొందించటం విశేషం. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు  జ‌రుగుతున్నాయి.

Vijay devarakonda

రాహుల్‌ ఈ కథను విజయ్‌ కంటే ముందు తమిళ హీరో సూర్యకి వినిపించారు. సూర్య, కార్తీ తండ్రీకొడుకులుగా మల్టీస్టారర్‌ చేయాలనేది ఆయన ఆలోచన. వారికి కూడా ఈ కథ నచ్చింది. కానీ కొన్ని కారణాలవల్ల కథ పట్టాలెక్కలేదు. చివరకు ఆ కథ విజయ్‌ దేవరకొండ కోర్ట్‌లోకి వచ్చి పడింది. విజయ్‌ ఇమేజ్‌కి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు కూడా జరిగాయని సమాచారం. 

ఈ సినిమాలో  ర‌ష్మిక హీరోయిన్ గా న‌టిస్తోంది. విజ‌య్ , ర‌ష్మిక‌ల జోడీకి ఇది హ్యాట్రిక్ సినిమా. ఇది వ‌ర‌కు ‘గీత గోవిందం’తో హిట్టు కొట్టారు. ‘డియ‌ర్ కామ్రెడ్‌’వర్కవుట్ కాలేదు. ర‌ష్మిక‌తో పాటుగా మ‌రో హీరోయిన్ గా కూడా క‌నిపించ‌బోతోంది. ఆమె ఎవ‌ర‌న్న‌ది త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు. విజయ్ ప్ర‌స్తుతం గౌత‌మ్ తిన్న‌నూరితో ఓ సినిమా చేస్తున్నాడు. అది పూర్త‌యిన వెంట‌నే ‘ర‌ణ‌భాలీ’ సెట్స్‌పైకి వెళ్తుంది.
 

click me!