అమ్మాయి మీద ఒట్టేసిన ప్రభాస్‌, రామ్ గోపాల్‌ వర్మ మాస్‌ వార్నింగ్‌!

First Published | Sep 2, 2024, 5:10 PM IST

ప్రభాస్‌ పై రామ్‌ గోపాల్‌ వర్మకి నమ్మకం లేదు. దీంతో ఆయన మీద ఒట్టేశాడు ప్రభాస్. అయిన నమ్మలేదు. అమ్మాయి మీద ఒట్టేశాడు. దీంతో డార్లింగ్‌కి వార్నింగ్‌ ఇచ్చాడు వర్మ. 
 

ప్రభాస్‌, రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌ని చూడటం చాలా అరుదు. రియల్‌గానే కలిసేది చాలా రేర్‌. కానీ సినిమాలో కలిశారు. ప్రభాస్‌, వర్మ కలిసి నటించారు. `కల్కి 2898 ఏడీ`లో ఈ ఇద్దరి మధ్య సీన్లు ఫన్నీగా ఉన్న విషయం తెలిసిందే. మరోటి వదిలింది టీమ్‌. ఇదే ఇప్పుడు వైరల్‌ అవుతుంది. 

ప్రభాస్‌ నటించిన `కల్కి 2898ఏడీ` సినిమా జూన్‌లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీని వైజయంతి మూవీస్‌ పతాకంపై అశ్వినీదత్‌ నిర్మించారు. సుమారు ఐదు వందల కోట్లతో ఈ మూవీని తెరకెక్కించారు. మైథలాజికల్‌ సైన్స్ ఫిక్షన్‌గా దీన్ని తెరకెక్కించడం విశేషం. 
 

మహాభారతంలోని అంశాలను, భవిష్యత్‌కి ముడిపెట్టి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన తీరు అద్భుతం. అందుకే ఈ చిత్రానికి జనం బ్రహ్మరథం పట్టారు. ఘన విజయాన్ని అందించారు. ఈ చిత్రం సుమారు వెయ్యి కోట్ల(గ్రాస్‌) వసూలు చేసిందని ట్రేడ్‌ వర్గాల సమాచారం. అయితే కొన్ని చోట్ల బయ్యర్లు నష్టపోయారనే టాక్‌ కూడా ఉంది. ఓవరాల్‌గా నిర్మాతలు ఫుల్ హ్యాపీ. 

ఇదిలా ఉంటే సినిమా తీసేటప్పుడు చాలా చాలా ఫూటేజ్‌ ఉంటుంది. మూడు గంటల సినిమా కోసం నాలుగైదు గంటల కంటెంట్‌ ని షూట్‌ చేస్తారు. తెలియకుండా అది పెరుగుతూ పోతుంది. ఆ తర్వాత ఎడిటింగ్‌ రూమ్‌లో కూర్చొని కట్‌ చేస్తుంటారు. ఇదే మేకర్స్ కి పెద్ద టాస్క్ లా మారుతుంటుంది. 


ప్రభాస్‌ నటించిన `కల్కి 2898 ఏడీ` సినిమా ఫూటేజ్‌ కూడా చాలానే ఉందట. అయితే మూడు గంటల రిస్టిక్షన్‌లో భాగంగా సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను తొలగించాల్సి వచ్చిందట. అయితే ఆయా సన్నివేశాలను తాజాగా విడుదల చేసింది టీమ్‌. నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ని యూట్యూబ్ ద్వారా రిలీజ్‌ చేసింది.

దాదాపు మూడు నిమిషాల నిడివితో ఈ వీడియో క్లిప్‌ ని విడుదల చేశారు. ఇందులో కాశీలోని పరిస్థితులను అద్ధం పట్టే సీన్లు ఉన్నాయి. ఆడవాళ్లు, పేదలు, ముసలి వాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది, వృద్ధులను ఎలాంటి హింసలకు గురి చేస్తున్నారనేది ఉంది. 
 

దీంతోపాటు దుల్కర్‌ సల్మాన్‌కి సంబంధించిన కొన్ని సీన్లు ఉన్నాయి. పైలట్‌ అయిన దుల్కర్‌ తన వాహనాన్ని ఆన్‌ చేసేందుకు దుల్కర్‌ ఇబ్బంది పడటం ఉంది. మరోవైపు సుమతిగా చేసిన దీపికా పదుకొనె స్నానం చేసే సీన్ ఉంది. మరోవైపు అమితాబ్‌ బచ్చన్‌, చిన్న అమ్మాయి మధ్య కన్వర్జేషన్‌, అమితాబ్ వెలిగించిన దీపాన్ని ఆ పాప ఆర్పేసే ప్రయత్నాన్ని చూపించారు. 

కాంప్లెక్స్ లోని హెడ్‌ మానస్‌ సన్నివేశాలను, అలాగే శంభాలలో మానస్‌ ఆర్మీతో మరియమ్‌ పోరాడే సన్నివేశాలున్నాయి. వీటితోపాటు ప్రభాస్‌(భైరవ), రామ్‌ గోపాల్‌ వర్మ మధ్య సన్నివేశం కూడా ఉంది. ఇదే ఇందులో హైలైట్‌ పాయింట్‌. ఈ సీన్ లో చింటుగా వర్మ కనిపిస్తాడు. ప్రభాస్‌కి గుడ్డు(ఎగ్‌)ని అమ్మడానికి వస్తాడు. ఎక్కువ బంటీ(డబ్బు) ఇచ్చి ఆ గుడ్డుని కొంటాడు ప్రభాస్‌.(సినిమాలో ఉన్న సీన్‌ ఇది) 
 

తాజాగా విడుదల చేసిన సీన్‌లో మాత్రం `ఏ చింటూ కాంప్లెక్స్ లోకి వెళ్లగానే నీ డబ్బులన్నీ నీకు తిరిగిచ్చేస్తా అని నీకు తెలుసు కదా, కావాలంటే నీ మీద ఒట్టు. పోనీ ఆ అమ్మాయి మీద ఒట్టు అంటాడు ప్రభాస్‌. దీనికి వర్మ రియాక్ట్ అవుతూ, అమ్మాయి మీద ఒట్టు వేయకు ఇదే నా ఫస్ట్ అండ్‌ లాస్ట్ వార్నింగ్‌ అంటూ గన్‌ పట్టుకుని మాస్‌ వార్నింగ్‌ ఇచ్చాడు వర్మ. దెబ్బకి ప్రభాస్‌ సారీ చెప్పడం విశేషం. 

లేటెస్ట్ గా విడుదల చేసిన వీడియోలో ఇదే హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతుంది. `కల్కి 2898 ఏడీ` సినిమాలో సుమతిని భైరవ తీసుకెళ్లిపోతాడు. అంతటితో ఆ కథ క్లోజ్‌ అవుతుంది. మరోవైపు సుమతి గర్భం నుంచి తీసిన సీరం చుక్కని ఎక్కించుకుని యాస్కిన్‌(కమల్‌ హాసన్‌) తిరిగి మామూలు మనిషి అవుతాడు. ఆయన సుమతి కోసం బయలుదేరేందుకు రెడీ అవడం, పోరాటాన్ని ప్రకటించడంతో సినిమా ముగిసింది. 
 

రెండో పార్ట్ లో భైరవ, యస్కిన్‌ మధ్య పోరాటం ప్రధానంగా చూపిస్తారని తెలుస్తుంది. మరి ఇది ఎప్పుడు ఉండబోతుందనేది చూడాలి. ప్రభాస్‌ ప్రస్తుతం `ది రాజా సాబ్‌` షూటింగ్‌లో ఉన్నాడు. ఇటీవలే హను రాఘవపూడి సినిమా ఉంది. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా `స్పిరిట్‌` ఉంటుంది. అనంతరం `సలార్‌ 2`, ఆ తర్వాత `కల్కి 2` ఉండబోతుందని తెలుస్తుంది. 
 

Latest Videos

click me!