పవర్ స్టార్ ‘జల్సా 4కే’ సెలబ్రేషన్స్.. థియేటర్లలో ఫ్యాన్స్ సందడి.!

First Published Sep 1, 2022, 2:56 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఫ్యాన్స్ ‘జల్సా’ 4కే వెర్షన్ ను ఈ రోజు గ్రాండ్ గా రీరిలీజ్ చేశారు. దీంతో థియేటర్లలో అభిమానుల రచ్చ మామూలుగా లేదు. 
 

14 ఏండ్ల కింద వచ్చిన ‘జల్సా’ చిత్రం ఈ రోజు థియేటర్లలో 4కే వెర్షన్ లో గ్రాండ్ గా రీరిలీజ్ అయ్యింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో రికార్డు క్రియేట్ చేసింది. పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ ను మెప్పించిన చిత్రమిది. ఎమోషనల్ టచ్ తో పాటు కమర్షియల్ గానూ మంచి మార్క్ క్రియేట్ చేసింది. 
 

రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు (Pawan Kalyan Birthday) సందర్భంగా ‘పవనోత్సవం’ పేరిట ఫ్యాన్స్ సెలబ్రేషన్స్  స్టార్ చేశారు. ఎక్కడా తగ్గకుండా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. 

ఇప్పటికే బ్లాక్ బాస్టర్ హిట్ ఫిల్మ్ ‘తమ్ముడు’ చిత్రాన్ని రీరిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు ఎవర్ గ్రీన్ ఫిల్మ్ ‘జల్సా’ను ప్రపంచ వ్యాప్తంగా రీరిలీజ్ చేశారు. Jalsa 4K వెర్షన్ ను దాదాపు 501 థియేటర్లలో విడుదల చేసి రికార్డు క్రియేట్ చేశారు. అన్నీ హౌజ్ ఫుల్ కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రసాద్ హైమాక్స్ లోనూ చిత్రాన్ని గ్రాండ్ రీరిలజ్ చేశారు. దీంతో పలు మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు అభిమానులతో నిండిపోయాయి. థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు అభిమానులు గ్లాల్లోకి పేపర్లు విసరడం, విజిల్స్, అరుపులతో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. 
 

జల్సా 4కే వెర్షన్ విడుదల సందర్భంగా ముందు రోజునుంచే థియేటర్లను ముస్తాబు చేశారు అభిమానులు. ఆయా  థియేటర్ల వద్ద 150 ఫీట్ పవర్ స్టార్ కటౌట్స్ ను నిలిపి థియేటర్ల వద్ద సందడి నెలకొల్పారు. తమ్ముుడు, జల్సా రీరిలీజ్ లతో, పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ పేరు ట్రెండ్ అవుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ‘జల్సా’ చిత్రంలో పవన్ కళ్యాణ్ - గోవా బ్యూటీ ఇలియానా (Ileana) కలిసి నటించారు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన ఆరు పాటలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ఇప్పటికీ ఎప్పటికీ వినాలనిపించే సంగీతమది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు.
 

click me!