కంగువా
తమిళ సినీ రంగంలో 25 ఏళ్లకు పైగా హీరోగా రాణిస్తున్నాడు సూర్య. నటనలో ఆయన దిగ్గజం అని అభిమానులు భావిస్తారు. గతంలో వరుసగా విజయాలు సాధించిన సూర్యకు 2013 తర్వాత థియేటర్లలో విడుదలైన ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. సూరరై పోట్రు, జై భీమ్ సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలై విజయం సాధించి అభిమానులకు ఊరటనిచ్చాయి.
బాబీ డియోల్, సూర్య
సూరరై పోట్రు చిత్రంలోని నటనకు సూర్య జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ జీఆర్ గోపీనాధ్ జీవితకథ ఆధారంగా సూరరై పోట్రు తెరకెక్కింది. సుధా కొంగర దర్శకత్వం వహించింది.
ఈ నేపథ్యంలో అభిమానులకు ఒక భారీ హిట్ సినిమా ఇవ్వాలని నిర్ణయించుకుని, రెండేళ్లు శ్రమించి కంగువా సినిమా చేశాడు. ఈ సినిమా గత వారం విడుదలై తీవ్ర విమర్శలకు గురైంది. సూర్య కెరీర్‌లోనే అతి పెద్ద పరాజయం కంగువా అని కూడా అంటున్నారు. కంగువా అనంతరం సూర్య 44వ సినిమా నిర్మాణ దశలో ఉంది.
సూర్య కంగువా
సూర్య 44 సినిమాకు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీని తర్వాత సూర్య 45వ సినిమాకు ఆర్.జె.బాలాజీ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఒకటి రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ సినిమా లాగానే సూర్య మరో పాన్ ఇండియా సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారనే వార్త వైరల్ అవుతుంది.
సూర్య తదుపరి సినిమా కర్ణ
సూర్య 46వ చిత్రం పౌరాణిక నేపథ్యంలో రూపొందనున్నట్లు తెలుస్తోంది. సినిమా పేరు కర్ణ. ఈ సినిమాకు రాకేష్ ఓంప్రకాష్ దర్శకత్వం వహించనున్నారట. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ. 600 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాతో సూర్య బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఇది ఆయన తొలి హిందీ సినిమా. కంగువా సినిమా పరాజయం నేపథ్యంలో సూర్య భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం చేయడం రిస్క్ తో కూడుకున్న వ్యవహారం అంటున్నారు పలువురు.