పవన్‌ కళ్యాణ్‌కి దూరంగా మూడో భార్య?.. విడిపోతున్నారా?.. హాట్‌ టాపిక్‌

First Published | Jul 4, 2023, 8:54 PM IST

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే మూడు సార్లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన మూడో భార్య దూరంగా ఉంటోందనే వార్త సంచలనంగా మారింది. సోషల్‌ మీడియాలో ఇది హాట్‌ టాపిక్‌ అవుతుంది.

పవన్‌ కళ్యాణ్‌ పెళ్లిళ్ల మ్యాటర్ రాజకీయంగా ప్రత్యర్థులకు పెద్ద ఆయుధంలా మారింది. పదేపదే ఆ ప్రస్తావన తీసుకొస్తూ ఆయన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటిని లెక్కచేయక, అంతే దీటుగా తనస్టయిల్‌లో వాటికి బదులిస్తూ దూసుకెళ్తున్నారు పవన్‌. కానీ దురదృష్టవశాత్తు ఆయన లైఫ్‌లోనూ అలాంటి సంఘటనలే చోటు చేసుకోవడం విచారకరం. అయితే తాజాగా పవన్‌ కి సంబంధించిన మరో షాకింగ్‌ వార్త నెట్టింట వైరట్‌ అవుతుంది. ఆయన మూడో భార్య కూడా దూరంగా ఉంటుందనే వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. పెద్ద రచ్చ లేపుతుంది. 
 

పవన్‌.. మొదట నందిని వివాహం చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు.  ఆ తర్వాత రేణు దేశాయ్‌ ప్రేమలో పడ్డారు. 2009లో ఆమెని వివాహం చేసుకున్నారు. వీరికి అకీరా నందన్‌, ఆద్యలు జన్మించారు. 2012లో ఈ ఇద్దరు కూడా విడిపోయారు. 2013లో రష్యాకి చెందిన నటి అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు పవన్‌. `తీన్‌మార్‌` సినిమాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వీరికి కుమార్తె, కుమారుడు జన్మించారు. కుమార్తెకి పొలెనా అంజనా పవనోవా, కుమారుడుకి మార్క్ శంకర్‌ పవనోవిచ్‌ అనే పేర్లు పెట్టారు. ఇటు తెలుగు, అటు రష్యా పేర్లు మిక్స్ చేసి కొత్త పేర్లు పెట్టడం విశేషం. 


ఇదిలా ఉంటే దాదాపు పదేళ్లపాటు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అంతా బాగుందనే సమయంలో.. తాజాగా పవన్‌ మూడో భార్య అన్నా లెజినోవా ఆయనకు దూరంగా ఉంటుందనే వార్త ఇప్పుడు షాకిస్తుంది. ఆమె పవన్‌ని వదిలేసి సొంతూరు(రష్యాకి) వెళ్లిపోయిందని సమాచారం. సింగపూర్‌ వెళ్లిపోయిందనేది మరో వార్త. పిల్లలతో పాటు ఆమె వెళ్లిపోయిందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. చాలా రోజులు క్రితమే వెళ్లిపోయిందని, తిరిగి రావడం లేదని పుకారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు ఎక్కువగా రాజకీయాలకే టైమ్‌ ఇస్తున్నారు. మరోవైపు తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నారు. పైగా ఆయన సేవాగుణం ఎక్కువ. దాచుకోకుండా డబ్బు పంచిపెడుతుంటారు. ఇదే ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బు దాచుకోలేని తనం, కుటుంబానికి టైమ్‌ ఇవ్వలేకపోవడం వంటివి ఆయన ఫ్యామిలీ జీవితానికి ప్రతికూలంగా మారుతున్నాయని తెలుస్తుంది. ఏదేమైనా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ గా మారుతుంది. ప్రస్తుతం రాజకీయంగా ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ రూమర్‌ వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టేదిగా మారుతుందని చెప్పొచ్చు. దీన్నే ఆసరాగా తీసుకుని ఏపీలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు విమర్శలు, సెటైర్లు పేలుస్తున్నారు. ఇటీవల ఏపీ సీఎం జగన్‌ కూడా నాలుగు పెళ్లిళ్లు అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరి దీన్ని పవన్‌ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. 

ఇక ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ ఓవైపు జనసేన పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన ఇప్పుడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. అందులో `బ్రో` షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నెల 28న రిలీజ్‌ కాబోతుంది. దీంతోపాటు `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`, `ఓజీ` చిత్రాలు షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. `హరిహర వీరమల్లు` షూటింగ్‌  కాస్త డిలే అవుతుంది. 
 

Latest Videos

click me!