వాళ్లకు మందు పోసి, చికెన్ ముక్కలు అందించే బతుకు నాకొద్దు.. పరుచూరి బ్రదర్స్ పై పోసాని కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 13, 2022, 12:57 PM IST

సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రం ఫిబ్రవరి 18న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

PREV
16
వాళ్లకు మందు పోసి, చికెన్ ముక్కలు అందించే బతుకు నాకొద్దు.. పరుచూరి బ్రదర్స్ పై పోసాని కామెంట్స్

సీనియర్ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన 'సన్నాఫ్ ఇండియా' చిత్రం ఫిబ్రవరి 18న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ కు నటుడు పోసాని కృష్ణమురళి కూడా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో పోసాని ఎప్పటిలాగే తనదైన శైలిలో ప్రసంగించారు. 

26

ఈ సందర్భంగా పోసాని చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ పోసాని కృష్ణమురళి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరుచూరి బ్రదర్స్ దగ్గర పనిచేస్తున్న సమయంలో మోహన్ బాబు గారితో పరిచయం ఏర్పడింది అని అన్నారు. 

 

36

పరుచూరి బ్రదర్స్ నాకు జీవితాన్ని ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఐదేళ్లపాటు పనిచేశా. చాలా నేర్చుకున్నా. కానీ నేను పరుచూరి బ్రదర్స్ లాగా బతకాలని అనుకోవడం లేదు. వాళ్ళు బతకడం తెలియని మనుషులు అని పోసాని అన్నారు.పరుచూరి లాంటి వాళ్ళని ఇండస్ట్రీ ఎక్కడ పెట్టిందో నాకు తెలుసు. పరుచూరి, ఆత్రేయ, వేటూరి లాంటి వాళ్ళని చూసి ఈ బతుకు నాకు వద్దు అని అనుకున్నా. 

46

చనిపోతే కనీసం పది మంది రాని ఇండస్ట్రీ గురించి నాకు తెలుసు. నన్ను ఇండస్ట్రీ బహిష్కరించినా పర్వాలేదు. నేను.. నా కొడుకులు, మనవళ్లు బాగా బతికేంత సంపాదించా. కొందరికి మందు పోసి, చికెన్ ముక్కలు అందించే బతుకు నాకు వద్దు అంటూ పోసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

56

పోసాని వ్యాఖ్యలు గమనిస్తే ఎవరినో ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్స్ లాగా అనిపిస్తాయి. మోహన్ బాబు, చిరంజీవి మధ్య ఇండస్ట్రీలో కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి బహిరంగ రహస్యం. 

66

మోహన్ బాబు సినిమా ఫంక్షన్ లో పోసాని చేసిన ఈ కామెంట్స్ సరికొత్త చర్చకు దారితీశాయి. ఇందులో పోసాని పదేపదే పరుచూరి బ్రదర్స్ పేర్లని ఎత్తడం మరింత హాట్ టాపిక్ గా మారింది. 

click me!

Recommended Stories