టాలీవుడ్ లో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్న నటీనటులు కొందరు ఉన్నారు. అయితే కొన్నిసార్లు ఆలోచించకుండా మాట్లాడితే వివాదాలు తప్పవు. ప్రస్తుతం సీనియర్ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అలాంటి వివాదంలోనే చిక్కుకున్నాడు. పోసానిని ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో పోసాని చేసిన రాజకీయ వ్యాఖ్యల పర్యవసానమే ఈ అరెస్ట్.
26
Posani Krishna Murali
పోసాని తన కెరీర్ బిగినింగ్ లో ఎదుర్కొన్న ఒక కాంట్రవర్సీ గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడాడు. తాను నిజాయతీగా ఒక ప్రేమ జంటకి సాయం చేస్తే అది తనకి బూమరాంగ్ అయింది అని పోసాని వాపోయారు. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. తన కెరీర్ ఆరంభంలో పోసాని.. పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేస్తున్నారు. ఆ టైంలో ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న రవితేజ తమ్ముడు భరత్ రాజ్ తనని ఇరకాటంలో పెట్టాడని పోసాని అన్నారు.
36
అప్పటికి భరత్ తో నాకు పరిచయం లేదు. రవితేజతో ఉంది. పరుచూరి వెంకటేశ్వర రావు గారి అబ్బాయి పరుచూరి రవికి భరత్ తెలుసు. పరుచూరి వాళ్ళు ఇచ్చిన రూమ్ లోనే నేను చెన్నైలో ఉండేవాడిని. అప్పుడు అంతా చెన్నైలో ఉండేవారు. పరుచూరి రవి ఒక రోజు నా దగ్గరకి వచ్చి.. మురళి.. మన రవితేజ తమ్ముడు భరత్ అని ఉన్నాడు. అతడు తన లవర్ తో చెన్నై వచ్చాడు. ఆమె పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కుమార్తె.
46
Ravi Teja brother Bharath
పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడంతో పారిపోయి వచ్చారు. సోమవారం రోజు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతారు. అప్పటి వరకు నీ రూమ్ వాళ్ళకి ఇస్తే బావుంటుంది అని అడిగారు. నాకు భయం వేసింది. రవి వాళ్ళు నిజంగా ప్రేమికులో కాదో నాకు తెలియదు. మీ నాన్న బాబాయ్ కి చెప్పకుండా ఇలా చేయడం తప్పు. నేను ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా. తేడా జరిగితే ఇరుక్కుపోతా అని చెప్పా.
56
Ravi Teja brother Bharath
దీనితో అతడు సరే వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడు.. వాళ్లలో నిజాయతీ కనిపిస్తే రూమ్ ఇవ్వు లేకుంటే వద్దు అని రిక్వస్ట్ చేశాడు. అలాగే మాట్లాడతాను.. కానీ జెన్యూన్ అనిపించకపోతే మాత్రం రూమ్ ఇవ్వను అని చెప్పా. ఒక రెస్టారెంట్ లో వాళ్ళిద్దరినీ కలసి మాట్లాడా. భరత్ వాస్తవానికి రవితేజ కంటే అందంగా ఉంటాడు. అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అతడిని ప్రేమించింది అంటే ఆమాత్రం అందంగా ఉండాలి కదా.
66
Ravi Teja brother Bharath
ఆ అమ్మాయి చాలా పద్దతిగా మాట్లాడింది. భరత్ కూడా చాలా గౌరవంగా మాట్లాడాడు. వాళ్ళు నిజంగానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన జంటలా అనిపించారు. దీనితో నేను వాళ్ళకి 2 రోజులు నా రూమ్ ఇచ్చా అని పోసాని తెలిపారు. నేను వెళ్లి మరొక ఆఫీస్ లో పడుకున్నా. కానీ కొందరు ఈ విషయాన్ని పరుచూరి బ్రదర్స్ ఇంట్లో చెప్పేశారు. జరిగిన విషయం కాకుండా లేనిపోనివి కల్పించి చెప్పేశారు. పోసాని రూమ్ కి మందు, అమ్మాయిలని తెచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాడట అని చెప్పారు. అప్పటి వరకు 4 ఏళ్ల పాటు పరుచూరిబ్రదర్స్ దగ్గర నేను పనిచేశా. ఆ సంఘటనతో నన్ను తిట్టి పంపించేశారు అని పోసాని తెలిపారు. రవితేజ బ్రదర్ భరత్ కొన్నేళ్ల క్రితం కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.