Kannappa Teaser: మంచు విష్ణు 'కన్నప్ప' టీజర్ విడుదలైంది, ఇందులో ప్రభాస్ ఎంట్రీ హైలైట్ అయింది. అయితే, అక్షయ్ కుమార్ శివుడి పాత్రకు ఆశించిన స్పందన రాకపోవడంతో ఆయన అభిమానులు నిరాశ చెందుతున్నారు.
Kannappa Teaser: Why Akshay Kumar fans hurt? in telugu
Kannappa Teaser: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం ‘కన్నప్ప’ (Kannappa).ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఇండస్ట్రీలోని స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది.
గిరిజన తెగలు... ఆ తెగలకు సంబంధించిన నాయకులు... వాళ్ల మధ్య పోరాటం... తిన్నడి పరాక్రమం... పరమశివుడి పట్ల తిన్నడికి గల నిరసన భావం... అంతటి నాస్తికుడు భక్తుడిగా ఎలా మారతాడు అంటూ సాక్షాత్తు పార్వతీదేవి... పరమశివుడి దగ్గర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు.
24
Kannappa Teaser: Why Akshay Kumar fans hurt? in telugu
అయితే టీజర్ మొత్తానికి ప్రభాస్ ఎంట్రీ సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ప్రభాస్ కు పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న క్రేజ్ తో సోషల్ మీడియాలో నార్త్ లో ఆ సీన్ ను తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
టీజర్ లో అక్షయ్ రోల్ కు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా శివుడిగా ఆయన లుక్ పై భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. మెడలో పాము లేకపోవడమేంటని కొందరు నెటిజన్లు క్వశ్చన్ చేస్తున్నారు.
34
Kannappa Teaser: Why Akshay Kumar fans hurt? in telugu
అక్షయ్ కుమార్ ...రెండేళ్ల క్రితం ఓ మై గాడ్ 2 మూవీలో శివుడు పాత్రనే పోషించారు. అప్పుడు దర్శకుడు అమిత్ రాయ్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇప్పుడు మాత్రం కన్నప్పలో శివుని రోల్ ప్రామాణికంగా లేదని అంటున్నారు. టీజర్ రిలీజ్ అయ్యాక ప్రభాస్ రోల్ కు వచ్చిన హైప్.. అక్షయ్ పాత్రకు రాకపోవటం ఆయన ఫ్యాన్స్ ని బాధిస్తోంది.
44
Kannappa Teaser: Why Akshay Kumar fans hurt? in telugu
మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ‘కన్నప్ప’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరిస్తుండగా ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. విష్ణు తనయుడు అవ్రామ్ ఈ చిత్రంతో తెరంగేట్రం చేయనున్నాడు. ప్రభాస్ రుద్ర పాత్రలో, కాజల్ పార్వతీదేవి పాత్రలో కనిపించనున్నారు.
మోహన్‌లాల్ (Mohanlal), శివరాజ్‌కుమార్, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.