తండేల్ OTT విడుదల తేదీ ఖరారు! ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?

Published : Mar 02, 2025, 05:03 PM ISTUpdated : Mar 02, 2025, 05:04 PM IST

Thandel OTT : నాగచైతన్య, సాయిపల్లవిల 'తండేల్' చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో   స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉండనుంది.

PREV
13
తండేల్ OTT విడుదల తేదీ ఖరారు! ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
Thandel OTT release locked Find out the date and platform in telugu


Thandel OTT :  నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి కాంబినేషన్ లో  చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘తండేల్‌’ (Thandel).రీసెంట్ గా  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

అంతేకాదు, వసూళ్ల విషయంలోనూ రికార్డులు సృష్టిస్తోంది. భాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు (గ్రాస్‌) వసూలు (thandel collection worldwide) చేసినట్లు చిత్ర టీమ్  ప్రకటించింది.  అంతేకాదు, నాగచైతన్య  సినీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ ప్రకటన వచ్చింది. 

23
thandel movie ott release date announced netflix Naga Chaitanya


 ఫిబ్రవరి 7న విడుదలైన ఈచిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. మార్చి 7 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇది స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు వినోదాన్ని అందించనుంది. ఈ విషయాన్ని నెట్ ప్లిక్స్ ఓటీటీ సంస్థ ఎక్స్‌ వేదికగా తెలియజేసింది.

33
thandel movie ott release date announced netflix Naga Chaitanya


విడుదలైన రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోయిన  ఈ మూవీ పైరసీ బారిన పడింది. అత్యంత నాణ్యమైన ప్రింట్‌ ఆన్‌లైన్‌ అందుబాటులోకి రావడం, ఆర్టీసీ బస్సులోనూ ప్రదర్శించడంపై చిత్ర బృందం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

పైరసీకి పాల్పడుతున్న వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టేది లేదని నిర్మాతలు బన్నీ వాసు, అల్లు అరవింద్‌ పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని ‘తండేల్‌’ బాక్సాఫీస్‌ వద్ద బలంగా నిలబడింది.

ముఖ్యంగా నాగచైతన్య, సాయిపల్లవిల నటన, చందూ మొండేటి టేకింగ్‌ సినిమాకు బలాన్ని ఇచ్చాయి. దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ మరోస్థాయికి తీసుకెళ్లింది. యువత సినిమాను థియేటర్‌లో చూసేందుకు ఆసక్తిక కనబరచడం కూడా కలిసొచ్చింది.

Read more Photos on
click me!

Recommended Stories