టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు రఘురామ్ కన్నుమూశారు. `వరం` చిత్రంతో పాపులర్ అయిన బండి రఘురామ్ మంగళవారం సాయంత్రం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సాయంత్రం వాకింగ్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చిందని, దీంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రఘురామ్ దర్శకుడు మాత్రమే కాదు, రైటర్, జర్నలిస్ట్ కూడా. ఆయన ఈటీవీ, వీ6, ఇండియన్ ఎక్స్ ప్రెస్ వంటి మీడియా సంస్థల్లో స్పెషల్ కరస్పాండెంట్‌గా వర్క్ చేశారు.
బండి రఘు రామ్ హైలీ ఎడ్యూకేటెడ్. ఆయన జర్నలిజంలో ఎంఫిల్ చేశారు. అలాగే ఇంగ్లీష్ లిటరేచర్‌లో పీహెచ్ డీ పూర్తి చేశారు. లిబ్యాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫేసర్‌గా పనిచేశారు. సినిమాలపై ఆసక్తితో అవన్నీ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చారు. ప్రారంభంలో ప్రముఖ దర్శకుడు సానాయాదిరెడ్డి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో డైరెక్టర్‌గా వర్క్ చేశారు. ఆయన రూపొందించిన అన్ని సినిమాలకు రఘురామ్ పనిచేశారు. దర్శకత్వంలో మంచి అనుభవాన్ని పొందారు.