Toxic Movie: 'టాక్సిక్' మళ్ళీ వాయిదా, కారణం ఇదే.. మరోసారి సస్పెన్స్ లో పెట్టిన యశ్‌

Published : Apr 29, 2026, 11:56 AM IST

Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న 'ది టాక్సిక్' సినిమా రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడింది. ముందుగా జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు మళ్ళీ పోస్ట్‌పోన్ చేశారు. కొత్త తేదీని చిత్ర బృందం ఇంకా ప్రకటించలేదు.

PREV
14
టాక్సిక్‌ కోసం ఆడియెన్స్ ఈగర్‌గా వెయిటింగ్‌

`కేజీఎఫ్‌ 2` తర్వాత యశ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం `టాక్సిక్‌`. ఇందులో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌ వంటి వారు హీరోయిన్లుగా నటిస్తున్నారు. గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహించారు. ఈ మూవీ కోసం ఇండియన్‌ ఆడియెన్స్ ఈగర్‌ గా వెయిట్‌ చేస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం సినిమాని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. 

24
టాక్సిక్‌ మళ్లీ వాయిదా

ఇండియా వైడ్‌గా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యశ్ 'ది టాక్సిక్' సినిమా విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా మార్చి 19నే రిలీజ్ కావాల్సి ఉంది. మధ్యప్రాచ్యం(సౌత్‌ వెస్ట్)లో యుద్ధం కారణంగా, మార్చి 19 నుంచి జూన్ 4కు సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు మళ్ళీ వాయిదా పడినట్లు యశ్ స్వయంగా తెలిపారు. అయితే కొత్త తేదీని మాత్రం ప్రకటించలేదు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు ఇంకా సెట్‌ కాకపోవడంతో వాయిదా వేసినట్టు తెలిపారు. ఇది భారీ స్థాయిలో రీచ్‌ఉన్న మూవీ అని, సరైన సమయంలో వస్తే బాగుంటుందని, ఔట్‌ పుట్‌ విషయంలో రాజీపడేది లేదని, లేట్‌ అయినా అందరిని ఆకట్టుకునే కంటెంట్‌తో వస్తామని తెలిపారు యశ్‌. అంతర్జాతీయంగా విడుదల తేదీ విషయంలో చోటు చేసుకున్న సమస్య కారణంగా సినిమాని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. 

34
నిరాశలో ఆడియెన్స్

టీజర్, ట్రైలర్, ఆర్టిస్టుల లుక్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. వాయిదా వార్త తెలియగానే అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  మరికొందరు మాత్రం, ఎంతకాలమైనా ఎదురుచూస్తామని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వరుస వాయిదా సినిమాపై మార్కెట్‌లో ఉన్న బజ్‌ ని తగ్గిస్తుందని చెప్పొచ్చు. అది  ఓపెనింగ్స్ పై గట్టి ప్రభావం చూపుతుంది.

44
దర్శకురాలిపై యశ్‌ ప్రశంసలు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, 'టాక్సిక్' డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్‌పై యశ్ ప్రశంసలు కురిపించారు. ఒక మహిళా దర్శకురాలు గ్యాంగ్‌స్టర్ కథను, అందులోని బోల్డ్ సన్నివేశాలను చూపించే విధానం తనను ఆశ్చర్యపరిచిందని మెచ్చుకున్నారు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories