బొద్దుగా మారి కుందనపు బొమ్మలా పూర్ణ.. హోమ్లీ లుక్‌లో కట్టిపడేస్తున్న హాట్‌ హీరోయిన్‌.. చూపులతోనే హంటింగ్‌

Published : Jan 13, 2023, 03:28 PM IST

హాట్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేసే పూర్ణ.. పెళ్లి తర్వాత మరింత బొద్దుగా మారిపోతుంది. ప్రెగ్నెంట్‌ కావడంతో ఆమె బరువెక్కింది. లేటెస్ట్ గా కుందనపు బొమ్మలా కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమె పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.   

PREV
17
బొద్దుగా మారి కుందనపు బొమ్మలా పూర్ణ.. హోమ్లీ లుక్‌లో కట్టిపడేస్తున్న హాట్‌ హీరోయిన్‌.. చూపులతోనే హంటింగ్‌

హీరోయిన్‌ పూర్ణ(Poorna) ఇటీవల తన ప్రెగ్నెంట్‌ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె బరువెక్కుతుంది. తాజాగా ఆమె మరింత బొద్దుగా, అందంగా కనిపిస్తుంది. లేటెస్ట్ లుక్‌ని పంచుకుంది పూర్ణ. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్‌ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఆమె ఇలాంటి అందమైన ఫోటోలను పంచుకోవడం ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 
 

27

బొద్దుగా మారడంతోపాటు హోమ్లీ బ్యూటీగా కట్టిపడేస్తుంది పూర్ణ(Purna). ఓ మీడియా ఈవెంట్‌లో పూర్ణ గెస్ట్ గా పాల్గొని సందడి చేసింది. ఉమెన్‌ ఎంపావర్‌మెంట్ కి సంబంధించిన ఆమె అతిథిగా అటెండ్ కావడం విశేషం. అరేబియా వాయిస్‌ అనే మీడియా సంస్థ నిర్వహించిన ఈవెంట్‌లో తన గళాన్ని వినిపించింది పూర్ణ. 
 

37

గతేడాది దుబాయ్‌ బేస్డ్ కేరళాకి చెందిన షానిద్‌ అసిఫ్‌ అలీని పెళ్లి చేసుకుంది పూర్ణ. సీక్రెట్‌గా వీరి వివాహం జరిగింది. మ్యారేజ్‌ అయిన రెండు నెలలకు ఆ విషయాన్ని వెల్లడించింది. ఆ తర్వాత నెమ్మదిగా తన మ్యారేజ్‌ పిక్స్ ని షేర్‌ చేసి షాక్‌తో కూడిన సర్‌ప్రైజిలు ఇచ్చింది. 
 

47

మరోవైపు `ఢీ` డాన్సు షోకి జడ్జ్ గా కంటిన్యూ అవుతూ వచ్చింది. గత సీజన్‌ ఢీ షో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. మరోవైపు ఇటీవల ఆమె తన ప్రెగ్నెన్సీని ప్రకటించింది. దీంతో బయట షోలు మానేసి పూర్తిగా తన వ్యాపారాలు చూసుకుంటుంది. 

57

తన భర్త వ్యాపారాలను మెయింటనెన్స్ చేస్తుంది. పూర్ణ హీరోయిన్‌ కావడంతో ఆయా వ్యాపారాలు ప్రమోషన్‌ పరంగానూ పూర్ణ కీలకంగా వ్యవహరిస్తున్నారు. షానిద్‌ జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీకి ఫౌండర్‌ సీఈవో. ప్రధానంగా ఇది గోల్డెన్‌ వీసాలను అందిస్తుంటుంది. నటిగా పూర్ణ ఇప్పుడు రిలాక్స్ అవుతుంది. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉంది. తన మొదటి బిడ్డని ఈ ప్రపంచంలోకి ఆహ్వానించేందుకు ఉవ్విళ్లూరుతుంది. అమ్మ హోదా పొందేందుకు ఆరటపడుస్తుంది. ఆ మాతృత్వపు క్షణాలను అనుభవిస్తుంది. 
 

67

తెలుగులో నటిగా తనకంటూ ఓ సెపరేట్‌ ఇమేజ్‌ని క్రియేట్‌ చేసుకుంది పూర్ణ. ఆమె బోల్డ్ పాత్రలకు, బలమైన పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. బలమైనది, ప్లస్‌ బోల్డ్ గా ఉండే పాత్రలు ఆమెకి వరిస్తున్నాయి. అటు గ్లామరస్‌గా కనిపిస్తూనే, మరోవైపు నటన పరంగానూరక్తి కట్టిస్తుంటుంది పూర్ణ. 
 

77

మంచి నటి అయినప్పటికీ ఆమెకి రావాల్సిన బ్రేక్‌ రాలేదనే చెప్పాలి. దీంతో ఆమెకి కెరీర్‌ స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది. పెద్ద అవకాశాలు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఇటీవల `అఖండ`లో కీలక పాత్రలోమెప్పించింది. దీంతో ఆమెకి అవకాశాలు పెరుగుతున్నాయని, పెద్ద ఆఫర్లు వస్తాయని భావించారు. అంతలోనే మ్యారేజ్‌ చేసుకుని షాకిచ్చింది. అయితే మ్యారేజ్‌ అయినా నటిగా తాను కొనసాగుతానని ఆమె చెప్పిన విషయం తెలిసిందే. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories