కుంభమేళాలో పవిత్ర స్నానం: నా పాపాలన్నీ కొట్టుకుపోయాయంటున్న హీరోయిన్!

Published : Jan 31, 2025, 01:29 PM IST

  ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించటంతో  తన పాపాలన్నీ కొట్టుకుపోయాయని, జీవితాన్ని దగ్గరగా చూసినట్లు పూనమ్ పాండే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PREV
13
కుంభమేళాలో పవిత్ర స్నానం: నా పాపాలన్నీ కొట్టుకుపోయాయంటున్న హీరోయిన్!
Poonam Pandey, Maha Kumbh 2025, పూనమ్ పాండే, మహా కుంభమేళా


యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జరుగుతున్న‌ మహా కుంభమేళాలో త్రివేణి సంగమంలో దేశం నలుమూలల నుంచే కాక ప్రపంచం లో చాలా దేశాల నుంచి జనం వచ్చి ప‌విత్ర‌ స్నానం ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక్కడ స్నానం  ఆచ‌రించ‌డం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయనేది భ‌క్తుల న‌మ్మ‌కం.

అందుకే సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ పుణ్యస్నానాన్ని వెళ్తున్నారు. ఈ క్రమంలో  బీజేపీ ఎంపీ, నటి హేమమాలిని, దర్శకుడు కబీర్ ఖాన్, హాస్యనటుడు సునీల్ గ్రోవర్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, మరాఠీ దర్శకుడు ప్రవీణ్ తర్దే వంటి ప్రముఖులు ప్రయాగ్‌రాజ్‌లో పవిత్ర స్నానం చేశారు.  తాజాగా   బాలీవుడ్‌ వివాదాస్పద నటి పూనమ్ పాండే కూడా ఈ జాబితాలో చేరారు. 

23
Poonam pandey


 ఎప్పుడూ బోల్డ్ ఫొటోస్, కామెంట్ల‌తో వార్తల్లో ఉండే పూనమ్ తాజాగా ప్రయాగ్‌రాజ్‌కి వెళ్ళి స్నానం చేసారు.  ఆ మేరకు ఫొటోలు, వీడియోలను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో త్రివేణి సంగమం‌లో పవిత్ర స్నానం ఆచరిస్తున్న ఫొటోల‌ను పంచుకున్నారు. ఈ ఫొటో క్యాప్షన్ గా ‘నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి’ అని రాశారు. పూనమ్ పాండే షేర్ చేసిన ఈ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

33


పూనం ఆ పోస్ట్ లో "నా పాపాలన్నీ కొట్టుకుపోయాయి. జీవితాన్ని చాలా ద‌గ్గ‌ర‌గా చూశా. ఇక్క‌డ 70ఏళ్ల వృద్ధుడు చెప్పులేకుండా గంట‌ల త‌ర‌బ‌డి న‌డుస్తాడు. ఇక్క‌డ విశ్వాసానికి హ‌ద్దులు లేవు. కుంభ‌మేళాలో త‌మ ప్రాణాలు కోల్పోయిన వారికి మోక్షం దొరుకుతుంద‌ని ఆశిస్తున్నా. ఇక్క‌డి భ‌క్తి న‌న్ను మూగ‌బోయేలా చేసింది" అని పూన‌మ్ పాండే త‌న్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇప్పుడు ఆమె పోస్టు  సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
 

click me!

Recommended Stories