అట్టర్ ఫ్లాప్ సినిమాలు నాగ చైతన్యకి ఎందుకూ ఉపయోగపడలేదు.. కనీసం ఇలా అయినా..

Published : Jan 31, 2025, 01:23 PM IST

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కింది.

PREV
14
అట్టర్ ఫ్లాప్ సినిమాలు నాగ చైతన్యకి ఎందుకూ ఉపయోగపడలేదు.. కనీసం ఇలా అయినా..

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 7న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కింది. దీనితో అల్లు అరవింద్ ఒక రేంజ్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

24

హైదరాబాద్, చెన్నై, ముంబయి లాంటి నగరాల్లో తండేల్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. శుక్రవారం రోజు ముంబైలో ఈవెంట్ జరగనుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర విషయం గమనించాలి. ఈ ఈవెంట్ కి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నారు. 2022లో అమీర్ ఖాన్, నాగ చైతన్య కలసి లాల్ సింగ్ చద్దా అనే చిత్రంలో నటించారు. 

34

ఈ చిత్రం అమీర్ ఖాన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. పేరుకే పాన్ ఇండియా చిత్రం కానీ నాగ చైతన్యకి ఈ చిత్రం ఏ విధంగానూ ఉపయోగపడలేదు. మరోవైపు నాగ చైతన్య చివరగా కస్టడీ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కింది. ఆ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. 

44

చెన్నైలో జరిగిన తండేల్ ఈవెంట్ కి వెంకట్ ప్రభు కూడా అతిథిగా హాజరయ్యారు. తన ఫ్లాప్ చిత్రాలకు కారణమైన వారు ఈ విధంగా చైతూకి ఇప్పుడు ఉపయోగపడుతున్నారు. తండేల్ చిత్రం అత్యంత భారీ స్థాయిలో 85 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కింది. నాగ చైతన్యకి తండేల్ మూవీ చాలా ప్రతిష్టాత్మకం. సెన్సార్ నుంచి ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ వస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories