మోడలింగ్ నుంచి నటిగా మారిన హాట్ బ్యూటీ పూనమ్ పాండే త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. చాలా కాలంగా డేటింగ్ చేస్తున్న సామ్ బాంబేను వివాహం చేసుకోబోతోంది ఈ బ్యూటీ. తాజాగా వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల సామ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తమ పూనమ్‌తో కలిసి ఎంగేజ్‌మెంట్ రింగ్స్ చూపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ఆ ఫోటోలతో `చివరకు మేం ఈ పని చేశాం` అంటూ కామెంట్ చేశాడు.
undefined
అయితే సామ్ పోస్ట్‌పై స్పందించిన పూనమ్.. `బెస్ట్ ఫీలింగ్` అంటూ కామెంట్ చేసింది. సామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్ద నిర్ణయానికి పెద్ద శుభాకాంక్షలు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.
undefined
పూనమ్ ఎదో ఒక వివాదంతో తరుచూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లిన సందర్భంగా పూనమ్, సామ్‌ల మీద కేసు నమోదైంది. అయితే ఈ వార్తలను ఖండించిన పూనమ్, తాను ఇంట్లోనే సినిమాలు చూస్తున్నానని తెలిపింది.
undefined
2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే గ్రౌండ్‌లో నగ్నంగా పరిగెత్తుతా అంటూ ప్రకటించిన ఒక్కసారిగా ఫేమస్‌అయ్యింది ఈ బ్యూటీ. ఆ తరువాత 2013లో నషా సినిమాతో బాలీవుడ్ వెండితెర మీద అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ భామ తన సొంత యాప్‌లో హాట్ హాట్‌లను రిలీజ్ చేస్తోంది, అభిమానులను అలరిస్తోంది. అదే సమయంలో బాగానే సంపాదిస్తోంది.
undefined