ఇండియాలోనే బిగ్గెస్ట్‌ ట్రెండ్.. పవన్‌ను దాటేసిన మహేష్

First Published | Jul 27, 2020, 9:48 AM IST

కరోనా అన్ని రంగాల్లో సమూల మార్పులకు కారణమవుతోంది. ముఖ్యంగా వినోద పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ పరిస్థితుల్లో అభిమానల వేడుకలకు కూడా బ్రేకులు పడ్డాయి. తమ అభిమాన హీరోల పుట్టిన రోజు వేడుకలను ఘనం చేసే పరిస్థితి లేకపోవటంతో అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ట్రెండ్స్‌లోనూ సరికొత్త రికార్డ్‌లు నమోదవుతున్నాయి.

గతంలో హీరో రికార్డ్ అంటూ వంద రోజుల సెంటర్లు, 150 రోజుల సెంటర్లు అని చూసే వారు. తరువాత పరిస్థితి మరి రికార్డ్‌ విషయంలో వసూళ్లు లెక్కలు తెర మీదకు వచ్చాయి. డే వన్‌ కలెక్షన్లు, ఓవరాల్‌ రికార్డ్‌లు మొదలయ్యాయి. తాజాగా మరో కొత్త ట్రెండ్ మొదలైంది. ఆన్ లైన్‌లో హ్యాష్ ట్యాగ్‌ ల ట్రెండ్ ఇప్పుడు సరికొత్త రికార్డ్‌లు సృష్టిస్తోంది.
ఎన్టీఆర్‌ బర్త్ డే సందర్భంగా అభిమానులు ఈ హ్యాష్ ట్రెండ్‌ రికార్డ్‌కు తెర తీశారు. మేలో ఎన్టీఆర్ బర్త్‌ డే సందర్భంగా సోషల్‌ మీడియాను మోత మోగించిన జూనియర్‌ ఫ్యాన్స్‌ 2 కోట్ల 15 లక్షల ట్వీట్లతో రికార్డ్‌ ల వేట మొదలు పెట్టారు.

ఇటీవల పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు #AdvanceHBDPawanKalyan హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో రచ్చ చేశారు. పుట్టిన రోజుకు 50 రోజుల ముందే మొదలైన ఈ హడావిడితో 27 మిలియన్లకు పైగా ట్వీట్లు చేశారు అభిమానులు. దీంతో అప్పటికి ఇదే హయ్యస్ట్ రికార్డ్‌.
తాజాగా గత రికార్డ్‌లను చెరిపేస్తూ మహేష్ అభిమానులు సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. ఏకంగా 3 కోట్లకు పైగా ట్వీట్లతో మహేష్ మానియా ఏ రేంజ్‌లో ఉందో చూపించారు. ఆగస్టు 9 మహేష్ పుట్టిన రోజు సందర్భంగా కామన్‌ డీపీని లాంచ్‌ చేశారు. ఈ నేపథ్యంలో #MaheshBabuBdayCDP అనే హ్యాష్ ట్యాగ్‌పై 24 గంటల్లోనూ 3 కోట్ల 10 లక్షలకు పైగా ట్వీట్లు వచ్చాయి.
సరికొత్త రికార్డ్‌తో మహేష్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ ఏడాది మొదట్లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మహేష్ బాబు, తరువాత గీత గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమాను ఎనౌన్స్‌ చేశాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Latest Videos

click me!