పూనమ్ పాండే ఎందుకు మరణించింది.. ఆ క్యాన్సర్ ఎందుకు సోకుతుంది.. షాకింగ్ ఫ్యాక్ట్స్

First Published Feb 2, 2024, 1:16 PM IST

పూనమ్ పాండే గురించి పరిచయం అక్కర్లేదు. అనేక వివాదాలతో పాపులర్ అయిన పూనమ్ పాండే మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా మారింది. అయితే పూనమ్ పాండే ఎవ్వరూ ఊహించని విధంగా నేడు కన్ను మూశారు.

పూనమ్ పాండే గురించి పరిచయం అక్కర్లేదు. అనేక వివాదాలతో పాపులర్ అయిన పూనమ్ పాండే మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత నటిగా మారింది. అయితే పూనమ్ పాండే ఎవ్వరూ ఊహించని విధంగా నేడు కన్ను మూశారు. ఈ చేదు వార్తని ఆమె టీం మీడియాకి తెలియజేశారు. హుషారుగా ఉండే పూనమ్ పాండే కేవలం 32 ఏళ్ల పిన్న వయసులో మరణించడంతో ఎవ్వరూ జీర్ణించుకోలేకున్నారు. 

Image: Poonam PandeyInstagram

నటిగా అనేక చిత్రాల్లో నటించిన పూనమ్ ఆ తర్వాత బోల్డ్ గా మారి అశ్లీల చిత్రాల్లో సైతం నటించింది. సొంతంగా యాప్ ప్రారంభించి అందులో అశ్లీల చిత్రాలు చేసింది. 2011లో టీంఇండియా వరల్డ్ కప్ వెలిస్తే నగ్నంగా వారి ముందు డ్యాన్స్ చేస్తానని స్టేట్మెంట్ ఇచ్చి దేశం మొత్తం పాపులర్ అయింది. ఇలాంటి వివాదాలు పూనమ్ కెరీర్ లో ఎన్నో ఉన్నాయి. 

Latest Videos


అయితే పూనమ్ పాండే అకాల మరణాన్ని మాత్రం ఎవరూ జీర్ణించుకోలేకున్నారు. దీనితో ఆమె మృతికి సెలెబ్రిటీలు, అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. పూనమ్ పాండే సెర్వికల్ క్యాన్సర్ తో మరణించినట్లు ఆమె టీం ప్రకటించింది. దీనితో అసలు సెర్వికల్ క్యాన్సర్ అంటే ఏంటి ? పూనమ్ ఎందుకు మరణించారు.. అది అంత ప్రమాదకరమా అని అభిమానులు శోధిస్తున్నారు. 

సెర్వికల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆడవారిలో వచ్చే ఈ క్యాన్సర్ ప్రమాదకరమైనదిగా వైద్యనిపుణులు, డాక్టర్లు చెబుతున్నారు. 30 నుంచి 45 ఏళ్ల వయసుగలవారికి ప్రధానంగా ఈ క్యాన్సర్ సోకుతుంది. ఈ క్యాన్సర్ సోకడానికి డాక్టర్లు ప్రధానముగా చెబుతున్న కారణం సెక్సువల్ ఇన్ఫెక్షన్స్. 

Poonam Pandey

సెక్సువల్ యాక్టివిటీ ద్వారానే ఈ క్యాన్సర్ సోకుతుంది. ఈ క్యాన్సర్ కి కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్ సెక్సువల్ గా ట్రాన్స్మిట్ అవుతుందట. మల్టిపుల్ సెక్సువల్ పార్ట్నర్స్ ని కలిగి ఉండడం.. తక్కువ ఏజ్ నుంచే సెక్సువల్ యాక్టివిటీ ఉండడం ఈ క్యాన్సర్ కి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. 

పార్ట్నర్ కి ఇన్ఫెక్షన్స్ ఉంటే ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని అంటున్నారు. మల్టిపుల్ ప్రెగ్నన్సీ కూడా దీనికి కారణం అని అంటున్నారు. ఇమ్మ్యూనిటీ తక్కువ ఉన్నవారికి కూడా ఈ క్యాన్సర్ రిస్క్ ఉంటుందట. 

అయితే ఈ క్యాన్సర్ ని పూనమ్ పాండే ప్రారంభ దశలో గుర్తించి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు. ఎప్పుడూ బోల్డ్ గా ఉండే పూనమ్ పాండే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ తన ప్రాణాల మీదికి వచ్చిన ఈ సమస్యని ఎదుర్కొనలేకపోయింది. 

click me!