ఇక రన్బీర్.. బెస్ట్ యాక్టర్ గా గతంలోనూ పలు అవార్డ్స్ ను అందుకున్నారు. ‘సావరియా’తో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా, ‘వేకప్ సిద్, రాకెట్ సింగ్ కు క్రిటిక్స్ నుంచి బెస్ట్ యాక్టర్ గా, అలాగే రాక్ స్టార్, బర్ఫీ, సంజుతో... ఇప్పుడు ‘యానిమల్’తో ఉత్తమ నటుడిగా అవార్డును పొందారు. ఇక ‘యానిమల్’ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేశారు. రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి హీరోయిన్లుగా నటించారు.