పూనమ్ కౌర్ చాలా ఏళ్ళ క్రితమే తనకు ఎలాంటి భర్త కావాలో తెలిపింది. టాలీవుడ్ అగ్ర హీరోపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా ఆమె అనేక వివాదాల్లో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
పూనమ్ కౌర్ పేరు ప్రస్తావనకు రాగానే అనేక వివాదాలు గుర్తుకు వస్తాయి. సినీ రాజకీయ పరమైన వివాదాల్లో అనేకసార్లు పూనమ్ కౌర్ వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఆమె పరోక్షంగా చేసే పోస్ట్ ల గురించి కూడా తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. మొన్నటి వరకు పూనమ్ కౌర్ ఓ దర్శకుడిని.. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన వ్యక్తిని టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేసింది. అసలు ఆ హీరోని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పూనమ్ బయట పెట్టింది.
25
వాళ్ళ బెదిరించడం వల్లే ఆ హీరోకి వ్యతిరేకంగా..
కాకపోతే పోసాని పేరు తప్ప ఇంకెవరి పేర్లని ఆమె నేరుగా ప్రస్తావించలేదు. కడప నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు బెదిరించడం వల్లే తాను ఆ హీరోని టార్గెట్ చేసినట్లు పూనమ్ తెలిపింది. ఆ హీరోకి వ్యతిరేకంగా మాట్లాడడం కోసం వాళ్ళు తనకి డబ్బు, పదవి ఆశ చూపారని.. తాను అంగీకరించకపోవడంతో తన అశ్లీల వీడియోలు రిలీజ్ చేస్తామని బెదిరించినట్లు పూనమ్ పేర్కొంది. ఈ తతంగం మొత్తం పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా జరిగింది అని అభిమానులు భావిస్తున్నారు.
35
పోసాని ప్రెస్ మీట్ తో జీవితం నాశనం
మరోవైపు పోసాని కృష్ణ మురళి పెట్టిన ప్రెస్ మీట్ తో తన పెళ్లి కూడా ఆగిపోయింది అని, జీవితం నాశనం అయింది అని పూనమ్ కౌర్ పేర్కొంది. ఆ దెబ్బతో ఇప్పటికీ తాను పెళ్లి కాకుండా ఉండిపోయానని పూనమ్ తెలిపింది. అయితే చాలా ఏళ్ళ క్రితమే పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
పవన్ కళ్యాణ్ గారు నిజాయతీగా ఉంటారు. స్ట్రైట్ ఫార్వార్డ్ గా మాట్లాడతారు. ఆయనలో అది నాకు నచ్చుతుంది. ఎవరైనా ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు అని అడిగితే.. నేను పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని చేసుకుంటాను అని చెబుతా అంటూ పూనమ్ కౌర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు.. ఆయన ఒక్కరే.. ఒక్కటే పీస్ అని పూనమ్ తెలిపింది.
55
పూనమ్ కౌర్ వయసు
మొత్తంగా మరోసారి పూనమ్ కౌర్ తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. పూనమ్ కౌర్ తెలుగులో పలు చిత్రాల్లో నటించారు కానీ స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయారు. ప్రస్తుతం పూనమ్ కౌర్ వయసు 39 ఏళ్ళు.