రాజకీయాలకు నన్ను పావుగా వాడుకుంటున్నారు, గత ఎన్నికల్లో కూడా ఇలాగే.. పూనమ్ కౌర్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి

Sreeharsha Gopagani | Published : Sep 25, 2023 12:53 PM
Google News Follow Us

సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.

16
రాజకీయాలకు నన్ను పావుగా వాడుకుంటున్నారు, గత ఎన్నికల్లో కూడా ఇలాగే.. పూనమ్ కౌర్ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి

సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తోంది పూనమ్ కౌర్. పూనమ్ కౌర్ ఎలాంటి విషయం గురించి అయినా తన అభిప్రాయాలు చెబుతుంది.. కానీ పరోక్షంగా మాత్రమే. అప్పట్లో పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ఇన్ డైరెక్ట్ గా చేసిన ట్వీట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. 

 

26

అయితే పూనమ్ కౌర్ ప్రస్తుతం సామజిక కార్యకర్తగా మారింది. చేనేత కార్మికుల కోసం పూనమ్ కౌర్ దేశ వ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. ప్రముఖు రాజకీయ నాయకులతో భేటీ అవుతోంది. అయితే పూనమ్ కౌర్ పేరుచెప్పగానే పవన్ కళ్యాణ్ కేంద్రంగా తలెత్తిన వివాదాలు, రూమర్స్ గుర్తుకు వస్తాయి. కానీ ఈ విషయంలో మాత్రం పూనమ్ కౌర్ నోరు మెదపడం లేదు. అసలు వాస్తవం ఏంటో చెప్పడం లేదు. 

36

కానీ పవన్ కళ్యాణ్ గురించి మాత్రం పరోక్షంగా పలుమార్లు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పూనమ్ కౌర్ కేంద్రంగా ఎలాంటి వివాదం జరిగిందో తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని తప్పు బట్టేలా పలు రూమర్స్ తెరపైకి తీసుకు వచ్చారు. అందులో వాస్తవం ఉందో లేదో పూనమ్ చెప్పలేదు. అయితే తాజాగా పూనమ్ కౌర్ పేరుపై పత్రికా ప్రకటన విడుదలయింది. 

Related Articles

46

ఈ ప్రకటనలో ఆమె చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి. ' ఇప్పటి వరకు నేను ఏ రాజకీయ పార్టీ కండువా కప్పుకోలేదు. ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు. కానీ కొందరు రాజకీయ నాయకులు వారి స్వప్రయోజనాల కోసం నన్ను ఒక పావుగా  వాడుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇలాగే వికృత చేష్టలు చేశారు. తద్వారా పైశాచిక ఆనందం పొందారు. ఒక మహిళపై ఇలాంటి కుట్రలు తగవు. సానుభూతి పేరుతో నాకు నా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నారు. నేను సిక్కు బిడ్డను. 

56

పోరాటాలు చేయడం తెలుసు. దయచేసి మీ రాజకీయాల్లోకి నన్ను లాగొద్దు ప్రస్తుతం నేను చేనేత కార్మికుల కోసం శ్రమిస్తున్నాను. 100కి పైగా పార్లమెంట్ సభ్యులని కలిశాను. మహిళల హక్కుల కోసం కూడా పోరాడతాను. నా వైపు నుంచి ఏదైనా తెలియజేయాల్సింది ఉంటే నేనే చెబుతాను అంటూ పూనమ్ కౌర్ పేరుపై పత్రిక ప్రకటన విడుదలైంది. 

66

గత సార్వత్రిక ఎన్నికల్లో పూనమ్ కౌర్ ని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేందుకు ఒక పావుగా వాడుకున్నారు అనే రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం జరుగుతోందా ? అందుకే పూనమ్ కౌర్ స్పందించిందా అంటూ నెటిజన్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. 

Read more Photos on
Recommended Photos