సాంప్రదాయ దుస్తుల్లో యువరాణిలా మెరిసిన ఫరియా అబ్దుల్లా... బోల్డ్ బ్యూటీ మరో యాంగిల్!

Published : Sep 25, 2023, 10:58 AM ISTUpdated : Sep 25, 2023, 11:03 AM IST

ఓ ప్రమోషనల్ షూట్లో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేసింది. ఫరియాలోని సరికొత్త కోణం ఆకట్టుకుంటుంది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.   

PREV
16
సాంప్రదాయ దుస్తుల్లో యువరాణిలా మెరిసిన ఫరియా అబ్దుల్లా... బోల్డ్ బ్యూటీ మరో యాంగిల్!
Faria Abdullah

ఫరియా ప్రొఫెషనల్ డాన్సర్. మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. బ్రేక్ మాత్రం రావడం లేదు. కనీసం టైర్ టూ హీరోలు కూడా తమ చిత్రాల్లో తీసుకోవడం లేదు. ఫరియా హైదరాబాద్ కి చెందిన అమ్మాయి కావడం మరో విశేషం. ఆమె కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. 
 

26
Faria Abdullah

ఫరియాకు దర్శకుడు అనుదీప్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు చేయగా ఫరియా హీరోయిన్ రోల్ చేశారు.

 

36
Faria Abdullah

జాతిరత్నాలు భారీ విజయం సాధించింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ కాసులు కురిపించింది. చిట్టి పాత్రలో ఫరియా ఒదిగిపోయి నటించింది. ఇన్నోసెంట్ లాయర్ గా, లవర్ గా నవ్వులు పూయించింది. జాతిరత్నాలు ఫరియాను ఓవర్ నైట్ స్టార్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఆ మూవీ విజయం సాధించిన స్థాయిలో ఆఫర్స్ అయితే రావడం లేదు. 

46
Faria Abdullah


మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు.  హీరో పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి పాత్రలో తళుక్కున మెరిశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు. 
 

56
Faria Abdullah

ఫరియా హీరోయిన్ గా రావణాసుర చిత్రంలో నటించారు. రవితేజ హీరోగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ నిరాశపరిచింది. ఈ మూవీపై ఫరియా చాలా ఆశలే పెట్టుకున్నారు. 

 

66
Faria Abdullah

కెరీర్ సంగతి ఎలా ఉన్నా...  సోషల్ మీడియా వేదికగా తన పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఫరియా డాన్స్ వీడియోలకు భలే డిమాండ్ ఉంది. అలాగే బోల్డ్ ఫోటో షూట్స్ కి వెనుకాడటం లేదు. 

click me!

Recommended Stories