Poonam On Pawan: ఆ విషయంలో పవన్‌ని మళ్లీ వాడుకుంటున్న పూనమ్‌ కౌర్‌.. ప్రభాస్‌, బాలయ్యలనూ వదలడం లేదుగా!

Published : Mar 13, 2022, 12:13 PM IST

పూనమ్‌ కౌర్‌ అంటే సినిమాల్లో కంటే వివాదాల్లోనే, వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తుంది. ముఖ్యంగా పవన్‌ విషయంలో ఆమె చేసే కామెంట్లు తరచూ హాట్‌ టాపిక్‌ అవుతుంటాయి. తాజాగా పవన్‌తోపాటు ప్రభాస్‌, బాలయ్యలపై కూడా కామెంట్లు చేసింది. 

PREV
16
Poonam On Pawan: ఆ విషయంలో  పవన్‌ని మళ్లీ వాడుకుంటున్న పూనమ్‌ కౌర్‌.. ప్రభాస్‌, బాలయ్యలనూ వదలడం లేదుగా!

పూనమ్‌ కౌర్‌(Poonam Kaur) చాలా కాలం తర్వాత తెలుగులో `నాతిచరామి` అనే సినిమా చేస్తుంది. తాజాగా పలు ఓటీటీల్లో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్‌లో భాగంగా బిజీగా గడుపుతోంది పూనమ్‌. వరుసగా ఇంటర్వ్యూలిస్తూ వార్తల్లో నిలుస్తుంది. అయితే వార్తల్లో నిలవడమే కాదు, బ్రేకింగ్‌ పాయింట్‌గా మారాలనే ప్రయత్నం చేస్తుంది. అందుకు మరోసారి పవన్‌ని వాడుకుంటుంది. ఆయనతోపాటు ప్రభాస్‌, బాలయ్య ప్రస్తావన తీసుకొచ్చింది. 
 

26

పవన్‌ కళ్యాణ్‌(Pawan Kalyan)పై తన క్రష్‌ని వెల్లడిస్తూ తన ఆవేదన చెప్పుకుంటుంది. మరోసారి ఆయన ప్రస్తావన రావడంతో సిగ్గుముగ్గేసింది పూనమ్‌. ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫోటో చూపించగా, అంతకు ముందే పీకే లవ్స్ అని అనేసి పెద్దగా నవ్విన పూనమ్.. నాపేరే పూనమ్ కౌర్.. పీ అంటే పూనమ్.. కే అంటూ కౌర్ (PK)అని చాలా తెలివిగా పీకే అర్థాన్ని మార్చేసింది.

36

అయితే పవన్‌ గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోతుందని, ఆయనతో నటించాలనుకున్నా, కానీ కొంతమంది యాక్ట్ చేయనీయలేదు. ఇప్పుడు ఆయన గురించి ఏమీ చెప్పలేను..పాజిటివ్‌గా చెప్పినా సమస్యే, నెగటివ్‌గా చెప్పినా సమస్యే, అందుకే ఏం చెప్పను అని వెల్లడించింది. కానీ పవన్‌ ఫోటో చూస్తుంటే నాకు సిగ్గొచ్చేస్తుందే అంటూ సిగ్గులు పోవడం విశేషం. ఒక్కమాట చెప్తా.. `దేవుడా.. ఆయనతో అయినంతవరకూ చాలు` అంటూ దండం పెట్టి మరింత వివాదాన్ని రాజేసింది. 

46

ఈ సందర్భంగా ప్రభాస్‌(Prabhas)పై ప్రశంసలు కురిపించింది. `స్టార్స్ చాలామంది ఉన్నారు. యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. కానీ మన ఇండియాలో మనుషుల్ని నమ్మి ఐదు సంవత్సరాలు ఒకే ఒక్క మూవీకి అది కూడా ప్రైమ్ టైంలో కేటాయించడం అనేది చాలా గ్రేట్. ఆయన లుక్స్ గురించి కాదు, క్రేజ్ గురించి కాదు, వ్యక్తిత్వం గురించి, నమ్మని వాళ్లకోసం నిలబడటమే ఆ క్యారెక్టర్` అని వెల్లడించింది. 

56

`రాధేశ్యామ్` గురించి చెబుతూ, నాకు లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఇండియన్ లవ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టపడతానని, `రాధేశ్యామ్` కూడా మంచి లవ్ స్టోరీ కావడంతో నాకు బాగా నచ్చిందని చెప్పింది. `నిర్మాత బాగు కోసం ఇంతలా ప్రమోషన్స్ చేసే హీరోని ప్రభాస్‌నే చూస్తున్నా. `ఇన్ని కోట్లు బడ్జెట్ వద్దని ప్రొడ్యుసర్స్‌కి చెప్పాను. మేకింగ్ కోసం చాలా డబ్బులు ఖర్చుపెట్టారు. నెక్స్ట్ టైం ఇలా చేయొద్దని చెప్పాను. వాళ్ల కోసం మనస్పూర్తిగా వచ్చి ప్రమోషన్స్ చేస్తున్నా` అని ప్రమోషన్స్‌లో చెప్తున్నారు ప్రభాస్. ఏ హీరో కూడా ఇలా చెప్పలేదు` అని తెలిపింది. ప్రభాస్‌ తో నటించాలని ఉందని తెలిపింది. 

66

ఇక బాలయ్య(Balayya) గురించి చెబుతూ, ఆయన చిన్నపిల్లాడు అని, అందువలే ఇంత ఏజ్‌ వచ్చినా ఎనర్జిటిక్‌గా ఉంటారని తెలిపారు. ఆయనొక మాంన్షన్‌ హౌజ్‌ అని పేర్కొంది. ఇప్పుడున్న సీనియర్‌ హీరోలందరికి ఒక బ్లెస్సింగ్స్ ఉన్నాయని, అందుకే హీరోలుగా రాణిస్తున్నారని తెలిపింది పూనమ్‌. బాలయ్య(Balakrishna)తో నటించే అవకాశం వచ్చిందని, తాను శ్రీదేవి పాత్ర పోషిస్తానని అన్నానని, కానీ వాళ్లు ఒప్పుకోలేదని, దీంతో ఆ సినిమాని వదిలేసుకున్నట్టు చెప్పింది పూనమ్‌ కౌర్‌.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories