ఫైబ్రోమయాల్జియా వ్యాధి శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి ముఖ్యంగా ఎమోషనల్ గా ఫీల్ కావడం వల్ల వస్తుంది అని అంటున్నారు. కారు ప్రమాదం లాంటి యాక్సిడెంట్స్ వల్ల కూడా ఈ వ్యాధి మొదలవుతుంది. దీని లక్షణాలు దారుణంగా ఉంటాయి. శరీరం మొత్తం నొప్పులు ఉంటాయి. ఈ వ్యాధి జాయింట్స్ ని, కండరాలని డ్యామేజ్ చేయదు కానీ.. నొప్పులకు కారణం అవుతుంది.