నటి జయలక్ష్మి టాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. తల్లిగా, వదినగా అనేక పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తన కుమార్తె అమెరికాలో ఉండడం వల్ల అక్కడికి వెళుతూ తిరిగి ఇండియా వచ్చి నటించడం కష్టంగా మారుతోందట. ఫలితంగా అనేక అవకాశాలు చేజారుతున్నట్లు జయలక్ష్మి పేర్కొన్నారు.
ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. జయలక్ష్మికి కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయట. దాసరి నారాయణ రావు కుటుంబానికి జయలక్ష్మి బాగా క్లోజ్ అట. దాసరి సతీమణి పద్మ రికమండేషన్ తో పొలిటికల్ రౌడీ అనే చిత్రంలో అవకాశం వచ్చిందట.
ఆ చిత్రంలో ఆమె పాత్ర ఐఏఎస్ అధికారి భార్యగా క్లబ్ కి ప్రెసిడెంట్ గా నటించడం. దీనితో ఆమె మంచి హుందాగా ఉండే పాత్ర అని సంతోష పడిందట. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన తర్వాత ఒక సన్నివేశంలో ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి కొంగు జార్చే సన్నివేశం అది. సాధారణంగా మహిళలకు పొరపాటున కొంగు జారడం సహజమే.
కానీ ఎదుటి వ్యక్తిని ఇంప్రెస్ చేయడానికి కొంగు జార్చడం చాలా అసభ్యంగా ఇబ్బంది కరంగా ఉంటుంది. అందుకే ఇలాంటివి నేను చేయనని చెప్పేశా. దీనితో కో డైరెక్టర్లు, మేనేజర్ చాలా రిక్వస్ట్ చేశారు. నేను ఒప్పుకోలేదు. దీనితో ఈ విషయం మోహన్ బాబు దగ్గరికి వెళ్ళింది.
ఏంటంట ఆ అమ్మాయి సమస్య అని అడిగారట. చేయలేను అని కో డైరెక్టర్లు చెప్పడంతో నన్ను పంపించి వేశారు. కానీ మోహన్ బాబు నన్ను ఒక్క మాట కూడా అనలేదు. సెట్ లో ఏదైనా సమస్య వస్తే మోహన్ బాబు భయంకరంగా తిడతారు. కానీ నన్ను ఒక్క మాట కూడా అనలేదు.
దీనితో ఆయనపై గౌరవం పెరిగింది అని అన్నారు. బహుశా దాసరి పద్మ గారికి తెలిసిన అమ్మాయి అని వదిలేశారేమో అంటూ జయలక్ష్మి నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం తనకి టివి సీరియల్స్ లో కూడా అవకాశాలు వస్తున్నాయని అన్నారు.