ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా పూనమ్ కౌర్.. పవన్ ని కెలకడం కోసం ఇలా, జగన్ ఫ్యామిలీ గురించి అలా..ఫ్యాన్స్ ఫైర్

Published : Jun 16, 2024, 02:50 PM IST

హీరోయిన్ పూనమ్ కౌర్ తరచుగా ఏపీ పాలిటిక్స్ పై పరోక్ష వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం.  ముఖ్యంగా ఆమె పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. గతంలో పలు మార్లు పూనమ్ కౌర్ పై ట్రోలింగ్ జరిగింది. 

PREV
16
ఎన్నికల ఫలితాలపై పరోక్షంగా పూనమ్ కౌర్.. పవన్ ని కెలకడం కోసం ఇలా, జగన్ ఫ్యామిలీ గురించి అలా..ఫ్యాన్స్ ఫైర్

ఎన్నికల హంగామా ముగిసింది. అక్కడ కేంద్రంలో మోడీ మరోసారి ప్రధాని అయ్యారు. ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఘన విజయం సాధించిన టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 

26

హీరోయిన్ పూనమ్ కౌర్ తరచుగా ఏపీ పాలిటిక్స్ పై పరోక్ష వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం.  ముఖ్యంగా ఆమె పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ నర్మగర్భంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. గతంలో పలు మార్లు పూనమ్ కౌర్ పై ట్రోలింగ్ జరిగింది. అయితే ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చాక పూనమ్ కౌర్ పవన్ గురించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు. 

36

గెలుపోటముల గురించి కూడా మాట్లాడలేదు. కానీ పరోక్షంగా కొన్ని కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ని కెలకడం కోసమే ఆమె ఈ ట్వీట్ చేసిందా అని నెటిజన్లు సందేహ పడుతున్నారు. గత ఐదేళ్లలో పూనమ్ కౌర్ ఎప్పుడు కూడా సుగాలి ప్రీతి హత్య గురించి స్పందించలేదు. 

46

కానీ ఎన్నికల ఫలితాలు రాగానే ఆమె ట్వీట్ చేసింది. సుగాలి ప్రీతి హత్య విషయంలో పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వంతో పోరాటం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక పూనమ్ కౌర్ ట్వీట్ చేస్తూ.. సుగాలి ప్రీతి సంఘటనలో ఎంత త్వరగా న్యాయం జరుగుతుందో అని ఎదురు చూస్తున్నా. ఆమె తల్లి చేస్తున్న పోరాటానికి న్యాయం దక్కాలి అంటూ పోస్ట్ పెట్టింది. 

56

సుగాలి ప్రీతి విషయంలో న్యాయం జరగాలి అని కోరుకోవడం మంచి విషయమే. కానీ గత ఐదేళ్లు ఏం చేస్తున్నావ్.. మొద్దు నిద్ర పోతున్నావా అంటూ నెటిజన్లు పూనమ్ కౌర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. ఎన్నికల ఫలితాలు రాగానే ఈ సమస్య గుర్తుకు వచ్చిందా అని విమర్శిస్తున్నారు. 

66

అదే విధంగా ఎన్నికల ఫలితాల గురించి ప్రస్తావించకుండా పూనమ్ కౌర్.. వైఎస్ జగన్ కుటుంబం గురించి కామెంట్స్ చేసింది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి విజయానికి మూల కారకులు ఆమె తల్లి, సోదరి, భార్య. వారి వారి శైలిలో సహనం ఓర్పు నేర్పించారు. వీళ్లంతా ప్రేమానురాగాలతో కలసి ఉండాలని కోరుకుంటున్నా అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. 

Read more Photos on
click me!

Recommended Stories