
పవన్ కళ్యాణ్(Pawan kalyan), రేణు దేశాయ్(Renu desai) విడిపోయి ఏళ్ళు గడుస్తోంది. అయినా సరే ఆయన ఫ్యాన్స్ మాత్రం ఆమెను వదలడం లేదు. సోషల్ మీడియాలో ఆమె ఏ పోస్ట్ పెట్టునా అక్కడ కామెంట్స్ రూపంలో వస్తారు. అలాగే ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్ట్ లు పెడుతూంటారు. అప్పటికీ ఈ విషయంపై చాలాసార్లు రేణు దేశాయ్ కూడా వివరణ ఇచ్చారు. దయచేసి తన దగ్గర ఆయన ప్రస్తావని నా దగ్గర తీసుకురాకండి అని చెప్తూ వచ్చారు. అయినా కూడా పట్టించుకోకవడంతో చాలా మందిని బ్లాక్ కూడా చేసింది. తాజాగా అలాంటి మరో సారి ఆమె పవన్ ఫ్యాన్స్ పై మండిపడాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది.
రీసెంట్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎవరూ ఊహించని మెజారిటీతో ముందుకు వచ్చారు. అలాగే తన పార్టీని సైతం గెలిపించుకున్నారు. దీంతో మెగా అభిమానులు అంతా సంబరాలు మూడ్ లో ఉన్నారు. అయితే తాజాగా ఓ పవన్ అభిమాని ఆమెను ట్యాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేసారు. దానికామె స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఇప్పుడు వైరల్ అవుతుంది.
అసలేం జరిగిందో చూస్తే... సుధాకర్ అనే పవన్ అభిమాని రేణు దేశాయ్‌ని ట్యాగ్ చేస్తూ.. ”వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం” అంటూ కామెంట్ చేసాడు.
ఈ పోస్ట్‌కు రేణు దేశాయ్ రిప్లయ్ ఇస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ”సుధాకర్ గారు మీకు కొంచెం అన్న బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ ను నేను వదిలేయలేదు. అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి”. ఇలాంటి కామెంట్స్ పెట్టి అంటూ రేణు దేశాయ్ రిప్లై ఇచ్చింది.
మరో ప్రక్క రేణు దేశాయ్ దగ్గర పెరుగుతున్న పవన్ కల్యాణ్ కొడుకు అకిరా నందన్ వార్తల్లో నిలుస్తున్నారు. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత ఆకిరా నందన్ సెంట్రర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా మారారు. పవన్ విజయం సాధించిన సమయంలో కూడా అకిరా తండ్రితోనే ఉన్నారు. చంద్రబాబు, ప్రధాని మోదీని పవన్ కలిసిన సమయంలో అకిరా ఆయన వెంటే ఉన్నారు. దీంతో అకిరా నందన్‌పై అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఇప్పుడు అకిరాను PSPK2 అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అకిరాను పవన్ కళ్యాణ్ 2 (PK 2) అంటూ అభిమానంగా పిలుచుకుంటున్నారు. అంతేకాదు తొందరగా హీరో అయిపో అన్న అని ఒకరు, ఎడిటర్ అవ్వండి అంటూ మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆకిరాకు కాని.ఆయన తండ్రి పవన్ కల్యాణ్‌కు కానీ జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలిపించుకోవడం ఇష్టముండదు. మీ ఫీలింగ్స్‌ను ఆకిరా మీద బలవంతంగా రుద్దకండి అంటూ పవన్ ఫ్యాన్స్ చేసిన కామెంట్స్‌కు ఆమె రిప్లై ఇచ్చారు.
ఆకిరా పుట్టిన దగ్గర నుంచి కూడా నేను అతనికి అభిమానిని..అతను ఎప్పుడు నటిస్తాడా అని నాకు ఎంతో అతృతుగా ఉంది. అయితే అంతకంటే ముందు నేను ఆయన తల్లిని. అతను ఏ నిర్ణయం తీసుకున్న గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉందంటూ ఉందని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఆకిరా సినీ ఎంట్రీపై ఇలాంటి చర్చలు పెట్టి చిరాకు తెప్పించకండి.. ప్లీజ్ అర్థం చేసుకోండంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
కొద్ది రోజుల క్రితం మరో సంఘటన జరిగింది. స్వతహాగా రేణు దేశాయ్ చిన్నప్పటినుండి జంతు ప్రేమికురాలు. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్స్టాలో పెట్స్ కి సంబందించిన ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో కింద ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. మీది కూడా పవన్ కళ్యాణ్ లాగే గోల్డెన్ హార్ట్.. అంటూ రాసుకొచ్చాడు. ఆ కామెంట్ కి సహనం కోల్పోయిన రేణు దేశాయ్ ఆ నెటిజన్ పై ఫైర్ అయ్యారు..
ఎందుకు నా చేసే పోస్టులను ప్రతిసారి నా ఎక్స్ హస్బెండ్ తో కంపేర్ చేస్తారు. ఇప్పటికే ఇలాంటి చాలా మందిని బ్లాక్ చేశాను, డిలీట్ కూడా చేశాను. నాకు పదేళ్లు ఉన్నప్పటి నుంచి యానిమల్స్ అంటే ఇష్టం. ప్రస్తుతం సింగిల్ గా యానిమల్ సర్వీస్ చేసుకుంటున్నాను. దీనికి నా ఎక్స్ హస్బెండ్ కి ఎలాంటి సంబంధం లేదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను.. ప్రతి పోస్ట్ కి ఆయనతో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేయకండి. అతను నాలాగా యానిమల్స్ లవర్ కాదు.. అని రిప్లై ఇచ్చారు.
రేణూ దేశాయ్ నెట్టింట్లో ఈ మధ్య వరుసగా పోస్టుల మీద పోస్టులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అంటూ మాజీ భర్త గురించి ప్రస్తావిస్తోంది. అకిరా, ఆద్యలు తమ తండ్రితో ఉన్న క్షణాల గురించి చెబుతోంది. పవన్ కళ్యాణ్ గెలుపు, ప్రమాణ స్వీకారం మీద కూడా రేణూ దేశాయ్ స్పందించారు. అకిరా, ఆద్యలు ఎంత సంతోషంగా ఉన్నారు.. అనేది చూపిస్తూ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఇక తనకు బీజేపీ పట్ల ఉన్న ప్రేమను, మోదీ మీదున్న గౌరవాన్ని కూడా చాటుకున్నారు.