
నటిగా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ పూనమ్ కౌర్(Poonam Kaur) ఎమోషనల్ అయ్యింది. తాను చాలా గ్యాప్‌తో నటించిన `నాతిచరామి` చిత్ర ప్రెస్‌మీట్‌లో భావోద్వేగానికి గురైంది. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడంతో తాను కన్నీళ్లు ఆపుకోలేకపోయానని తెలిపింది. ఆ రోజు అలా జరిగి ఉంటే, ఇప్పుడు ఇలా స్టేజ్‌పై మాట్లాడేదాన్ని కాదని తెలిపింది. పరోక్షంగా తన గత విషయాలను ప్రస్తావిస్తూ, తనకి సంబంధించిన బ్యాడ్ డేస్ ని గుర్తు చేసుకుంది. కన్నీళ్లు పెట్టుకుంది.
Poonam Kaur తాజాగా నాగు గవర దర్శకత్వంలో రూపొందిన `నాతిచరామి` చిత్రంలో నటించింది. ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పూనమ్ కౌర్.. స్టేజ్‌పైకి వచ్చి రాగానే చాలా రోజుల తర్వాత అందరిని ఇలా చూడటం ఆనందంగా ఉందంటూనే ఎమోషనల్ అయ్యింది. మాటలు రావడం లేదని తెలిపింది. పక్కన ఉన్న మరో నటి ఆమెని ఓదార్చగా, కాసేపటికి తేరుకుని తన మనసులోని బాధని, ఈసినిమా విశేషాలను పంచుకుంది.
`దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న స్త్రీ మీద కన్ను వేసిన వాడు రాక్షసుడైతాడు. అదే కథైతే..` అంటూ స్టార్ట్ చేసిన పూనమ్ చాలా షాకింగ్ విషయాలను పేర్కొంది. తాను సినిమాలు వదిలేసి వెళ్లిపోవాలనుకున్నట్టు తెలిపింది. `2017, 18లో నేను పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోతామనుకున్నా. కానీ నా జీవితాన్ని సినిమానే మార్చేసింది. `దాని తర్వాత` నేను సినిమాలు చేయను. పెళ్లి చేసుకుని యూఎస్ వెళ్లిపోతాననని మా మమ్మీకి చెప్పాను. ఈ దేశం వదిలి వెళ్లిపోతానని చెప్పా` అని పేర్కొంది పూనమ్.
అయితే తాను `మోస్ట్ డిఫికల్ట్ సిచ్చువేషన్స్ లో రియలైజ్ అయ్యాను. దానివల్లే ఇక్కడ ఉన్నాను. రోజూ సీత, దుర్గా, ద్రౌపదిలనే తలచుకునేదాన్ని. దాని వల్ల చాలా శక్తిని, ధైర్యాన్ని పొందాను. ప్రత్యేకంగా మధ్య తరగతి ఫ్యామిలీ నుంచి అమ్మాయిలకు చాలా కలలుంటాయి. అందులో ఇంకా ప్రత్యేకమైన కల పెళ్లి. అయితే ఇండియన్ కల్చర్‌లోనే మహిళలు ఎలా ధైర్యంగా ఉండాలనేది, పోరాడాలనేది ఉంది. దాన్నుంచి నేను స్ఫూర్తి పొందాను. ఈ విషయంలో మా అమ్మ ఎంతో సపోర్ట్ చేసింది` అని వెల్లడించింది పూనమ్ కౌర్.
`ఇక సినిమాలు చేయను, ఇండియా నుంచి వెళ్లిపోతా అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఇలా ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ ఉంది. ఇది రియల్ లైఫ్ ఇన్స్ డెంట్స్ ఆధారంగా తయారు చేసిందని, వైఫ్ గురించి చెప్పే కథ అని చెప్పింది. ఇందు(నాతిచరామి`లోని శ్రీలత పాత్ర నా జీవితానికి చాలా దగ్గరగా ఉంది. నేను శ్రీలత లాంటి వైఫ్‌గా ఉండాలనుకున్నా.పెళ్లి చేసుకుని పిల్లలను కనాలనుకున్నాను. కానీ మళ్లీ ఇలా వస్తాను, మాట్లాడతానని అనుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని లైట్ తీసుకున్నా. మూడేళ్ల క్రితం నా ఆలోచనలు 18ఏళ్ల కిడ్‌లా ఉన్నాయి. ఇప్పుడు 50ఏళ్ల మహిళగా ఉన్నాయి. దీనింతటికి కారణం నా వెనకాల ఉన్న స్ట్రాంగ్ మదర్ వల్లే సాధ్యమైంద`ని చెప్పింది పూనమ్.
ఈ సందర్భంగా దర్శకుడు నాగు గవర, టెక్నీషియన్లు, చిత్ర బృందం, సినిమా గురించి వెల్లడించింది. మహిళా శక్తిని చాటే చిత్రమని, అందరికి నచ్చుతుంది. ప్రతి ఒక్కరు సినిమా చూసి దాని గురించి ఇతరులకు చెప్పాలని పేర్కొంది పూనమ్ కౌర్. ఇదిలా ఉంటే పూనమ్ కౌర్ ఆ మధ్య తాను ఓ దర్శకుడి వల్ల మోసపోయినట్టు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తనని వాడుకుని వదిలేశారని, ఏ టైమ్‌లోనైనా తాను అండగా ఉంటానని చెప్పిన ఆ వ్యక్తి `నువ్వు చచ్చిపోతే ఒక్క రోజు పేపర్‌లో న్యూస్ అవుతావు, తనని ఏం చేయలేవని బెదిరించాడని ఆరోపిస్తూ వరుస ట్వీట్లు చేసింది. ఆ డైరెక్టర్‌ని `గురూజీ` అని పేర్కొనడం విశేషం. అలాగే ఓ హీరో వల్ల ప్రేమలో మోసపోయినట్టు పేర్కొంది.
ఇలాంటి వివాదాల అనంతరం పూనమ్ కెరీర్ ఇక అయిపోయిందనుకున్నారు. ఆమె కూడా సినిమాని వదిలేసి యూఎస్ వెళ్లిపోదామనుకుందని తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు కమ్ బ్యాక్ అవుతూ `నాతిచరామి` సినిమాలో నటించింది. అరవింద్ కృష్ణ, సందేష్ బూరి ఇతర ముఖ్య పాత్రధారులు. స్టూడియో 24 ఫ్రేమ్స్ పతాకంపై జై వైష్ణవి కె నిర్మించారు. ఇది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రికార్డ్ స్థాయిలో అమెజాన్, హంగామా,సోనీ,టాటా స్కై,ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, యమ్.ఎక్స్, ప్లేయర్ వంటి 20 ఓటిటి ప్లాట్ ఫాంలలో ఈ నెల 10 న స్ట్రీమింగ్ అవుతుంది.
చిత్ర దర్శకుడు నాగు గవర మాట్లాడుతూ ..ప్రపంచంలో ఉన్న స్త్రీ మూర్తులందరికీ శిరస్సు వచ్చి మహిళాదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.అరవింద్ కృష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి… ముగ్గురి పాత్రల మధ్య జరిగే సంఘర్షణ ‘నాతిచరామి’. బలమైన సన్నివేశాలు, అర్థవంతమైన సంభాషణలు, అద్భుతమైన అభినయంతో సినిమా ఉంటుంది. 1999, 2000 ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా, రూపొందించిన చిత్రమిది. ఇక్కడ జరిగిన క్రైమ్ కంటే దీని చుట్టూ జరిగిన డ్రామా నచ్చింది. ఈ కథకు సరైన యాక్టర్ ఉంటే ఈ కథను పవర్ ఫుల్ గా చెప్పచ్చు. అనిపించి శ్రీలత క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని ఈ కథకు పూనమ్ కౌర్ అయితే బాగుంటుందని తనకి ఈ కథ చెప్పడం జరిగింది. ఇంతవరకు తను చేయని రోల్ ఇది. ఇందులో తను చాలా హార్డ్ వర్క్ చేసింది. ఇందులో ఉన్న కంటెంట్ ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది.