కాస్తా శ్రద్ధ వహిస్తే పూనమ్ బజ్వా ఎప్పుడో స్టార్ హీరోయిన్ అయ్యేది. తెలుగులో పూనమ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) సరసన ‘బాస్’ చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ నటించి ప్రేక్షకులను అలరించింది. చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో కీలక పాత్ర పోషించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం మలయాళంలో ‘మే హూమ్ మూసా’లో నటిస్తోంది.