జిమ్‌లో పూజా హెగ్డే వర్కౌట్స్ చూస్తే మైండ్‌ బ్లాకే.. టైట్‌ ఫిట్‌లో ఆగకుండా చేస్తూ షాకిచ్చిన బుట్టబొమ్మ..

Published : Jul 05, 2023, 03:41 PM IST

బుట్టబొమ్మగా పాపులర్‌ అయిన పూజా హెగ్డే.. స్లిమ్‌గా, ఫిట్‌గా ఉంటుంది. ఎప్పుడూ సేమ్‌ లుక్‌ని మెయింటేన్‌ చేస్తుంటుంది. అంతే అందంగా, హాట్‌గానూ ఉంటుంది. దానికి వెనకాల కఠినమైన శ్రమ ఉంది.   

PREV
17
జిమ్‌లో పూజా హెగ్డే వర్కౌట్స్ చూస్తే మైండ్‌ బ్లాకే.. టైట్‌ ఫిట్‌లో ఆగకుండా చేస్తూ షాకిచ్చిన బుట్టబొమ్మ..

పూజా హెగ్డే తాజాగా జిమ్‌లో శ్రమిస్తున్న వీడియోని పంచుకుంది. ఇందులో ఆమె కఠినమైన వర్కౌట్స్ చేస్తుంది. బాక్సింగ్‌ బ్యాగ్‌లపై నుంచి కిందకి పైకి పుషప్స్(కోర్‌ ఫినిషర్‌ ఎక్సర్‌సైజ్‌)  చేసింది. ఆగకుండా ఆమె ఏడు సార్లు చేసింది. తన స్టామినా ఏంటో నిరూపించింది. 

27

పూజా హెగ్డే నడుము ఇంత స్లిమ్‌గా ఉండటానికి కారణం ఇప్పుడు అర్థమైంది. ఆమె అందుకోసం ఎంత కష్టపడుతుందో ఈ వర్కౌట్స్ వీడియో ద్వారా తెలుస్తుంది. టైట్‌ ఫిట్‌లో థైస్‌ అందాలతో పూజా ఆకట్టుకుంటుంది. అదే సమయంలో మేకప్‌ లేకుండా ఆమె లుక్‌ సో క్యూట్‌ అనేలా ఉండటం విశేషం. 
 

37

పూజా హెగ్డే ఈ జిమ్‌ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫైరింగ్‌ ఎమోజీలను షేర్‌ చేస్తుంది. సెలబ్రిటీలు సైతం కామెంట్లు చేస్తుండటం విశేషం. క్లాప్స్ ఎమోజీలను షేర్‌ చేస్తూ ఆమెని అభినందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పూజా జిమ్‌ వీడియో నెట్టింట రచ్చ చేస్తుంది. 
 

47

టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డే హాట్‌ లుక్‌లో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇటీవల గ్లామర్‌ ఫోటో షూట్లతో ఆకట్టుకుంది. ఆడియెన్స్ ని ఎంతగానే అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ పెంచుకుంటుంది. ఆమె ఫోటోలకు సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అంతటి ఫాలోయింగ్‌ కారణంగానే నెట్టింట రచ్చ చేస్తుందీ బ్యూటీ. 
 

57

ఇక పూజా కెరీర్‌ మాత్రం ఇప్పుడు రివర్స్ అయ్యింది. గతేడాది వరకు తీరిక లేకుండా గడిపిన ఈ బ్యూటీ ఇప్పుడు ఖాళీ అయిపోయిన పరిస్థితి నెలకొంది. మహేష్‌బాబుతో కలిసి నటించే `గుంటూరు కారం` నుంచి అనూహ్యంగా తప్పుకుంది. మరోవైపు పవన్‌ కళ్యాణ్‌ సినిమాలోనూ ఆమె పాత్ర డౌట్‌గానే ఉంది. 
 

67

అయితే వరుసగా పరాజయాలు ఈ బ్యూటీ కెరీర్‌ని ఇబ్బందుల్లో పడేస్తున్నాయి. నటించిన ఐదు సినిమాలు బ్యాక్‌ టూ బ్యాక్‌ పరాజయం చెందాయి. అంతకు ముందు లక్కీ హీరోయిన్‌గా, గోల్డెన్‌ లెగ్‌గా పిలుచుకున్న ఇండస్ట్రీ వర్గాలు ఇప్పుడు మరో రకంగా నిందలు వేయడం ప్రారంభించారు. కానీ తాను మాత్రం తన స్టయిల్లో ముందుకు సాగుతుంది. 

77

ప్రస్తుతం పూజాకి రెండు మూడు సినిమాలకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయట. ప్రస్తుతం కొత్తగా ఇంకా మరేదీ కన్ఫమ్‌ కాలేదు. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories