Bheemla Nayak:బ్లాక్ బస్టర్ టాక్ కలెక్షన్స్ వీక్... భీమ్లా నాయక్ తో ఎంత నష్టమంటే!

First Published Mar 24, 2022, 6:36 PM IST


భీమ్లా నాయక్ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. భీమ్లా నాయక్ రీమేక్ మూవీ అనే విషయం కూడా మర్చిపోయి.. ఓ స్ట్రెయిట్ మూవీకి చేసినంత సందడి చేశారు. 
 

అలాగే సోషల్ మీడియాలో సినిమాకు భారీ ప్రచారం కల్పించారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ప్రతి ఫ్యాన్స్ ట్విట్టర్, పేస్ బుక్ వంటి సోషల్ మాధ్యమాల్లో భీమ్లా నాయక్ అద్బుతమన్న ప్రచారం చేశారు. సగటు సినిమా ప్రేక్షకులు మాత్రం భీమ్లా నాయక్ చిత్రానికి యావరేజ్ మార్క్స్ వేశారు. ఫ్యాన్స్ ఎంత హైప్ క్రియేట్ చేసినా వీకెండ్ తర్వాత భీమ్లా నాయక్ వసూళ్లు పడిపోయాయి.


అయితే నెక్స్ట్ వీక్ పెద్ద చిత్రాల విడుదల లేకపోవడంతో పాటు మహాశివరాత్రి హాలిడేస్ చిత్రానికి కలిసొచ్చాయి. లేదంటే భీమ్లా నాయక్ నష్టాలు మరింతగా ఉండేవి. ఇక భీమ్లా నాయక్ మార్చి 24 నుండి ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ లో ఈ మూవీ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో భీమ్లా నాయక్ అంతిమ ఫలితం ఈ విధంగా ఉంది. 


క్రేజీ కాంబోలో రూపొందిన 'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో కలిసి రూ. 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది. అలాగే, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ. 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు రూ. 9 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ ప్రతిష్టాత్మక చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ను చేసుకుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

'భీమ్లా నాయక్' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ముగింపు సమయానికి కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 35.02 కోట్లు, సీడెడ్‌లో రూ. 11.22 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 7.65 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.49 కోట్లు, వెస్ట్‌లో రూ. 5.11 కోట్లు, గుంటూరులో రూ. 5.26 కోట్లు, కృష్ణాలో రూ. 4.29 కోట్లు, నెల్లూరులో రూ. 2.80 కోట్లతో కలిపి రూ. 76.84కోట్లు షేర్, రూ. 117.85 కోట్లు గ్రాస్‌ దక్కింది.

ఆంధ్రా, తెలంగాణలో రూ. 76.84 కోట్లు వసూలు చేసిన 'భీమ్లా నాయక్' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ నిరాశనే ఎదుర్కొంది. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.24 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 12.55 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ముగింపు సమయానికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 97.63 కోట్లు షేర్‌తో పాటు రూ. 159.10 కోట్ల గ్రాస్ వచ్చింది.

భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన 'భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లోనే రూ. 97.63 కోట్లు వసూలు చేసింది. నైజాం, ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన భీమ్లా నాయక్ ఏపీ, రెస్టాఫ్ ఇండియా నష్టాలు మిగిల్చింది. మొత్తంగా రూ. 10.37 కోట్ల నష్టాలు మిగిల్చింది. 
 

భారీ మల్టీస్టారర్‌గా రూపొందిన 'భీమ్లా నాయక్'కు ప్రపంచ వ్యాప్తంగా రూ. 106.75 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 108 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లోనే రూ. 97.63 కోట్లు వసూలు చేసింది. నైజాం, ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ సాధించిన భీమ్లా నాయక్ ఏపీ, రెస్టాఫ్ ఇండియా నష్టాలు మిగిల్చింది. మొత్తంగా రూ. 10.37 కోట్ల నష్టాలు మిగిల్చింది. 
 

click me!